నూజివీడు ఐఐఐటి విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

April 24, 2019 | News Of 9

Nuzvid IIIT student made suicide attempt | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

తెలంగాణలో… ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఒకవైపు ఆందోళన కలిగిస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐఐఐటీ విద్యార్ధి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నూజివీడులో ఐఐఐటి విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏవో మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధి సూసైడ్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విద్యార్ధులు డిమాండు చేస్తున్నారు. ఐఐఐటిలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఐఐఐటి అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ అనేక సార్లు

యూనివర్సిటీ అధికారులుకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నూజివీడు ఐఐఐటీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో సమగ్రంగా విచారణ జరిపించాలని, విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని  ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా (పశ్చిమ) కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు డిమాండు చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *