అభిమాని కోరిక తీర్చిన మెగాస్టార్..

April 22, 2019 | News Of 9

ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా మెగాభిమానులు నమ్మరు. అభిమానులకు ఆయనిచ్చే స్థానం చాలా గొప్పది.  అనేక సందర్భాల్లో రుజువైన ఈ విషయాన్ని మరో తాజా సంఘటన గుర్తు చేసింది. సైరా సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్న మెగాస్టార్ ఓ అభిమానికోసం కొంత సమయం కేటాయించారు. అతనిని తన ఇంటికి పిలిచి మరీ అతని కుమారుడికి పేరు పెట్టారు. ఆ అభిమాని పేరు నక్కా వెంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం , మందపల్లి గ్రామానికి చెందిన ఇతను మెగాస్టార్ కు వీరాభిమాని.

వెంకటేశ్వరరావుకు చిన్నప్పటి నుండీ చిరంజీవి అంటే ఎంతో ప్రేమ. ఆయన రాజకీయాల్లోకి వెళ్లినా తన అభిమానం వదులుకోలేదు. ప్రజారాజ్యం సమయంలో కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. అందుకు వెంకటేశ్వరరావును ఆ గ్రామం నుండి 5 సంవత్సరాలు రాజకీయంగా  వెలివేశారు కూడా. ఈ విషయం తెలిసి మెగాస్టార్ ఎంతో బాధ పడ్డారు. ఇంటికి పిలిపించుకొని  రోజంతా వారితో గడిపి ఎంతో ప్రేమగా కుటుంబ సభ్యులందరికీ బట్టలు పెట్టి పంపించారు.

గత ఏడాది ఇదేనెలలో వెంకటేశ్వరరావుకు బాబు పుట్టాడు. తన కుమారుడికి  చిరంజీవే నామకరణం చేయాలని లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని పిల్లవాడికి పేరు కూడా పెట్టలేదు. ఈవిషయం చిరంజీవి దాకా వెళ్లింది. ఆయన వెంకటేశ్వరరావును కుటంబ సమేతంగా ఇంటికి పిలిచి ఆ చిన్నారికి పవన్ శంకర్ అని నామకరణం చేసి ఆ కుటుంబంతో గంట సేపు ముచ్చటించారు. దీంతో నక్కా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆనందానికి అవదలు లేవు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *