‘వెంకన్న’ చౌదరీ… ఈ చౌదరి ఏం చేశాడో చూడవయ్యా!

November 24, 2018 | News Of 9

Sujina Chowdary | telugu.newsof9.com

  • రూ.6 వేల కోట్ల కుంభకోణం

హైదరాబాద్: ఆట మొదలైంది కదరా శివా… ఈడీ పెట్టిన పొగకు ఎలుకలు కలుగులో నుంచి ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నేతలు చేసిన బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకు పూర్వం గాలి జనార్ధనరెడ్డి…ఇంకా మరికొందరు ఇదే స్థాయిలో ఇష్టం వచ్చినట్లు సంపాదించి చివరికి అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు సంచలనం కలిగించిన కుంభకోణాల తరహాలో ఇపుడు కూడా సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. ఇదే తరహాలో మరికొన్ని కుంభకోణాలు వెలికిరానున్నట్లు సమాచారం. గుండె దిటవు చేసుకుని చదువుకోండి.

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ యలమంచిలి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో బ్యాంకు రుణాలకి సంబంధించి ఏకంగా 6 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ప్రాథమికంగా గుర్తించింది. నేరానికి సంబంధించిన కీలక పత్రాలను, విలువైన 6 కార్లను కూడా ఈడీ శనివారం స్వాధీనం చేసుకుంది. కీలక పత్రాలను పరిశీలించిన తర్వాత కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద ఈడీ ఈ దాడులు నిర్వహించింది. ఈ బ్యాంకు కుంభకోణం కోసం దాదాపు 120 డొల్ల కంపెనీలను ప్రారంభించినట్లు కూడా ఈడీ గుర్తించింది. సుజనా చౌదరికి చెందిన అనేక కంపెనీలపై ఈడీ, ఐటీ అధికారులు గత నెలలో కూడా దాడులు చేశారు. మరో ఎంపీ సీఎం రమేష్ కంపనీ రుత్విక్ కన్ స్ట్రక్షన్స్ పైన కూడా ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ (యజమాని: విశ్వేశ్వరరావు), నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ లపై కూడా దాడులు జరిగాయి. మస్తాన్ రావును … తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మినామీగా చాలా మంది చెబుతుంటారు.

ఈడీకి ట్విటర్ హ్యాండిల్ కిందనున్న కామెంట్లను పరిశీలిస్తే… అనేక మంది హర్షం వ్యక్తం చేశారు. మంచి పని చేశారని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు సుజనా కంపెనీలు బెంగళూరులో కూడా ఉన్నాయని వాటి సంగతి కూడా చూడాలని ఒకరు ఈడీకి విన్నవించుకున్నారు. ఒకరు మాత్రం… ఈడీ కోర్టులో విఫలం అవుతుందని, అప్పుడు ఈడీ చౌదరికి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

నిజానికి సీఎం రమేష్, సుజనా చౌదరిలపై ఈడీ నజర్ ఎప్పుడైతే పడిందో… ఇన్నాళ్లూ తెలుగుదేశం నేతలకు ఉన్న ‘రక్షణ ఛత్రం’ పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అర్థమైపోయింది. ఈడీ చేయి తన వద్దకు కూడా రావచ్చని భయపడిన చంద్రబాబు… మోడీపై యుద్ధానికి దిగిపోయారు. చౌదరీల్లో ఉండే ఈ పోరాట పటిమను అభినందించకుండా ఉండలేం. తమ ఆస్తుల పరిరక్షణ కోసం వేంకటేశ్వర స్వామిని సైతం వెంకన్న చౌదరిని చేసేసుకున్నారు. దాడులకు ప్రతీకారంగా.. (చట్టం ఒకటి ఉందని వారు ఎప్పుడో మర్చిపోయారు) మోడీనే మార్చేస్తే పోలా అని ‘డిసైడ్’ చేశారు. అంతే అందుకు రంగం సిద్ధమైపోయింది. అన్ని పనులు పక్కన పడేసి.. మోడీపై యుద్ధానికి వెళ్లిపోయారు. లక్ష రెండు లక్షలు తీసుకున్న అధికారులపై ఏసీబీని వదిలే చంద్రబాబు తన మీదకు మాత్రం ఎవరూ రాకూడదని కోరుకుంటారు. ప్రధానిపైనే యుద్ధం ప్రకటిస్తారు. ప్రజలకు అంతా సుభిక్షంగా ఉన్నట్లు కనిపించాలి. తమ వాళ్లు మాత్రం అన్నింటికీ అతీతులుగా ఉండాలి. నాజీయిజానికి మించిన నియంతృత్వం అయిపోయింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *