కూర్చుని మాట్లాడటానికి మనసు రావడం లేదు: పవన్ కళ్యాణ్

April 8, 2019 | News Of 9

                            (న్యూస్ ఆఫ్ 9)

అమలాపురం సభలో… జన సైనికులు పవన్ కళ్యాణ్ కు హారతులు ఇస్తున్నారు.. ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మాట్లాడం ఆపి… ‘‘మీరు ఇక్కడ హారతులు ఇవ్వడం కాదు… ఇతర పార్టీల గుండెల్లో మంటలు రేపండి…’’ అంటూ జనసేన గెలుపు కోసం అందరూ కష్టపడాలి అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. దాదాపు గంటసేపు పవన్ కళ్యాణ్ అలా నిలబడే ఓపికగా మాట్లాడారు. మధ్య మధ్యలో నీళ్లలో తడిపిన దస్తీతో ముఖం తుడుచుకుంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. మధ్యలో ఒకసారి కుర్చీ వేస్తే కూర్చున్నారుగానీ… మనసు ఒప్పుకోవడం లేదంటూ మళ్లీ లేచి నిలబడే మాట్లాడారు. అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టినపుడు తామందరం ఆయన కోసం ప్రచారం చేసేవారమని, అయితే ఇపుడు తానొక్కడినే అయినందున తిరగడం తప్పడం లేదని, ఆరోగ్యం సహకరించనందునే కొద్దిపాటి ఇబ్బంది ఉందని అయినా ఫర్వాలేదని వ్యాఖ్యానించారు.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *