ఎన్టీఆర్ మూవీ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్

December 2, 2018 | News Of 9
NTR Kathanayakudu first track released | news of 9

దివంగ‌త న‌టుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య స్వ‌యంగా న‌టిస్తూ, నిర్మిస్తుండ‌గా సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

2019 జనవరి 9న ‘యన్.టీ.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టీ.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా, ఇవి సినిమాపై అంచ‌నాలు పెంచాయి. తాజాగా ఎన్టీఆర్ సినిమా నుంచి ‘ఘన కీర్తి సాంధ్ర..  విజితాఖిలాంద్ర..’ అనే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట‌ని ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు కైలాష్‌ఖేర్‌  ఆలపించారు. శివశక్తిదత్తా రచించారు. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణితో కలిసి పాటను రికార్డ్‌ చేయడం ఎప్పుడూ సంతోషాన్నిస్తుందని ఈ సందర్భంగా కైలాశ్‌ఖేర్‌ అన్నారు.

 

రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రాశారు. ఈ పాట అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టించ‌గా, చంద్రబాబు పాత్ర‌లో ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్నాడు. ఇక ముఖ్య పాత్ర‌ల‌లోను ప‌లువురు సీనియ‌ర్ స్టార్స్ న‌టిస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *