బలుసుల్లంకలో చిరుత కలకలం..

February 14, 2019 | News Of 9

Leopard attack in East Godavari

ముమ్మిడివరం: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక పంచాయతీ బలుసుల్లంకలో ఒక చిరుతపులి దాడి సంఘటన కలకలం సృష్టించింది. ఉదయం సమయంలోబహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. ఎలాగో తప్పించుకుని ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. గ్రామస్తులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిరుత బలుసుల్లంక వద్ద అరటితోటలో దాగి ఉందని తెలుస్తోంది. దీంతో స్థానికులంతా భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.

ఇంతకు ముందు ఈనెల 4న ఆత్రేయపురం మండలంలోని అంకంపాలెంలో  స్థానికులపై చిరుతపులి దాడి చేసింది. దాడి అనంతరం చిరుత అక్కడే ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కింది. అనంతరం అర్ధరాత్రి దాటాకా చెట్టు పైనుంచి దూకి పారిపోయిందని తెలిసింది. ఆ సంఘటన అనంతరం ఇవాళ మరోసారి చిరుత జాడతో లంకలో అలజడిరేగింది. ఈ సంఘటన మండలంలోని ఇతర గ్రామాల ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. అటవీ శాఖ అధికారులు స్పందించి ప్రజల్లో భయాందోళనలను తొలిగించాలని వారంతా కోరుతున్నారు.

 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *