ఎంపీ, ఎమ్మెల్యే కొలువు తప్ప… మరొకటి ఉండరాదు అంటే…?

February 13, 2019 | News Of 9

Parliment | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు అధినేత రామ్ నాథ్ గోయంకా అని ఉన్నారు. ఆయనకు పత్రికల వ్యాపారం తప్ప మరో వ్యాపారం ఉండేది కాదు. చాలా సార్లు నాకు అనుమానం వచ్చి మా సీనియర్లను అడిగితే… గోయంకా చాలా నిజాయితీగా పత్రికా వ్యాపారం చేస్తున్నారని, అందువల్ల మీడియా వ్యాపారం కాకుండా ఇతర వ్యాపారాలు ఉంటే ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడాల్సి వస్తుందని ఆయన ఇతర వ్యాపారాలేమీ చేయరని దీనిని ఒక నిబద్ధతతో పాటించిన మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే అని చెప్పారు. నాకు చాలా ఆశ్యర్యం అనిపించింది. అప్పటి వరకూ నిబద్ధతతో ఉన్న మీడియా సంస్థ ఈనాడు మాత్రమే అని అనుకునేవాడిని. అది నేను చేరిన కొత్తలో సంగతి. తర్వాత ఈనాడులో పని చేస్తూనే ఉన్నపుడు రామోజీరావుకి ఉన్న ఇతర వ్యాపారాల గురించిన వార్తలు వచ్చినపుడు ఈనాడు సీనియర్లంతా బహు జాగ్రత్తగా ఉండేవారు. ఈనాడుకు ప్రియా పచ్చళ్ల వ్యాపారం ఉంది. నిల్వ పచ్చళ్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఒక వార్త వచ్చిందనుకోండి. ఈ వార్తను బుట్టలో పారేయడమే. ఎందుకంటే ఈనాడు సహ సంస్థ పచ్చళ్ల వ్యాపారం చేయడమే. గోయంకా అందుకే మీడియాలో ఉన్నపుడు మీడియా వ్యాపారమే తప్ప… మరొకటి చేయలేదు ఆ మహానుభావుడు.

ఇది ఎందుకు చెబుతున్నానంటే… మరి ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వారికి కూడా ఇపుడు వ్యాపారాలు ఉంటున్నాయి. రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడాలంటే ప్రజాప్రతినిధికి రిలయన్స్ డీలర్ షిప్ ఉండకూడదు. అతను రిలయన్స్ డీలర్ అనుకోండి… రిలయన్స్ కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలడు? కొత్త తరం వచ్చింది. రాజకీయాలు కూడా కొద్ది కొద్దిగా మారుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఈ సరికొత్త రాజకీయాలకు వేదిక కాబోతున్నది. రాజకీయ నాయకులకు పూర్తి ఉద్యోగంగా రాజకీయాలే ఉండాలనీ, వారికి మరే ఇతర వ్యాపకాలూ, వ్యాపారాలూ ఉండకూడదని కోరవచ్చు కదా. ఇపుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకూ నెలవారీ జీతాలు కూడా వస్తున్నాయి. ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి ఎలా అయితే ఆ కంపెనీ కోసమే పని చేస్తాడో ఎంపీ, ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో నియోజక వర్గ ప్రజల కోసం పని చేయవచ్చు కదా. దీని వల్ల ప్రజలకూ మేలు జరుగుతుంది. రెండోది ఎటువంటి వ్యాపారాలూ లేని వ్యక్తి అయితే, అతను లేదా ఆమె నిష్కర్షగా ప్రజల బాగుకోరి మాట్లాడగలుగుతారు. మారుతున్న ప్రపంచంలో ఇంకా పాత పద్ధతులనే పాటించాల్సిన పని లేదు. దీనివల్ల కోటీశ్వరులూ, బడా బడా వ్యాపారులూ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. తప్పుకుంటారు. తప్పేం ఉంది? వాళ్లు ఉండి ప్రజా సంక్షేమం కోసం వెలగబెడుతున్నది కూడా ఏమున్నది?

కోటీశ్వరులు మేథావులు కూడా అయివుంటే, అలాంటివారిని ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో తీసుకోవచ్చు. ఈ అవకాశం ఎప్పుడూ ఉంది. ఎన్నికల ద్వారా సభలకు వెళ్లేవారికి పరస్పర విరుద్ధమైన వ్యాపారాలూ, ఆసక్తులూ లేని వారికే 99 శాతం అవకాశం ఇవ్వడం వల్ల ప్రజలకు జరిగే మేలు చాలా ఎక్కువ. మేం జర్నలిస్టులుగా ఉద్యోగాల్లో చేరేటప్పుడు ఈనాడులో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. మాకు ఎలాంటి ఇతర వ్యాపారాలూ లేవనీ, ఇతర ఉద్యోగాలేమీ చేయమని, లాభాపేక్షకు ఇతర సంస్థలకు పని చేయమనీ పత్రం రాసివ్వాలి. ఈనాడులో జీతం తీసుకుంటున్నందున.. నా సేవలు ఈనాడుకే ఇవ్వాలని దాని అర్థం. 25 ఏళ్లు జర్నలిస్టుగా ఉండి వ్యాపారాలేమీ చేయలేదు. ఇది రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది కూడా. జనసేన పార్టీ ఇందుకు ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇపుడు లిక్కర్ వ్యాపారంలో ఉన్నవారు కూడా ఎంపీలూ, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు. లిక్కర్ వ్యాపారానికి వ్యతిరేకంగా అలాంటి ప్రజా ప్రతినిధులు మాట్లాడే అవకాశం ఉండదు.

పరస్పర విరుద్ధమైన ఆసక్తులు ఉన్నపుడు పనులు చిత్తశుద్ధితో సాగవు. మద్య నిషేధ కమిటీలో ఉన్నవాడికి లిక్కర్ షాపు ఉంటే ఇంక వాడేం చేస్తాడు? ప్రజాసేవ చేస్తామంటూ వేంకటేశ్వరస్వామి అపర భక్తుడులా పార్టీల్లో నమస్కారాలు పెట్టేవారి… అంతే చిత్తశుద్ధితో ప్రజాప్రతినిధిగా ఉండాలని కోరడం తప్పెలా అవుతుంది?

మరి రాజకీయాలను ఫుల్ టైం ఉద్యోగంలా భావించే వారికే పార్టీలు టిక్కెట్లు కూడా ఇస్తే ఫలితాలు బాగుంటాయి. ఎమ్మెల్యేనో, ఎంపీగానో అయిపోగానే, గన్ మెన్లను వేసుకుంటూ బెంజికార్లలో చక్కర్లు కొట్టడం కాకుండా…నికార్సైన ప్రజాప్రతినిధులుగా ఉండటానికి వీలు చిక్కుతుంది. వ్యాపారమే ఎక్కువ అనుకున్నవారు వ్యాపార రంగంలోనే ఉంటారు. ఈతరం యువత.. చిత్తశుద్ధితో ప్రజాప్రతినిధులుగా పని చేయగలరు. ఎంపీలూ, ఎమ్మెల్యే పదవులు ఉద్యోగాల్లా అయిపోతే (5 ఏళ్ల కాలానికే) అందులో రెండు రకాలు పెట్టవచ్చు. తొలుత ఇలా ఉండటానికి ఇష్టపడే వారికి జీతం ఎక్కువ ఇచ్చి, ఇతర ఆసక్తులు ఉన్నవారికి జీతం కోసేయవచ్చు. ఇపుడు కోటీశ్వరులు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఇదేమి చోద్యమో…!! క్రమేపీ అయినా మార్పు తేవడం మంచిదేమో. ఈ అవకాశం ఈ తరం యువతకు ఎందుకు ఇవ్వకూడదు? ఆలోచించండి!!

–      గుగ్గిళ్ల శ్రీనివాసరావు

ప్రధాన సంపాదకుడు

Other Articles

12 Comments

 1. I loved as much as you’ll receive carried out right here.
  The sketch is attractive, your authored material stylish.

  nonetheless, you command get bought an nervousness
  over that you wish be delivering the following. unwell unquestionably come further formerly again since exactly the same nearly
  very often inside case you shield this hike.

 2. What i do not realize is in reality how
  you are not actually a lot more smartly-liked than you might be
  right now. You’re very intelligent. You understand therefore considerably in relation to
  this topic, made me for my part imagine it from numerous numerous angles.
  Its like men and women don’t seem to be interested except it’s something to do with Woman gaga!
  Your own stuffs great. All the time care for it up!

 3. Does your blog have a contact page? I’m having a tough time locating it but, I’d like to shoot you an email.

  I’ve got some creative ideas for your blog you might be interested in hearing.
  Either way, great blog and I look forward to seeing it expand over time.

 4. Simply wish to say your article is as astounding.
  The clearness in your post is simply excellent and i can assume you are an expert on this subject.
  Fine with your permission let me to grab your RSS feed to keep updated
  with forthcoming post. Thanks a million and please continue the
  gratifying work. natalielise pof

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *