‘మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్‌’ లాంచ్ ఎప్పుడంటే..

November 29, 2018 | News Of 9
Launch date of Mahesh Multiplex...??| news of 9

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఒక వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు ఎంట‌ర్‌టైన్మెంట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి AMB CINEMAS పేరిట మహేష్ ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించ‌గా, దాదాపు ఇది పూర్తి కావొచ్చింది. ఈ మ‌ల్టీఫ్లెక్స్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు కూడా చేస్తున్నారు.

నిజానికి ఈ మ‌ల్టీఫ్లెక్స్‌ను అమితాబ్ బ‌చ్చ‌న్‌, అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతోనే మ‌ల్టీ ప్లెక్స్‌ని ప్రారంభించాల‌ని అనుకున్న‌ప్ప‌టికి , నిర్మాణం పూర్తి కాక‌పోవ‌డంతో వాయిదా వేశారు. ఇక న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 2.O చిత్రంతో ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాని లేజర్ స్క్రీనింగ్ పనులు ఆలస్యం కావడం వల్ల మల్టీ ఫ్లెక్స్ ఓపెనింగ్ కు ముహూర్తం వాయిదా ప‌డింద‌ట‌.

హైద‌రాబాద్‌లోని హైటెక్ ఏరియా గ‌చ్చిబౌలిలో లేటెస్ట్ క్వాలిటీస్‌తో రూపొందిన ఈ మ‌ల్టీఫ్లెక్స్‌ను డిసెంబ‌ర్ 2న లాంచ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు లేటెస్ట్ టాక్. నిర్వహకులు మాత్రం ఇంత వరకు ఓపెనింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ఈ మ‌ల్టీఫ్లెక్స్‌లో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7 స్క్రీన్స్ ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *