చిన బాబుకు ఓటేస్తే… డాలర్లు ఇస్తారట…!!

March 13, 2019 | News Of 9

Nara  Lokesh | Tellug.news of 9

(న్యూస్ ఆఫ్ 9)

పంచాయితీ ఎన్నికల్లో గెలవని చిన బాబును పంచాయితీ మంత్రిని చేశారన్న అపవాదు నుంచి చినబాబు కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఈ సారి చినబాబును రంగంలోకి దింపాలని నిర్ణయించింది. కానీ.. ఎక్కడ నుంచి దింపాలన్న దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముందు భీమిలి నుంచి అన్నారు…. తర్వాత విశాఖ నుంచి అన్నారు. ఇపుడు తాజాగా… వినిపిస్తున్న పేరు మంగళగిరి. చినబాబు ఎక్కడ నుంచి పోటీ చేసినా… గెలిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లూ పుత్రోత్సాహంతో చంద్రబాబు చేసిపెడతారన్న విషయంలో సందేహం లేదు. మేము ఊహిస్తున్నదేమంటే… చిన బాబు ఎక్కడ నుంచి పోటీ చేసినా అక్కడ ఎగస్పార్టీ ఓట్లను తీసేసి ఉంటారు. ముందే ఆ విషయం చెబితే ఇబ్బంది కదా.. అందుకని కాసేపు భీమిలి అంటారు… మరి కాసేపు విశాఖ అంటారు.. ఇలా ప్రజల్ని తికమక పెట్టీ పెట్టీ… చివరికి ఏదో ఒక చోట ఖరారు చేస్తారు. అక్కడ వైసీపీ, జనసేన సీట్లను తీసేసి ఉంటారు. కాబట్టి, ఏ లక్ష ఓట్ల మెజారిటీతోనే గెలిపించేయవచ్చన్న వ్యూహం ఉంటుంది.

విదేశాల్లో ఉన్న ఓటర్లను కూడా ఈ సారి చినబాబుకు ఓటేయాలంటూ ఎన్నారైలకు ఆదేశాలు వెళ్లిపోయినట్లు తెలిసింది. మరీ విచిత్రం ఏమంటే… ఈ సారి విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటే వారికి 500 నుంచి 2,000 డాలర్ల వరకూ వారికి నజరానా అందిస్తారట. ఈ మేరకు అమెరికాకు ఫోన్లు కూడా వెళ్లాయి. చినబాబా… మజాకానా… నారా వారి వారసుడు పోటీ చేస్తే హంగూ ఆర్బాటం ఉండాలి కదా… మునిసిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలవలేని వాళ్లను కూడా ఎమ్మెల్యేని చేసిన ఘనత తమదేనని చినబాబుగారు ఓ దగ్గర సెలవిచ్చారు. ఆ మాట నిజమే కదా. బాలకృష్ణ భాషలో చెప్పాలంటే ఎంతో మంది అలగా జనాన్ని తెచ్చి టీడీపీ టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేలుగా చేశామన్నది చినబాబు మాట. మరి స్వయంగా రాజకుమారుడే ఏతెంచినపుడు రాకుమారిని ఆయన ఎంచుకుంటాడా ఏమిటి? రాకుమారే ఆయన మెడలో దండవేయాలి. అలాగే… చినబాబు నిలబడితే.. నియోజకవర్గమే వెళ్లి ఆయన మెడలో దండవెయ్యాలి. మరి ఆ అదృష్టం చేసుకున్న నియోజకవర్గం ఏదో…? మంగళగిరి అంటున్నారు. అదృష్టం మంగళగిరిని వరిస్తుందో లేదో చూద్దాం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *