బాబు ఒక అబద్ధాల యంత్రం!!

February 11, 2019 | News Of 9

Not a law maker… He is a lie maker! | telugu.newsof9.com

‘‘న్యూస్ ఆఫ్ 9’’ పరిశీలనలో తేలిన నిజం

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేస్తూ… జాతీయ మీడియాతో మాట్లాడుతూ… వారికి అబద్ధాలను చక్కగా  వడ్డిస్తున్నారు. ‘‘ఇండియా టుడే’’ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ వెళ్లి చంద్రబాబును కలిసి మాట్లాడారు. నరేంద్ర మోడీ ర్యాలీలకు వైసీపీ నేత జగన్ జనాలను పంపతున్నట్లు బాబు చెప్పారనీ, ఇక ఆసక్తికరమైన రాజకీయాలకు ఆంధ్ర యుద్ధ క్షేత్రంగా మారిందని రాజ్ దీప్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో రాజ్ దీప్ అనుకుంటున్నట్లు ఆసక్తీ లేదు గాడిద గుడ్డూ లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ సభలకు జగన్ జనాల్ని పంపిందీ లేదు పాడూ లేదు. ‘‘చంద్రబాబు అబద్ధాలు చెబుతారు. మీకు తెలియనిది ఏముంది? మోడీ వచ్చినపుడు అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు’’ అని అమరావతిలో ఉన్న మా విలేకరి స్పష్టం చేశారు.

చంద్రబాబు ఎలా తయారయ్యారంటే… అలవోకగా ఇతరులపై అబద్ధాలు చెప్పేస్తారని రూఢి అయిపోయింది. జగన్ వస్తే కలుస్తా అంటూ అని ఈ రోజు ఢిల్లీలో ప్రకటించి తెలుగు వారిని ఆయన గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఎవరు ఎవరితో కలుస్తున్నారో… ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తికమక పడిపోతే… ఇహ చంద్రన్నే బెటర్ అని వారు ఒక నిర్ణయానికి వస్తారన్నది ఆయన ఆలోచన.

ఎంతసేపూ… దొడ్డిదారిలో అధికారాన్ని కొట్టేద్దామన్న తాపత్రయం, కుయుక్తులూ తప్ప.. నీతిగా, నిజాయితీగా మాట్లాడి ప్రజలకు తానేం చేశాడో చెప్పి ఓట్లు అడిగే పని మాత్రం ఆయన చేయడం లేదు. తెల్లవారి లేస్తే… జగన్, మోడీ కలిసిపోయాడని తెలుగుదేశం నాయకులు కూడా టీవీల్లో ఊదరగొడుతుంటారు. ‘‘నువ్వేం చేశావో చెప్పవయ్యా బాబూ… జగన్ పాకిస్థానులో ఉన్న పార్టీతో కలుస్తాడు. నీ కెందుకు?’’ వాడు ఏం చేస్తున్నాడో, వీడు ఏం చేస్తున్నాడో తెలుగుదేశం వాళ్లు డిటెక్టివుల మాదిరిగా రాత్రిపూట తిరుగుతుంటారా? తెలుగుదేశం హూందాతనాన్ని పూర్తిగా మర్చిపోయింది. కొన్నాళ్లు.. పవన్ కళ్యాణ్ మాతో కలిస్తే తప్పేంటి అని అయోమయాన్ని సృష్టించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు. ఇపుడు జగన్ వస్తే కలుపుకుంటాం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల కోసం, వారి లాభాల కోసం తెలుగుదేశం అధిపతి చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మీ విన్యాసాలు ఈ సారి ఫలించే అవకాశం లేదు మాస్టారూ.

పార్టీ అంటే జనసేనే… నాయకుడు అంటే పవన్ 

రాజకీయ పార్టీ అంటే జనసేనలా ఉండాలి. వాళ్లూ… వాళ్లూ కలిసిపోతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నోరు పారేసుకున్నారా? అబద్ధాలు టన్నులు టన్నులుగా తయారు చేసి జనం మీదికి ఆయన వదులుతున్నారా? తన పని తాను చేసుకుంటున్నారు. ప్రజలకు ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. నాయకుడు అంటే ఇలా కదా ఉండాలి. పార్టీ అంటే జనసేనలా కదా ఉండాలి. ఒకరిపై ఒకరు బురద ఎత్తిపోసుకోవడం ఇటు తెలుగుదేశం పార్టీకీ, అటు వైసీపీలకీ అలవాటైపోయింది. తెలుగుదేశం చేస్తున్న కుసంస్కార కామెంట్లకు సమాధానాలు చెప్పుకోవడమే వైసీపీకి సరిపోతున్నది.

రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అని సర్ది పెట్టుకోవడానికి లేదు. తెలుగుదేశం పార్టీ… ఓడిపోతున్నదని వారికి అర్థమైనట్లుంది. ఇక లేనిపోని అబద్ధాలను కొల్లలుగా పుట్టించి జనాల్లోకి తెలుగుదేశం పార్టీ వదులుతున్నది. అధినేత దగ్గర నుంచీ… కార్యకర్తల వరకూ ఇదే పనిలో ఉన్నారు. ప్రజలపై తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ప్రేమ లేకపోవడమే.  ప్రజలపట్ల నిబద్ధత లేకపోవడమే. ఇంకా ఈ బురద పార్టీలను ఎన్నాళ్లు భరించాలో దేవుడా..?

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *