చ‌ర‌ణ్ ఆస్తి విలువ చెప్పిన నేష‌న‌ల్ మీడియా

February 9, 2019 | News Of 9

National Media revealed Ram Charan's assets value

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. త‌న టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. యాక్టింగ్ ప‌రంగానే కాకుండా బిజినెస్‌మేన్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. తాజాగా చ‌ర‌ణ్ హైద‌రాబాద్‌లో ఓ ఖ‌రీదైన ఇల్లు కొనుగ‌గోలు చేయ‌డం ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది.

చరణ్‌ ఆస్తులు, అభిరుచుల గురించి ఓ నేష‌న‌ల్ మీడియా ఓ ఆర్టిక‌ల్ ప్ర‌చురించింది. సౌత్‌లోనే అత్యంత ఖరీదైన వస్తువులు కలిగిన ఉన్న హీరోల్లో రామ్‌చరణ్ ఒకడ‌ని తెలిపింది. ఆస్టన్ మార్టిన్ లాంటి విలాసవంతమైన కారు ఆయన అభిరుచికి ఓ నిదర్శనం అని కథనంలో రాసింది. ఇలాంటి విలాసవంతమైన కార్లు, ఇతర వస్తువులు ఎక్కువగానే ఉన్నాయని వెల్లడించింది.

ఇటీవల రాంచరణ్, ఉపాసన దంపతులు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుమారు 38 కోట్ల రూపాయ‌లు పెట్టి తనకు ఇష్టమైన ఇంటికి ఓనర్ అయ్యాడ‌ని, దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే ఇంత విలాసవంతమైన ఇల్లు కలిగిన హీరోల్లో చ‌రణ్ టాప్ అని ఆ ఆర్టిక‌ల్‌లో రాశారు.

జూబ్లీహిల్స్‌లోఅత్యంత ఆధునిక వసతులు ఉన్న ఇంటిలోకి ఉపాసన, రాంచరణ్ దంపతులు త్వరలోనే అడుగుపెట్టనున్నట్టు తెలిసింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *