అందరూ భక్తితో మోకరిల్లగా… బాబుగారిని ప్రశ్నించే దెవరు?

February 11, 2019 | News Of 9

No one can touch Chandrababu, Why? | telugu.newsof9.com

  • వీలయితే కాళ్లు మొక్కండి…
  • లేదంటే సరండరు అయిపోండి..  
  • లేదంటే వంగి సలాం కొట్టండి..
  • వరాల మూటలు పట్టుకుపోండి
  • అధికార దండం మీదేనని అనండి
  • లేదంటే అలగా జనం అంటారు..
  • నడిచే రోడ్లు మావేనంటారు..
  • పీల్చే గాలి మేం పెట్టిన భిక్ష అంటారు  
  • పంచెలు లాగేస్తారు.. ఓట్లు పీకేస్తారు…
  • పసుపు జెండా ఉంటే వదిలేస్తారు…

 (న్యూస్ ఆఫ్ 9)

ప్రధాని నరేంద్ర మోడీ… వచ్చారు… చంద్రబాబు నెత్తిపై నాలుగు వడ్డించారు. టన్నుల కొద్దీ అబద్ధాలను జనం మెదళ్లలో నింపేసిన నేపథ్యంలో సాక్షాత్తూ ప్రధాని కూడా ‘‘కొన్ని నిజాలు చెబుతాను’’ అంటూ అసలు నిజాలను చెప్పాల్సి వచ్చింది. కొన్ని నెలల కిందట ఈడీ, సీబీఐలతో దూకుడుగా ఉన్న ప్రధాని కూడా ఈ మధ్య ఒక అడుగు వెనక్కి వేశారు. కారణం.. ఎన్నికల వేళ ఈ కంపు ఎందుకులే అని ఆయన భావించి ఉండవచ్చు. ఎలాగూ మళ్లీ బాబు రాడు కదా అన్న భరోసా కావొచ్చు. నిజానికి అందరూ అనుకుంటున్నట్లు చంద్రబాబు ఒక వ్యక్తి కాదు. శక్తి. ఆయన సామాజిక వర్గానికి నిలువెత్తు రూపం. ఆయన సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులూ, పారిశ్రామికవేత్తలూ అందరితో కూడిన భారీ విగ్రహం. అందుకే అనేక వ్యవస్థలు ఆయన విష కౌగిలిలో ఒదిగిపోయాయి. నోరెత్తే సాహసం చేయవు. అందుకే ఆయనపై కేసులు పెట్టలేరు. పెట్టినా చెల్లుబాటు కావు. ఎందుకంటే ఆయన వ్యక్తి కాదు. ఒక డబ్బులున్న సామాజిక వర్గపు సామూహిక శక్తికి ప్రతిరూపం.

ప్రధాన మోడీ గుంటూరు ప్రసంగంలో లోకేష్ గురించి చేసిన ప్రస్తావన చంద్రబాబును ఇరుకున పెట్టింది. ఈ ప్రస్తావన అనే కాదు.. మొత్తం ప్రసంగం- చంద్రబాబు, లోకేష్, ఆయన చుట్టూ ఉన్న కాంట్రాక్టర్లను, టీడీపీ చేస్తున్న అక్రమాలపైనే సాగింది. ప్రత్యక్షంగా పేర్లు పెట్టి చెప్పకపోయినా… చంద్రబాబు సొంత సంపాదనపైనే దృష్టి పెట్టారని ప్రధాని విస్పష్టంగా చెప్పారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం అభిమాని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.

‘‘మోడీ ఒక లెక్కగడ్కరీ ఒక లెక్కఅమిత్ షా ఒక లెక్క.. ఎవరు కరెక్ట్ చెప్తున్నారో కొంచెం కనుక్కుని చెప్తారా! ఆయన చెప్తే నిజమా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అబద్దమా…’’ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాలే చెబుతారు అంటే నిన్న మొన్న పుట్టిన పిల్లవాడు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో నమ్మే అవకాశం లేదు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు అవకాశవాదాన్నే ఎంచుకున్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కనీసం తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పని వ్యక్తి… పది మందీ ఆదర్శంగా తీసుకోగలిగిన నేతగా చంద్రబాబు ఎలా అవుతారు?

మోనికా లూయిన్ స్కీ కేసులో క్లింటన్ అబద్ధం చెప్పారని పత్రికలు ఆయన్ను నిలదీశాయి. దేశాధ్యక్షుడు అబద్ధం చెప్పవచ్చా అని కాలరు పట్టుకుంటే…. దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మరి చంద్రబాబును తెలుగు మీడియా ఏ ఒక్క విషయంలోనైనా నిలదీసిందా? ఒక్క దాఖలా కూడా లేదు. ప్రశ్నలు అడిగితేనే… చంద్రబాబు జర్నలిస్టులపై విరుచుకుపడతారు. నువ్వు సాక్షి పేపరా అని అడుగుతారు. లేదా.. మైండ్ సెట్ మార్చుకోవయ్యా అంటూ కొట్టిపారేస్తారు. ఇలాంటి బాధ్యరాహిత్యమైన ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడం.

సినీ నటుడు బాలకృష్ణ బంధువు ఎం.ఎస్.పీ రామారావుకు ఎకరా లక్ష రూపాయల చొప్పున కారు చౌకగా 498 ఎకరాలను కట్టబెట్టారు. ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం కాక దీనిని ఏమని అంటారు? సాక్షి దినపత్రిక దీని గురించి అప్పట్లో పెద్ద వార్తనే ప్రచురించింది. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడా? అని అడిగిన ప్రశ్నకు ఎంతో మంది స్పందించి జీవో కాపీలతో సహా సమాధానాల్లో ఉంచారు. (సమాధానాలను ఇక్కడ చూడొచ్చు. https://www.quora.com/Is-Andhra-CM-Chandrababu-Naidu-corrupt). చంద్రబాబు వ్యవస్థీకృత అవినీతికి చిరునామా అని ఒకరు స్పందించారు. చంద్రబాబును దూరదృష్టి కలిగిన నాయకుడుగా తెలుగు మీడియా ఆయన్ను నెత్తిన పెట్టుకుని పూజలు చేస్తోందని రాశారు. చాంతాడంత అభిప్రాయాలు అక్కడ ఉన్నాయి. అన్నీ చంద్రబాబు అవినీతిపరుడనే చెబుతున్నాయి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ నిండా చంద్రబాబు అవినీతిపరుడనే చెబుతున్నాయి.

రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు తీసుకున్నామనీ, రైతులు ప్రేమతో ఇచ్చారని చంద్రబాబు పదే పదే చెబుతారు. కానీ అందులో చాలా భూముల్ని తెలుగుదేశం నాయకులు రాత్రికి రాత్రి కొనేసి… బయటకు రైతుల పేర్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం విషయంలో అదే జరిగింది. విమానాశ్రయం వచ్చే విషయం పార్టీలో కొంతమందికే చెప్పారు. అందరూ చౌకగా అక్కడ భూములు కొనేసిన తర్వాత ప్రాజక్టు ప్రకటన జరిగింది. రామోజీరావు 500 ఎకరాలు, అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ 500 ఎకరాలు, చంద్రబాబు అందరూ కలిసి పెద్ద ఎత్తున శంషాబాద్ ప్రాజక్టు నుంచి దండుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినట్లు తెలుగు దేశం నేతలు ప్రజలకు ఇప్పటికీ గొప్పలు పోతూ చెబుతారు. ఎవరి కళ్లకు గంతలు కట్టడానికో అర్థం కాదు. అమరావతి ప్రాజక్టు విషయంలోనూ ఇదే కుట్ర దాగి ఉంది. అందులో సందేహం లేదు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహా కుంభకోణం జరిగింది. అవుటర్ రింగు రోడ్డు వచ్చే విషయం ఎవరికీ చెప్పలేదు. సొంత వారికి మాత్రం చెప్పారు. అందులో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేసుకున్నారు. వైఎస్ కాంగ్రెసు కాబట్టి… ఈనాడు దీనిపై ‘‘పెద్దలా గద్దలా’’ అంటూ ఫుల్ పేజీ కథనం రాసింది. ఇదే కదా వైస్ రాజశేఖరరుడ్డికీ, ఈనాడు సంస్థకీ మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

అందువల్ల డబ్బున్న ఆ సామాజిక వర్గాలు రెండూ ఒకే తరహా పార్టీలు. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తాయి. సామాన్య జనానికి బిస్కెట్లు పారేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఎత్తుకుపోతారన్న మాట.

తెహెల్కా వెబ్ సైట్ గతంలో చంద్రబాబుపై ప్రచురించిన కథనం సంచలనం రేపింది. దేశంలోనే అత్యంత ధనవంతులైన సీఎంలలో ఆయన ఉన్నారని చెప్పింది. మరి ఇపుడు ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయన్నది తేల్చడం కూడా కష్టమే. అన్నీ బినామీల రూపంలోనే ఉంటాయి. సీబీఐ తేల్చినా… సుప్రీంకోర్టులో శిక్ష పడుతుందా? తెలియదు.

నిజానికి చంద్రబాబు తన ఆస్తుల రక్షణ కోసం… అన్ని రకాలు ఏర్పాట్లూ పకడ్బందీగా చేసుకున్న తర్వాత నుంచే ఆస్తుల ప్రకటన చేస్తున్నారు. ఆయనకు 3 కోట్ల ఆస్తే ఉందని అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? నవ్విపోతారు. పది మందీ నవ్వుతారని తెలిసినా… ఆయన అబద్ధాలను నిజాలు చేసి చెబుతూనే ఉంటారు. ఆ కక్కసును పత్రికలు ప్రజలపై గుమ్మరిస్తాయి. ఎప్పుడూ జరిగే తంతే.

‘‘లెక్కలు చెప్పండి అని ఇన్నిసార్లు ఆడిగే బదులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ఎందుకు వాడట్లేదు!!!’’ అని సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం అభిమాని అడిగారు. అవును. నిజమే. చంద్రబాబుపైన కేసు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయవచ్చు. కేవలం కేంద్రం డబ్బులు ఇవ్వనందుకే… భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయేలా చంద్రబాబు గోల చేస్తున్నారు. ఇక ఆయనపై కేసులు పెడితే ఊరుకుంటారా? రాజకీయ కక్షసాధింపు అని గొంతు చించేసుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే ఇదే మరి.

సుజనా చౌదరి 6 వేల కోట్లు బ్యాంకు రుణం ఎగ్గొట్టినా చంద్రబాబు ఆయన్ని వెనకేసుకుని వస్తున్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టినా కోర్టులో కూడా శిక్షలు పడే అవకాశం తక్కువే. చంద్రబాబు సామాజిక వర్గం వారు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోయి ఉన్నందున చంద్రబాబుకు ఏమీ కాదు. ఈ సామాజిక వర్గం- ఒక డిజైన్ ప్రకారం పని చేసుకుంటూ పోతున్నది. సుప్రీంకోర్టులో సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక ధర్మాసనమే ఉందని ఒక న్యాయవాది చెప్పగా విన్నాం. సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే.. ఏం చేస్తారు? అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళతారా? అది కుదర్దు.

కేంద్రం ఇవ్వలేదో అంటూ భాజపాని ఇన్నాళ్లూ తెలుగు ప్రజలు దుమ్మెత్తిపోశారుగానీ… మోడీ ఇచ్చేసి ఉంటే ఏమై ఉండేది? ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిపోయేవి. తర్వాత ఇపుడు ప్రశ్నలు అడుగుతున్న వారు అందుకు బాధ్యత తీసుకుంటారా? మీడియా వార్తలు చదివి రెచ్చిపోవడం తప్ప… సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించే విచక్షణను కోల్పోతున్నాం.

ఇవ్వాళ ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు చేస్తున్నది… పెద్ద ‘‘డ్రామా పోరాట దీక్ష’’ మాత్రమేనన్న వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ సొమ్ము కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? తెలుగు ప్రజల కోసం కాదన్నది సుస్పష్టం. పార్టీకి అనుబంధంగా ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల కోసమేనన్నది నూరు పైసల నిజం.

నిర్మాణాలు, ప్రాజక్టులు అంటే డబ్బులే కదా. నీకు ఇంత నాకు ఇంత… ఇదే కదా జరుగుతున్నది. ఆయన్ను శిక్షించాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం ఎన్నికల్లో ఓడించడం. తప్ప అన్యం శరణం నాస్తి. దీనికి కూడా ముందు జాగ్రత్తగా  పోలీసు అధికారులను ఉపయోగించుకుని ఇతర పార్టీల ఓట్లను తీసివేయిస్తున్నారు. అనధికారికంగా కూడా అనేక టీమ్స్ ఇందుకోసం పని చేస్తున్నాయి. ఇదంతా నియంతృత్వమే.

చాలా కమిటీలు, అసోసియేషన్లు, వ్యవస్థలూ చంద్రబాబు సామాజిక వర్గం గుప్పిట ఉన్నాయి. ఏపీ స్పెషల్ స్టేటస్ సాధన సమితి చలసాని శ్రీనివాస్ చేతిలో ఉంది. ఆఖరికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అదే సామాజిక వర్గం ముప్పాళ్ల నాగేశ్వరరావు చేతిలో ఉంది. ఇంత చిన్న ఏక వ్యక్తి సంఘాలు, సమితులే వారి చేతిలో ఉంటే..పెద్ద పెద్దవి ఎన్ని వారి చేతిలో ఉంటాయి?  

విజయవాడలో మురికివాడ వాసుల సంక్షేమ సంఘం అవసరం ఉందని అనుకోండి. దానికి కూడా అదే సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు వస్తారు. వ్యవసాయం గురించి వడ్డే శోభనాద్రి లేదా యలమంచిలి శివాజీ మాత్రమే చెప్పాలి. ప్రజాస్వామ్యం గురించి చెప్పే హక్కు చంద్రబాబుకే ఉంటుంది. లేదా వెంకయ్య నాయుడుకు ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లేదా ఈనాడు మాత్రమే చెప్పాలి. టెలిఫోను కమ్యూనికేషన్ల గురించి మాట్లాడాలంటే త్రిపుర్నేని హనుమాన్ చౌదరి మాత్రమే చెప్పాలి. విద్యుత్తు అంటే నార్ల తాతారావే చెప్పాలి. సాహిత్యం గురించి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాత్రమే చెప్పాలి. ప్రత్యామ్నాయ రాజకీయాలు, పరిపాలన గురించి లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణే చెప్పాలి. కమ్యూనిజం అయితే ఇహ చెప్పక్కర్లేదు. సినిమాల గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాత్రమే చెప్పాలి. అందువల్ల మీడియాలో ఎప్పుడూ వారే కనిపిస్తూ ఉంటారు. హైటెక్ బస్సులు నడపాలంటే కేసినేని వారే నడపాలి. రేపు స్పేస్ టెక్నాలజీ వస్తే… స్పేస్ నేని అంటూ ఒకరు వస్తారు. ఇలా వ్యవస్థలన్నీ చంద్రబాబు సామాజిక వర్గం కౌగిలిలో ఆనందిస్తున్నపుడు  చంద్రబాబు అవినీతిని ప్రశ్నించే సహసం చేసేదెవరు? కేసులు పెట్టి నిరూపించేదెవరు? అందుకే ఓటుకు నోటు కేసు కూడా నత్త నడక నడుస్తోంది. అదే ఇంకెవరైనా అయి ఉంటే ఈపాటికి చిప్పకూడు తినిపించేవారు పోలీసులు.

బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే మిగిలిన ‘‘అలగా జనం’’ వారి గురించి చదువుకుంటూ తరించిపోవాలి. ఈ సామాజిక వర్గం గురించి గొప్పలు చెప్పుకుంటూ మిగిలిన సామాజిక వర్గాలు భజన చేస్తూ బతికేస్తున్నాయి. మరి ఈ బానిస సంకెళ్ల నుంచి విముక్తి ఎన్నటికి?

ఇటువంటి పరిస్థితుల్లో… చంద్రబాబుపై ఈగ వాలుతుందా? వాలనిస్తారా? కోర్టుల్లో కేసులు గెలుస్తాయా? ప్రస్తుతం కాస్తో కూస్తో గట్టిపోటీ ఇవ్వగలిగింది జగన్ సామాజిక వర్గం. అందుకే ఇపుడు ఆంధ్రలో కూడా ఏటా 2 లక్షల కోట్లు ఎవరు ఖర్చు పెట్టాలి అన్న కోణంలోనే చర్చలు, వార్తలు వస్తున్నాయి. అన్నీ వారివే కాబట్టి.. టీవీల్లోనూ అవే కథలు కథలుగా వస్తుంటాయి. అలగా జనం అవే చదువుకుని ఎవరు గెలుస్తారో అని ఊహించుకుంటూ, చక్కిలిగింతలు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? జనసేన ఒక్కటే ఈ సాహసం చేస్తోంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. పరిస్థితులు మారే దిశగానే సంకేతాలు కనిపిస్తున్నాయి.

సొంత కుటుంబం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చంద్రబాబు నిన్న ట్విటర్ లో పేర్కొన్నారు. ఆయన ఒక్కరే కాదు.. లోకేష్ కూడా సంతృప్తిగానే ఉంటారు. నందమూరి ఫ్యామిలీ తప్ప. 2 ఎకరాలతో ప్రారంభించిన నారా కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్న తర్వాత సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏం ఉంటుంది? ఈ నెల 2 వేలు పింఛను వస్తుందో రాదో నన్న భయాలు వారికి లేవుగా!!

 మురిస్తే.. మురిసిపోనివ్వండి. మరో నాలుగు నెలలు వేచి చూస్తే.. ఎలాగూ కొత్త ప్రభుత్వం వస్తుంది. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *