చారుకేశా… మన లోకేశు అచ్చు నాన్నారి పోలికే!!

November 24, 2018 | News Of 9

Lokesh and CBN | telugu.newsof9.com

2019 ఎన్నికల్లో మన కులం ఆంధ్ర… మన మతం ఆంధ్ర… మన ప్రాంతం ఆంధ్ర… ఈ నినాదంతో ఓట్లు వేసి గెలిపించండి.

లోకేష్

ముందు మీకు ఒక చిన్న కథ చెప్పాలి. అడవిలో పులి ఈ ప్రాంతంమంతా నాది… దీని పరిధిలోకి ఎవరూ రాకూడదంటూ కట్టడి చేస్తుంది. మిగిలిన జంతు జాతిని ఆ పరిధిలోకి రానివ్వదు. అందుకోసం అది తన రాజ్య సరిహద్దులను నిర్ణయించుకుని అక్కడక్కడా మూత్ర విసర్జన చేసి పోతుంది. మిగిలిన జంతువులకు అదే లెక్క. బతుకు మీద ఆశ ఉన్నదేదీ ఆ పరగణాలోకి రాదు.ఇదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పెట్టుబడిదారులకు కూడా ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం పేరుతోనే వారు గుర్తింపు కోరుకుంటారు. ఆ ప్రాంతం యథాతథంగా పులులు, సింహాల కోసం ఉండాలి. మీరు చెప్పింది అలాగే ఉంది. కులం ఆంధ్ర, మతం ఆంధ్ర, ప్రాంతం ఆంధ్ర… నినాదంతో ఓట్లు వేసి గెలిపించమని చెబుతున్నారు. చిన్నవాడివైనా చక్కగా సెలవిచ్చావు నాయనా. నాన్న జట్టులో నుంచి ఊడిపడ్డావు. కానీ అసలు వాస్తవాలు చెబుతా విను.

పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వెళ్లి చెప్పింది ఉత్తారాంధ్ర విడిపోవాలని కాదు. ఆయన అసలు భారతదేశమే ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి సభలోనూ జైహింద్ అని అరుస్తున్నాడు. దేశభక్తిని కూడా చాటిచెబుతున్నాడు. భిన్నత్వంలోనే ఏకత్వం అన్నది భారతదేశపు ఆత్మ అనీ, అయితే… ఇతరుల ఆకాంక్షలను గౌరవించకుండా, వారికి విద్య, ఉద్యోగావకాశాలు కల్పించనపుడు వేర్పాటువాదం వస్తుందని చక్కగా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి నీకు మరోలా అర్థం అయిందా నాయనా? మళ్లీ పవన్ ప్రసంగాలు విను నాయనా. పవన్ విశ్వమానవ దృక్పథంతో మాట్లాడుతున్నాడు. మనలా సంకుచితమైన నేత కాదు. ఏమిచ్చినా మన పార్టీకి చెందిన వారికే ఇవ్వండి… ఇతర పార్టీల వాళ్లకు ఇవ్వవద్దు అని తెలుగుదేశం నేతల్లా చెప్పేంత సంకుచితమైన వ్యక్తి కాదు పవన్.

కులంతో లాభ పడేవాడు సమానత్వ పాఠాలు చెబుతాడు!

పాయింటు 1:

కులం గురించి మాట్లాడుతున్నాడు అంటే.. బడుగు బలహీన వర్గాల వాళ్లు కులం గురించి మాట్లాడతారు. 70 ఏళ్లుగా కులం గురించి మాట్లాడలేదు కాబట్టి… కులం పేరుతో ఇంకా కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారు. ఇపుడిప్పుడే ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పేరు చివరన మాదిగ అని పేరు పెట్టుకోవాలంటే ఒక భయం. మరి ఆ భయం నాయుడు, రెడ్డి, చౌదరిలకు లేదుగా… అందుకే దళితులు తమ పేర్ల పక్కన మాదిగ అని పెట్టుకుంటున్నారు. మంద కృష్ణమాదిగ అన్నది ఇపుడు గౌరవపూర్వక సంబోధనగానే వినిపిస్తోంది కదా మీకు కూడా. కులం పోవడం అంటే ఇది. ఇది కులాన్ని పట్టుకుని వేలాడటం అవ్వదు. ఇదంతా తెలియాలంటే ఆకలి విలువ తెలియాలి. కులం వల్ల నష్టపోవడం తెలియాలి. మీరు పుట్టుకతోనే గోల్డెన్ స్పూనుతో పుట్టారు. ఆకలి బాధ మీకెలా తెలుస్తుంది? కులతత్వం బాధ మీకెలా తెలుస్తుంది? అందుకే మీరు సమానత్వం అని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ కులాలను కలుపుతానంటున్నాడు. దాని అర్థం తెలుసుకోవడం అంత తేలికేమీ కాదు. కమ్మ, మాలలు ఎప్పుడు సమానం అవుతారు? ఇద్దరూ బెంజిలో తిరిగినపుడు. దాని అర్థం అది. ఆర్థిక సమానత్వం. అంటే సహజ వనరులపైన అందరికీ సమానమైన హక్కు రావాలని జనసేన డిమాండు చేస్తుంది. కేవలం డబ్బున్న వర్గాలే వందల సంవత్సరాలపాటు దోచుకుందామంటే కుదరదు అంటున్నాడు. ప్రాంతం పేరుతో అందరినీ కలిపేస్తే బాగానే ఉంటుంది. మరి మీరు కులాల్ని రద్దు చేస్తారా? ఆస్తుల్ని అందరికీ సమానంగా పంచుతారా? ఆ పని చేస్తే… అందరం కులం, మతం వదిలేసి ఆంధ్రులం అని పెట్టుకుందాం. మరి దీనికి మీరు సిద్ధంగా ఉంటారా లేదో మీరే నిర్ణయించుకోండి. పవన్ చెప్పేది మన కుటుంబరావు అంకుల్ కి బాగా తెలుసు. ఆయన్ని అడిగితే బెటర్.

పాయింటు 2:

రాష్ట్రంలో 25 మంది ఎంపీలనూ తెదేపా తరఫునే గెలిపిస్తే ప్రధాన మంత్రిని నిర్ణయించే శక్తి మనకు లభిస్తుందని కూడా మీరు సెలవిచ్చారు. బాగుంది. చిన్న సవరణ. ప్రధానమంత్రిని నిర్ణయించే శక్తి లభించేది ‘‘మనకు’’ కాదు. ‘‘మీకు’’ మాత్రమే లభిస్తుంది. సీబీఐ, ఈడీ ఇక అన్నీ మీ చేతిలో ఉంటాయి. వాళ్లను పిలక పుచ్చుకుని ఆడించవచ్చన్నది మీ దుర్మార్గపు ఆలోచన. అందుకే నాన్నగారు ఏకంగా ప్రధానమంత్రి పదవినే గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న కృత్రిమ ఉద్యమం అందుకే కదా మొదలు పెట్టింది. మీరు, మీ నాన్నగారు చెప్పిన మాటల్ని యథాతథంగా అన్ని పత్రికలూ ప్రచురిస్తాయి. మీడియా భజన మీడియాగా మారిపోయినందున… ప్రత్యామ్నాయ మీడియా వచ్చే అవకాశం లేదు. మీరు 17 ఛానెళ్లు పెట్టగలిగితే… మిగిలిన వారు ఒక్క ఛానెల్ కూడా పెట్టలేకపోతున్నారు. ఆర్థిక అసమానత్వాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి కదా. సహజ వనరులపై ఒక్కరి పెత్తనమే సాగుతోంది… ఇలాంటప్పుడే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ‘‘అరబ్ స్ర్పింగ్’’ వంటి పెద్ద ప్రజా ఉద్యమం కేవలం ఒక ఫేస్ బుక్ పోస్టు వల్ల వచ్చిందని మీకు తెలుసా? ఎవరి నియంతృత్వమైనా ఎక్కువ కాలం సాగదని చరిత్ర నిరూపించింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *