ముదిమిలోనూ.. ఉరిమే ఉత్సాహం

February 14, 2019 | News Of 9

Mani is 80, but a star campaigner for Janasena | telugu.newsof9.com

  • 80 ఏళ్ల వయసులో జనసేన ప్రచారం
  • అమలాపురం ముత్యాల మణి కథ

(న్యూస్ ఆఫ్ 9)

ఒక ముసలివాడు మామిడి మొక్క నాటుతూ ఉంటే అటుగా వెళుతున్న వారు అడుగుతారు. కొన్నాళ్లు పోతే నువ్వు చచ్చిపోతావు కదా… ఆ మామిడి చెట్టు ఎదిగి..పూత పూసి కాయ కాసి ఎన్నటికి నువ్వు తినేవు నాయనా అంటారు. ఈ వృథా ప్రయాస ఎందుకు అంటారు? ఈ చెట్టు నాటుతున్నది నా కోసం కాదు. ‘‘రాబోయే తరాల కోసం.. నా మనవలూ, మనవరాళ్ల కోసం’’ అని సమాధానం చెబుతాడు వృద్ధుడు. మనిషిగా పుట్టిన తర్వాత ఎవరికైనా ఉండాల్సిన దూరదృష్టీ, భవిష్యత్తు తరాలపై ఉండాల్సిన ప్రేమ ఇదే.

రోజూ పత్రికల్లో వార్తలు చదివి.. ఈ ప్రపంచం ఇంతే అని తిట్టుకుంటాం గానీ, మట్టి మనుషులు ఎవరినీ నిందించకుండా వారి పని వారు చేసుకుంటూపోతుంటారు. లాభం, నా కెంత అన్నది ఆ పనుల్లో వారికి కనిపించవు.

ముత్యాల మణి…వయసు 80 సంవత్సరాలు. 90 శాతం మంది ఈ వయసులో కృష్ణారామా అనుకుంటూ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను నాయనా అంటారు పలకరించినపుడు.. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో మామిడి మొక్క నాటుతున్న వృద్ధుడి కథలో మాదిరే… ముత్యాల మణి బుడిబుడి నడకలతోనే ‘‘జనసేన’’ పార్టీ ప్రచారం చేస్తున్నారు. జనసేనతో కేవలం ఈ తరం యువత మాత్రమే ఉందని ఒక మాట అంటుంటారు. అది నిజమే. కానీ జనసేన నేడు వయసు తేడాలను అధిగమించింది. ఇంతమందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్న జనసేనాని ఆమె కలిసి అభినందించాలని అనుకుంది. అమలాపురం వచ్చినపుడు పవన్ ను కలిసింది కూడా.

‘‘ఈ అమ్మను చూసినప్పుడు మన శక్తి మరింత పెరుగుతుంది’’

ఇదీ… ముత్యాల మణి తనను కలిసినప్పుడు పవన్ చేసిన వ్యాఖ్య.

ముత్యాల మణి అమలాపురం వాసి. గతంలో హైదరాబాద్ లో ఉండేవారు. ఈవిడకు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం. కానీ ఆయనను కలుసుకోవడం సాధ్యపడలేదు. రెండేళ్ల క్రితం సొంత ఊరు అమలాపురం వచ్చేశారు. జనసేన కార్యాలయం వెనుక వీధిలోనే ఆమె ఉంటున్నారు. ఈ క్రమంలో మణమ్మ ఒక రోజు జనసేన నాయకుడు శెట్టిబత్తుల రాజబాబును కలిశారు. పవన్ కళ్యాణ్ గారి మీదజనసేన పార్టీ మీద తనకున్న అభిమానాన్ని వివరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ అమలాపురం పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంలో పెద్దావిడ కోరిక మేరకు రాజబాబు ఆమె జనసేనానిని కలిసే ఏర్పాటు చేశారు. అప్పటి నుండి పార్టీ కోసం తన వయసుని సైతం లెక్కచెయ్యకుండా జనసేన కోసం ప్రచారం చేస్తున్నారు.

జనతరంగంజనబాట కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అందరికీ జనసేన సిద్ధాంతాలనూ లక్ష్యాలనూ వివరిస్తున్నారు. ఆమె కష్టపడుతున్న తీరుకి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ వయసులో మీరెందుకింత శ్రమ పడుతున్నారని అడిగిన వారితో తనకు పవన్ కళ్యాణ్ పై విశ్వాసం ఉందనీఆయన మార్పు తీసుకురాగలడనీ చెబుతున్నారు. తాను ఏ ప్రయోజనాలను ఆశించి మాత్రం ఈ ప్రచారం చేయడం లేదనీ, పవన్ ఆశయాలు నచ్చిఆయన ప్రజలకు మంచి చెప్పాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నానంటున్నారు. తన శక్తి మేరకు పార్టీ కోసం కష్టపడతాననీ ఉత్సాహంతో చెబుతున్నారు. ఆమె తమతో పాటు ప్రచార కార్యక్రమాలకు రావడం తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందనీ జనసేన కార్యకర్తలు పేర్కొన్నారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *