నేతల బల్లి యుద్ధాలే ప్రజలకు వార్తలా…?

January 21, 2019 | News Of 9

Newsof9 App released for a faster delivery | telugu.newsof9.com

  • గూగుల్ ప్లే స్టోర్ లో యాండ్రాయిడ్ యాప్ విడుదల
  • యాప్ విడుదలపై హర్షం వ్యక్తం చేసిన పాఠకులు

(న్యూస్ ఆఫ్ 9)

తెలుగు జర్నలిజంలో సరికొత్త పంథా… న్యూస్ ఆఫ్ 9. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సిన బాధ్యత నుంచి తెలుగు మీడియా దూరంగా జరిగిపోయి, ఇప్పటికే ప్రజాభిమానానికి దూరమైంది. సోషల్ మీడియాలో స్పందనలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఎప్పుడైతే మీడియా రకరకాల పార్టీలకు సంబంధించిన రంగుల్ని తనపై చల్లుకున్నదో… అప్పటి నుంచీ మీడియాపై ప్రజలకున్న అభిమానం చెల్లా చెదురై పోయింది. దీంతో పాటు మరొకటి జరిగింది. ప్రజలు కూడా నిట్టనిలువునా చీలిపోయారు. కొంతమంది ఇష్టమైన వార్తలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళతున్నారు అంటే చదువుకుంటున్నారు. హిందూ అతివాదులు.. భాజపా, హిందూ అతివాద సంస్థల సమాచారంపైనే ఆధారపడుతున్నారు. చంద్రబాబు ఈ శతాబ్దపు గొప్ప నేత అనీ, తెలుగుదేశం గురించి అబద్దాలు రాస్తున్నారనీ.. తెలుగుదేశం అభిమానులు అనుకుంటారు.

ప్రధాన స్రవంతి మీడియాని తెలుగుదేశం పార్టీ నియంత్రించడం మొదలైన తర్వాత ఈ విష పరిణామం చోటుచేసుకున్నది. ప్రజలకు ఒక రోజు నిజాలు తెలుస్తాయి. మహా అయితే ఆలస్యం కావచ్చు.

జర్నలిస్టులు నిజాలు మాత్రమే చెప్పాలా? లేక గోడ మీద పిల్లిలా (అంటే న్యూట్రల్ గా) చెప్పాలా? ఉదాహరణ. ఒక నలుగురు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మంచివాళ్లు, ఇద్దరు హంతకులు ఉంటారని అనుకుందాం. తన దృష్టిలో అందరూ సమానమేనని జర్నలిస్టు అనుకోలేడు. చెడ్డ వారి గురించి చెప్పాలి. చెడ్డవారు ఎన్నికైతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో చెప్పాలి. ‘జర్నలిస్టు అంటే తటస్థంగా ఉండాలిగా… మీరేం జర్నలిస్టు?’’ అని ఒక పాఠకుడు అడిగారు.  తెలుపు రంగు అందానికి ఎలా ప్రతీకగా మారిపోయిందో… తక్కువ సంఖ్యలో ఉండే అగ్రవర్ణాల కథలూ, వారి మధ్య ఉండే వైషమ్యాలే వార్తలుగా చలామణీ అవుతున్నాయి. ఇంకా ఎన్నాళ్లు ఇవే చదువుకుంటారు? చంద్రబాబు, జగన్… ఇద్దరూ సీఎం కుర్చీ నీకా నాకా అని రెండు గండు పిల్లుల్లా కొట్టుకుంటున్నారు. జర్నలిస్టులంతా ఈ రెండు గండు పిల్లుల తగాదా, ప్రకటనలు, వారి కదలికలు వీటి గురించే మెజారిటీ బహుజనులకు వార్తలు చేర వేస్తే… జర్నలిస్టులు తటస్థంగా ఉన్నట్లు అవుతుందా? నాయకులు కక్కింది తిరిగి ప్రజలపై వాంతి చేసుకోవడం జర్నలిజం కాదు. ఇలా చేయడం జర్నలిజం అనిపించుకోదు.

పాఠకుల్లో నాకో వింత పాఠకుడు కనిపించాడు. అతను హిందూ మతవాది. కేంద్రంలో భాజపా రావాలని కోరుకుంటాడు. కులాన్ని బట్టి రాష్ట్రంలో ఆయన కుల పార్టీ రావాలని అనుకుంటాడు. ముస్లిం అంటే నచ్చదు. కేంద్రంలో భాజపా గోవులూ, గుళ్లూ అంటూ నానా రాద్ధాంతం సృష్టిస్తుండగా, ఆంధ్రలో మరో రకమైన అరాచకం రాజ్యమేలుతోంది. సహజ వనరులన్నింటినీ అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారు. చిన్న పిల్లల మాదిరిగా సీఎం చంద్రబాబు ప్రతి రోజూ పితూరీల లిస్టు చదువుతుంటారు. అమ్మా… చూడు వాడు గిల్లాడు… నిన్న ఎక్కిరించాడు వాడు అన్నట్లుంటాయి ఆయన ప్రకటనలు. ప్రజలకు ఏం కావాలన్నది ఇపుడున్న పార్టీల అజెండాగా లేదు. కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేస్తారని తెలుసు. 35 రావాల్సిన తెరాసకు 80కి పైగా రావడం చంద్రబాబు అక్కడ కాలు పెట్టడమే. ఇపుడు కేసీఆర్ ఆంధ్రలో కాలుపెడితే… ఓడిపోతాడని మీరు అనుకుంటున్న చంద్రబాబు గెలిచి కూచుంటాడు. దీనిపైనే ‘‘కేసీఆర్-బాబు’’ రహస్య ప్రణాళిక అమలు అవుతున్నది. రెండూ బయటకు బద్ధ శత్రువులుగా నటిస్తూ…లోలోన అంగీకారాలు పెట్టుకుని పని చేస్తున్నారు. ఏం చెబితే ప్రజల్ని ఏమార్చవచ్చన్నదే వారి ఆలోచన. శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ దీనిని చక్కగా చెబుతాడు. రఘువరన్, గొల్లపూడి ఇద్దరూ బద్ధ శత్రవులు. ఇద్దరూ అర్థరాత్రి కలుస్తారు. నిన్ను ఇపుడు చంపేస్తే ఏమిటి అంటాడు రఘువరన్. మన ఇద్దరం బద్ధ శత్రవులని ప్రజలకు తెలుసు. నన్ను చంపితే నీ మీదే అనుమానం వస్తుంది అంటాడు గొల్లపూడి. నిన్ను చంపిన తర్వాత బాడీ దొరికితే కదా అంటూ రఘువరన్ కత్తితో పొడుస్తాడు. హత్యలు లేవనేగానీ… వ్యూహాలు ఇంతకు మించి ఉన్నాయి. పరోక్ష యుద్ధమే. పవన్ కళ్యాణ్ ను దెబ్బకొట్టడానికి కొందరిని రంగంలోకి దించారు. ఏదో అల్లరి చేస్తారు. వారిని టీవీలో చూపించి 70 ఎంఎంలో చూపిస్తుంది. చర్చలు పెడుతుంది. ఇవన్నీ బయటకు సహజంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. తెర వెనుక.. గూడుపుఠాణీ ఉంటుంది. డబ్బులు చేతులు మారతాయి. ఒకసారి టీవీకి వచ్చి మాట్లాడితేనే.. 50 వేలు చెల్లించి మరీ పవన్  కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడించారు. ఏదో ఒక అల్లరి. నిప్పు రవ్వ వేయండం. ఏదో ఒకటి రగిలి పెద్దది కాకుండా పోతుందా అన్న కుట్ర. తెలుగు రాష్ట్రాల్లో డబ్బుపరంగా బలంగా ఉన్న ఒక సామాజిక వర్గం… అన్ని రంగాల్లో అల్లుకుపోవడం వల్ల ఇలాంటివి సాధ్యం అవుతున్నాయి. మీడియా, లాయర్లు, కోర్టులు, పోలీసులు… నేతలూ… అన్ని రంగాలూ ఏకీకృతంగా పని చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక ధర్మాసనాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకున్నారని విని ఆశ్యర్యపోయాను.

డబ్బున్న వారికి జీవితాలు వడ్డించిన విస్తరి కావచ్చు. పేదవాడికి ప్రతి అన్నం ముద్ద కూడా ఒక సవాలు. అలాంటి సవాలును ప్రేమించే వారికి వెన్నుదన్నుగా ఉండాలన్నది న్యూస్ ఆఫ్ 9 కోరిక. బలహీనులకూ, బలమైన వారికీ జరిగే పోరాటంలో బలహీనుడి పక్షం… మాది. సమాజంలోని వ్యవస్థలన్నీ డబ్బున్నవారికి సలాం కొడుతున్నాయి. సలాం కొట్టకుండా ధిక్కరించే స్వరాలకు అండగా… న్యూస్ ఆఫ్ 9 ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో వార్తలన్నీ రాజకీయ నేతలకు అనుకూలంగానే ఉంటాయి. వాళ్ల రాజకీయ ప్రయోగాలకు అవి వేదికగా ఉంటాయి. వాటి లోగుట్టును విప్పుతూ… వెలుగులోకి తెస్తూ… న్యూస్ ఆఫ్ 9 యాండ్రాయిడ్ యాప్ ను విడుదల చేసింది. గూగుల్ యాప్ లో newsof9 అని టైప్ చేస్తే… మీకు  యాప్ కనిపిస్తుంది. మెరుగైన సమాజం కోసం అని రాయలేకపోతున్నాను… ఆశీర్వదించండి. ఆదరించండి. చాలు!!

Newsof9 App released for a faster delivery | telugu.newsof9.com

We are happy to announce that News of 9 now will be available in Android

Please download the App by clicking on this link.
https://goo.gl/scjVr7

At newsof9.com, we work for the truth with courage. We always present you unaltered news without compromising journalistic values whatsoever.

నిష్పక్షపాతంగా వార్తలను వెల్లడించే సరికొత్త సామాజిక వార్తా స్రవంతి
English Website Link : http://newsof9.com

Telugu WebSite Link : http://telugu.newsof9.com

https://twitter.com/TheNewsof9
https://www.facebook.com/Newsof9/
https://www.instagram.com/newsof9/

Subscribe us on YouTube : https://goo.gl/u5UvQw

Other Articles

5 Comments

  1. Wow that was odd. I just wrote an really long comment but after I clicked submit my comment didn’t show up. Grrrr… well I’m not writing all that over again. Regardless, just wanted to say great blog!

  2. Undeniably believe that which you stated. Your favorite reason seemed to be on the web the simplest thing to be aware of. I say to you, I definitely get annoyed while people consider worries that they plainly don’t know about. You managed to hit the nail upon the top and defined out the whole thing without having side-effects , people can take a signal. Will likely be back to get more. Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *