నెక్ట్స్ ఏంటీ? మూవీ రివ్యూ

December 7, 2018 | News Of 9

Next Enti Movie Review

చిత్రం : ‘నెక్ట్స్ ఏంటీ’

నటీనటులు: తమన్నా – సందీప్ కిషన్ – నవదీప్ – లారిసా -శరత్ కుమార్ – పూనమ్ కౌర్ తదితరులు

సంగీతం: లియోన్ జేమ్స్

ఛాయాగ్రహణం: మహేష్ చంద్ర భట్

నిర్మాతలు: రైనా జోషి – అక్షయ్ పూరి

రచన – దర్శకత్వం: కునాల్ కోహ్లి

రేటింగ్: ⅕

బాలీవుడ్ డైరెక్టర్ కునల్ కోహ్లీ అంటే ప్రేమకథలకు పెట్టింది పేరు. అతని సినీ కెరీర్ కి ఒక్క “ఫనా” చాలు. అలాంటి దర్శకుడు తెలుగులో సినిమా చేస్తునన్నాడు పైగా తెలుగు హీరో సందీప్ కిషన్ తెలుగులో బాగా పేరున్న తమన్నా లతో కెసినెమ అంటే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా ఒకింత ఆసక్తి మొదలయ్యింది. ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం!

కథ:

టామి (తమన్నా) టీనేజీ లొనే సంజూ (సందీప్ కిషన్) తో ప్రేమలో పడుతుంది. కానీ సంజు అమ్మాయిలనుండి శారీరక సుఖం తప్ప వేరే ఏమి ఆశించడని అర్ధం అయ్యి అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత క్రిష్ (నవదీప్) అనే నడివయస్కుడిని ఇష్టపడుతుంది కానీ అతనికి డివోర్స్ అయ్యాయి అన్న విషయం జీర్ణించుకోలేక అతనికి కూడా దూరం అవుతుంది. ఇంకో పక్క సంజు వేరే అమ్మాయితో పెళ్లి వరకు వెళ్తాడు సంజు కానీ కొన్ని కారణాలవల్ల పెళ్లి చేస్కోడు.

ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేస్కుని ప్రయాణం మొదలు పెడతారు. ఈ ప్రయాణం ఎలా సాగింది అనేదే అస్సలు కథ.

కథనం – విశ్లేషణ:

(పూర్తిగా చదవండి)

టామి (తమన్నా) టీనేజీ లొనే సంజూ (సందీప్ కిషన్) తో ప్రేమలో పడుతుంది. కానీ సంజు అమ్మాయిలనుండి శారీరక సుఖం తప్ప వేరే ఏమి ఆశించడాని అర్ధం అయ్యి అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత క్రిష్ (నవదీప్) అనే నడివయస్కుడిని ఇష్టపడుతుంది కానీ అతనికి డివోర్స్ అయ్యాయి అన్న విషయం జీర్ణించుకోలేక అతనికి కూడా దూరం అవుతుంది. ఇంకో పక్క సంజు వేరే అమ్మాయితో పెళ్లి వరకు వెళ్తాడు సంజు కానీ కొన్ని కారణాలవల్ల పెళ్లి చేస్కోడు.

ఆ తర్వాత ఇద్దరి ఒకరినొకరు అర్ధం చేస్కుని ప్రయాణం మొదలు పెడతారు. ఈ ప్రయాణం ఎలా సాగింది అనేదే అస్సలు కథ. వీడేంటి పైన కథ అనే సైడ్ హెడ్డింగ్ దగ్గర చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటున్నారా!! మరి అక్కడే ఉంది ఈ సినిమా సౌలు. ఈ సినిమాలో కూడా ఒక్క విషయాన్నే ఒకటికి పది సార్లు చెప్తాడు డైరెక్టర్. సినిమాలో ముందుగా ఒక అమ్మాయి-అబ్బాయి కలుస్తారు.. అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఆ అమ్మాయి-ఆమె తండ్రి కలుస్తారు. వాళ్లు కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మరో అబ్బాయిని కలుస్తుంది. వాళ్లిద్దరూ కలిసి అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఆపై ఈ అమ్మాయి నుంచి విడిపోయిన అబ్బాయి ఇంకో అమ్మాయిని కలుస్తారు. వాళ్లిద్దరూ కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. చివరికి ముందుగా విడిపోయిన అమ్మాయి-అబ్బాయి తిరిగి కలుస్తారు. వాళ్లు కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్….సో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి విసుగు తెలిస్తాడు కునల్ కోహ్లీ.

తమన్నా, సందీప్ కిషన్.. నవదీప్ వీళ్ళ గురించి చెప్పేదేముంది మంచి ఆర్టిస్ట్ లు. వీళ్ళను నమ్మి కునల్ కోహ్లీ దర్శకుడి చేతిలో పెడితే డబ్బులు బానే వస్తాయి అనుకున్నాడు నిర్మాత.అందుకే రిచ్ ఫారిన్ లొకేషన్లు.. మంచి కెమెరామన్.. అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు.. అన్ని ఈ సినిమాకి సమకూర్చారు నిర్మాత. కానీ సినిమా అనేది దృశ్య ప్రధానమైంది అని మరిచిపోయి.. రెండు గంటల పాటు ఆపకుండా కాన్వర్జేషన్ల మీద కాన్వర్జేషన్లు పెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు కునాల్. ఒక దశ దాటాక మనం సినిమాకు వచ్చామా.. లేదంటే ఏదైనా ఫిలాసఫీ కోర్సు సెమినార్ క్లాసులో కూర్చున్నామా అన్న సందేహం కలుగుతుంది. లవ్ స్టోరీలో ఉండాల్సిన ఫీల్ లేదు. పాత్రలతో ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. లొకేషన్లు.. నటీనటుల హావభావాలు.. నేపథ్య సంగీతం.. కెమెరా పనితనం.. ఇవన్నీ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చూస్తున్న భావన కలిగించే ప్రయత్నం చేస్తాయి కానీ.. కథాకథనాల్లో.. పాత్రల్లో.. సన్నివేశాల్లో.. డైలాగుల్లో ఫీల్ అన్నదే లేకపోవడంతో అంతా వృథా అయిపోయింది.

ఈ సినిమాని ఇన్సొమ్నియా రోగం తో బాధ పడే రోగులకు తీసినట్టు అనిపించక మానదు. ఎందుకంటే ఎంతటి ఇంటరెస్ట్ పెట్టి చూద్దామన్న నిద్ర రాక మానదు.

నటీనటులు:

బాలీవుడ్ వాళ్ళ దగ్గర పరువు పోకూడదు అనేమో అందరూ తమ స్థాయికి మించి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.. తమన్నా సినిమాకు పెద్ద ఆకర్షణ. అందం.. అభినయం రెంటితోనూ ఆమె ఆకట్టుకుంది. 30 ఏళ్ల వయసులో ఆమె ఇంత రిఫ్రెషింగ్ గా కనిపించడం ఆశ్చర్యమే. సందీప్ కిషన్ ఆమె పక్కన అంతగా సెట్టవ్వకపోయినా.. పెర్ఫామెన్స్ బాగుంది. నవదీప్ మరోసారి పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. లారిసాకు పెద్దగా స్కోప్ లేకపోయింది. శరత్ కుమార్ ఉన్న కాసేపు తన అనుభవాన్ని చూపించారు. పూనమ్ కౌర్ చాలా పేలవంగా కనిపించింది. పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన పూనమ్ ను చూడబుద్ధేయదు. ఆమె నటన గురించి కూడా చెప్పడానికేమీ లేదు.

సాంకేతికవర్గం:

లియోన్ జేమ్స్ పాటలు.. నేపథ్య సంగీతం రెండూ బావున్నాయి. మహేష్ చంద్ర భట్ కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. విదేశాల్లోని అందమైన లొకేషన్లను చక్కగా ఉపయోగించుకున్నారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఏం చూసి ఖర్చు పెట్టేశారో కానీ.. సినిమా అంతా కూడా రిచ్ గా కనిపిస్తుంది. ఐతే ఇటు నటీనటులు.. అటు సాంకేతిక నిపుణులు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా.. దర్శకుడు కునాల్ కోహ్లీనే పేలవమైన పనితనం చూపించాడు. తెలుగులోనే కాదు.. హిందీలో అయినా ఇలాంటి సినిమాల్ని భరించడం కష్టం. కునాల్ ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు.

చివరగా: నెక్స్ట్ ఏంటి..నిద్రపోవడమే!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *