‘‘నాన్నా ఆ లెక్చరర్ ధన దాహానికి నేను బలైపోతున్నా’’

December 3, 2018 | News Of 9

‘‘Nanna… I am committing suicide because of that lecturer” | Newsof9

న్యూఢిల్లీ: ‘‘నాన్నా ఆ లెక్చరర్ ధన దాహానికి నేను బలైపోతున్నా. అతన్ని మాత్రం వదిలిపెట్టొద్దు అంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి ఢిల్లీలో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  ప్రతి సెమిస్టర్‌కు రూ.5 వేలు ఇస్తేనే మార్కులు వేస్తానని లేకపోతే సెమిస్టర్‌తో పాటు ప్రాక్టికల్స్‌లోనూ ఫెయిల్ చేయిస్తానని బెదిరించడంతో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే  విశాఖ జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ (19) అనే యువకుడు ఢిల్లీనాగ్‌పూర్‌లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో ఫైర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

కాలేజీలో పని చేసే ఓ అధ్యాపకుడు వేధిస్తున్నట్టు గత నెల 30వ తేదీన తల్లిదండ్రులకు వాట్సాప్‌లో లేఖ రాశాడు. ప్రతి సెమిస్టర్‌కు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే సెమిస్టర్‌తో పాటు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఢిల్లీకి వెళ్లి కాలేజీలో విచారించగాహేమంత్ కుమార్ 30వ తేదీనే ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. మరుసటి రోజు ఢిల్లీలోని రైలు పట్టాలపై హేమంత్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

హేమంత్ కుమార్ చనిపోయే ముందు వాట్సాప్‌లో తండ్రికి ఓ లేఖ రాశాడు. “నాన్నా నేను చనిపోతున్నా. దీనికి కారణం మా కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ బోధించే లెక్చరర్ ఆర్కే.విధాత.  ఒక్కో సెమిస్టర్‌కు రూ.5 వేలు చొప్పున మొత్తం 7 సెమిస్టర్‌లకు కలిపి మొత్తం రూ.35 వేలు డిమాండ్ చేస్తున్నాడు. లేనిపక్షంలో ప్రతి సెమ్‌లో రెండు బ్యాక్‌లాగ్స్ ఉంటాయి చూసుకో.. ప్రాక్టికల్స్‌లో సంతకాలు కావాలన్నా నా వద్దకే రావాలని అంటూ బెదిరించాడు. చాలా టార్చర్ పెట్టాడు. అందుకే చనిపోవాలనుకున్నా.. కానీలెక్చరర్‌ని మాత్రం వదలొద్దు’’  అని పేర్కొన్నాడు

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *