మోడీ ఖర్చు పెట్టాడుగా… నేను ఖర్చు పెడితే ఏంటట?

February 13, 2019 | News Of 9

Modi spent same, why I can’t for my Deeksha?: Babu | telugu.newsof9.com

విజయవాడ: ఢిల్లీ దీక్షకు పది కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇస్తున్నానని చెప్పారు గానీ… వివరణ ఇవ్వకుండా వేలు మోడీ వైపు చూపించారు. దీక్షకు ప్రజల డబ్బులు ఖర్చు పెట్టవచ్చా లేదా అన్న దానికి ఆయన సమాధానం చెప్పలేదు. కానీ మోడీ తన దీక్షకు ఖర్చు పెట్టాడు కాబట్టి తాను కూడా ఖర్చు పెట్టానని చెప్పారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. ఏ ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పరు.

ఢిల్లీలో తాను చేపట్టిన దీక్షకు 2.83 కోట్ల రూపాయిలను ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. ఢిల్లీ దీక్షకు జరిగిన ఖర్చుపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఢిల్లీ దీక్ష కోసం రూ.10 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. మోడీ తన సొంతానికి రూ.1.80 కోట్లతో దీక్ష చేశారని ఆయన చెప్పారు. రాజధాని వెంట97 కి.మీ. మేర నీరు ఉండటం అరుదైన విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. 1954 ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం పంతులు శంకుస్థాపన చేశారని, 65 ఏళ్ల తర్వాత అదే రోజున వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేయడం సంతోషమన్నారు. పది టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలోనే ఇంత మంచి రాజధాని ఎక్కడా రాదన్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం వద్ద మరో బ్యారేజీ నిర్మిస్తామన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *