మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి ఎంపిక

March 16, 2019 | News Of 9

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త, జనసేన పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు బొంగునూరి మ‌హేందర్ రెడ్డిని మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ స్థానం జనసేన అభ్య‌ర్ధిగా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. శ‌నివారం సాయంత్రం విజ‌య‌వాడ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మ‌హేందర్ రెడ్డి అభ్య‌ర్ధిత్వాన్ని ఖ‌రారు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “స‌మాజానికి సేవ చేయాల‌న్న త‌ప‌న‌తో కోట్లాది రూపాయ‌ల వ్యాపారాల‌ను వ‌దులుకుని నాతోనే ఉన్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ ప్రారంభించక ముందు నుంచి క‌లిసి ప‌ని చేశారు. కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉన్నారు. మెద‌క్ పార్ల‌మెంట్ స్థానానికి పీఆర్పీ అభ్యర్థిగా ఎంపిక చేశాం. ట్రాఫిక్ లో చిక్కుకుపోయి నామినేష‌న్ వేయ‌లేక‌పోయారు. ఆ త‌ప్పును స‌రిదిద్దుకుంటూ ఆయ‌న‌ను మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంటరీ స్థానానికి అభ్య‌ర్ధిగా పంపిస్తున్నాం. ఆయ‌న విజ‌యానికి పార్టీ కార్య‌క‌ర్త‌లు, జ‌న‌ సైనికులు కృషి చేయాలి. మల్కాజ్ గిరి స్థానం నుంచి ఎంపీగా మ‌హేందర్ రెడ్డి గెల‌వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. తెలంగాణ నుంచి జనసేన ప్రకటించిన తొలి అభ్యర్థి మహేందర్ రెడ్డి. ఈయన దశాబ్దంన్నరగా పవన్ కల్యాణ్ వెన్నంటి ఉన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *