మాయావతి నాకు అమ్మలాంటి వారు: పవన్ కళ్యాణ్

March 17, 2019 | News Of 9

  • తెలంగాణలో దళిత సీఎం అన్నారు.. కానీ కాలేదు
  • తొలి దళిత ప్రధానిగా మాయావతి కావాలి
  • బీఎస్పీకి సీట్లు కేటాయించిన జనసేన
  • 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు
  • తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసే పోటీ
  • తమ కూటమిని గెలిపించాలంటూ వీర్ సింగ్ పిలుపు

(న్యూస్ ఆఫ్ 9)

బహుజన సమాజ పార్టీ (బీఎస్పీ)కి జనసేన పార్టీ 3 పార్లమెంటు స్థానాలనూ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో బీఎస్సీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఎస్పీకి ఏకంగా 21 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడం ద్వారా బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తున్న నిజమైన పార్టీగా జనసేన అవతరించింది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసే జనసేన పోటీ చేస్తుంది. అక్కడ ఎన్ని సీట్లు ఇచ్చేదీ త్వరలోనే ప్రకటిస్తారు.

ఇతర పార్టీలు మాటలు చెప్పుకోవడం, రాజ్యంగాపరంగా ఉన్న రిజర్వుడు స్థానాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా దళితులకు చేసిందేమీ లేదు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. లక్నో వెళ్లినపుడు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మాట్లాడినపుడు.. ఆమె గురించి నిజంగా అర్థం చేసుకున్నామని, ఆమె చూపిన ఆదరణను ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. ఆమె తనకు మాతృ సమానురాలని అన్నారు. ఆమెను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని అప్పుడు తనకు అర్థమైందని అన్నారు. రాజకీయాలు ప్రజల్ని కలపేలా ఉండాలని, భయపెట్టేలా ఉండరాదని, దేశానికి ఏం చేయవచ్చు అన్న అంశాలపైనే చర్చలు సాగాయని అన్నారు. టిక్కెట్ల గురించి గత మూడు రోజులుగానే మాట్లాడుతున్నామని అన్నారు. తెలంగాణకు దళిత సీఎంను చేస్తామని అన్నారని, కానీ అది ఎందుకు నెరవేరలేదో అర్థంకాలేదని, తాము మాత్రం మాయవతిని తొలి దళిత ప్రధానిగా చూడాలని అనుకుంటున్నామని అన్నారు.

బీఎస్సీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ మాట్లాడుతూ… బీఎస్పీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆంధ్ర ప్రదేశ్ లో మార్పు రావాలనీ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కాన్షీరాం, అంబేద్కర్ భావజాలం నుంచి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని పొందినట్లు చెప్పారని, ఇది నిజంగా చాలా మంచి విషయమని అన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి బీఎస్పీ తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామని, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆశీస్సులు కూడా అందించారని వీర్ సింగ్ చెప్పారు. తిరుపతి,

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *