ఓట్ల తొలగింపుపై విచారణ: సీఈసీ సునీల్ అరోరా

February 12, 2019 | News Of 9

  • కమిటీని ఏర్పాటు చేశాం
  • ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం
  • పోస్టు డేట్ చెక్కులపై వివరణ అడిగాం
  • ఒకే సామాజిక వర్గానికి పోస్టింగ్స్ కూడా మా దృష్టికి వచ్చింది
  • వీవీ ప్యాట్లపై నివేదిక కోసం చూస్తున్నాం

విజయవాడ: ఓట్ల తొలగింపుపై వస్తున్న ఫిర్యాదులపై నిజా నిజాలపై నివేదిక ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. సర్వేల పేరుతోకమ్యూనిటీల పేరుతో ఓట్లను  తొలగిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయన్నారు. కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ పై కేసు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, ఏదైనా స్పష్టత వస్తే దాన్ని ముందుకు వెళ్లడానికి ఉంటుందన్నారు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీల నేతలుసీఎస్డీజీపీహోం శాఖ కార్శదర్శులతో రెండు రోజుల పాటు సమావేశమైనట్లు చెప్పారు. ఒకే కమ్యూనిటీకి చెందిన 37 మందికి ప్రమోషన్లు ఇచ్చారనే విషయంపై ఏపీ సీఎస్డీజీపీలతో మాట్లాడినట్లు తెలిపారు. తెలుగు దేశం ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ చెక్ లు ఇవ్వటంపై వచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు తెలిపారు. 3, 6, 10 ఇలా వీవీ ప్యాట్లను లెక్కించాలనే శాతం పెరుగుతోందని అన్నారు. ఈవీఎంలలో ఎంత శాతం వీవీ ప్యాట్ల లెక్కింపు జరపాలనే దానిపై ఆగస్టు 2018లో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామనీ, నివేదిక కోసం వేచి చూస్తున్నామన్నారు. ఈవీఎం లలో అనుమానాలు వస్తున్నాయి గానీ, లోక్ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీకర్ణాటకమిజోరాంత్రిపురల్లో ఫలితాలు అన్నీ వేర్వేరుగా వచ్చాయనేది గుర్తించాల్సిన విషయంగా చెప్పారు.

యువతను ఓటర్లుగా చేర్చడానికి రాజకీయ పార్టీలు కృషి చేయాలని సునీల్ అరోరా కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు, ఇతరులకు అదనపు భద్రత కల్పిస్తాం తప్ప ప్రత్యేక బూతుల ఏర్పాటు చేయలేమన్నారు.

వీవీ ప్యాట్ల లెక్కింపుపై వినతులు వచ్చాయనీ, ఏపీలో కూడా వీవీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. 28 ఫిబ్రవరి లోపుగా బదిలీలు చేపట్టాలని ఏపీ సీఎస్డీజీపీకి తెలియచేశామన్నారు. ఏపీలో సైతం ఎన్నికలపై ఎటువంటి ఫిర్యాదులైనా చేయవచ్చునన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే…

  • ఆధార్ కార్డులను ఓటర్ కార్డులకు లింక్ చేయటం ఈసారి ఎన్నికల్లో కుదరదు.
  • ఈవీఎం పనిచేయక పోతే వెంటనే మారుస్తున్నాం.
  • ఈవీఎం టాంపరింగ్ చేయడం సాధ్యం కాదు
  • 1500 శాంపిల్  పరీక్షలు చేసినా అందులో తేలలేదు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *