వారు శాసిస్తారు… జనం పాటిస్తారు…!!

February 21, 2019 | News Of 9

70 ఏళ్ల ఊడిగానికి మూలాలు- 05

On one Side dire poverty, On the other Neo Rich, WHY?

నోట్ ఇట్ ప్లీజ్: 2019 ఎన్నికలకు తెలుగుదేశం వారు ఓటుకు ఇలాంటివి రెండు ఇస్తారట… (గ్రాఫిక్ కోసం మార్పు చేసిన 2000 నోటు)

తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారాలు ఎలా విస్తరించాయన్నది… న్యూస్ ఆఫ్ 9 మీకు అందిస్తున్నది. ఆర్దర్ కాటన్ ఆనకట్ట నిర్మాణంతో ప్రారంభమైన వారి ప్రభ… తర్వాత కాలంలో పొగాకు వ్యాపారంలోకి ప్రవేశించడం, అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఆ రంగానికి చెందిన వారు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకోవడం, తెలుగుదేశం పార్టీ ప్రైవేటు లిమిటెడ్ లాగా పని చేయడం… అనంతరం విద్య, వైద్య, నిర్మాణ రంగాల్లోకి వారు ప్రవేశించడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక, ఆర్ధిక రంగాలు ఆ సామాజిక వర్గం గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. సామాజిక న్యాయం జరగాలనీ, అందరికీ అవకాశాలు రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతారు. కులం, రాజకీయ అధికారం, పెట్టుబడిదారులూ అన్నీ పడుగుపేకల్లా కలిసిపోవడంతో వారికి తిరుగులేకుండా పోయిందన్నది వాస్తవం. ఇవన్నీ వారికి దేవుడు ఆశీస్సులతోనే జరిగాయనీ, నిమ్న బడుగు వర్గాలకు దేవుడు సహకరించలేదనీ పాఠకులు భావిస్తే… 90 శాతం వర్గాలకు నిచ్చెన మెట్లు ఎక్కడానికి మరో వందేళ్లు పడుతుంది. కులం అనేది కరెంటు లాంటిది. బయటకు కనిపించదు. కానీ.. కొంత మందికి దాని ప్రయోజనం ఉంది. దీనివల్ల మిగిలిన వారికి అవకాశాలు చేజారిపోతాయి.

చరిత్ర తెలుసుకోకపోతే… ముందుకెళ్లే దారి కనిపించదు. తెలుసుకోవడం తప్పు కాదు. ఎవరినీ ద్వేషించడానికి ఉద్దేశించి ఈ కథనాలను ప్రచురించడం లేదు. బానిసత్వం పోవాలంటే.. ముందు తెలుసుకోవాలి. అంతే!!

(న్యూస్ ఆఫ్ 9 కథనం)

వెంకట్ జాస్తి (సువెన్ లైఫ్ సైన్సెన్స్), ఎస్.పీ.వాసిరెడ్డి (విమ్టా లాబ్స్) కూడా ముఖ్యులే. వీరంతా కమ్మవారే. వీళ్లంతా పెట్టుబడులను విదేశాల్లోని ఫార్మా పరిశోధనా కంపెనీలకు చెందిన కాంట్రాక్టు పరిశోధనలు, క్లినికల్ ట్రయిల్స్ ద్వారా సమకూర్చుకున్నారు. వైద్యపరమైన క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించడానికి చాలా కంపెనీలకు అనుమతులు లేకపోయినా అనధికారికంగా నిర్వహించాయన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అవి వీరే చేశారా ఎవరైనా చేశారా అన్నది స్పష్టంగా తెలియదు. విస్కన్సిన్-మేడిసన్ యూనివర్శిటీలో మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ చేసిన కృష్ణ ఎం.ఎల్లా… 1996లో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ను స్థాపించారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గమే. భారత్ హెపటైటిస్ –బి, టైఫాయిడ్ వాక్సీన్లను తయారు చేస్తుంది. (హెపటైటిస్-బి వ్యాక్సీన్ అసలు అనవసరమనీ, దీనిని ప్రజలపై బలవంతంగా రుద్దినట్లు నేను ‘‘ఈనాడు’’లో ఉండగా చేసిన పరిశోధనలో తేలింది. ఆ వార్తను ఈనాడు తిరుపతి ఎడిషన్ లో ప్రచురించాను.

On one Side dire poverty, On the other Neo Rich, WHY?
భారత్ బయోటెక్ అధినేత: కృష్ణ ఎం.ఎల్లా

ఇలాంటి విషయాల్లోనే ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలకు సహకరిస్తాయి. తెలుగుదేశం ప్రభుత్వంతో ఉండే పరిచయాలు ఇందుకు ఉపకరించి ఉండవచ్చు- ఎడిటర్). మందుల కంపెనీలు, ఆస్పత్రులూ తెర వెనుక ఒప్పందాలతో పని చేస్తుంటాయి. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవేనన్నది గమనార్హం. కామినేని సూర్యనారాయణకు చెందిన కామినేని హాస్పిటల్స్ (నల్గొండలో వీరికి మెడికల్, డెంటల్ కళాశాల ఉంది), బొల్లినేని కృష్ణయ్యకు చెందిన హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ (నెల్లూరు, రాజమండ్రి, కడప కూడా), కావూరి సాంబశివరావు అల్లుడు డాక్టర్ రమేష్ కు చెందిన మెడ్విన్ హాస్పిటల్స్, రత్నం వి. ముళ్లపూడికి చెందిన ఉషా ముళ్లపూడి కార్డియాక్ హాస్పిటల్స్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి…ఇవన్నీ కమ్మవారివే. చిత్తూరుకు చెందిన గల్లా రామచంద్ర నాయుడు అనంతపురం ఇంజినీరింగ్ కాలేజీ నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ ఇంజినీరు. రూర్కీలో చదువుకున్న అనంతరం 1960ల్లో మిషిగన్ స్టేట్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అమెరికా స్టీల్ కార్పొరేషన్, షికాగోలోని సార్జంట్ అండ్ లుండీలో 15 ఏళ్లు పని చేసిన తర్వాత 1985లో అమరరాజా బ్యాటరీల కంపెనీని ప్రారంభించారు. నీళ్లతో పనిలేని లెడ్ యాసిడ్ బ్యాటరీలు తయారు చేస్తారు. గల్లా… జాన్సన్ కంట్రోల్స్ తో ఒప్పందం చేసుకుని దీనిని ప్రారంభించారు. విద్యుత్తు సంస్థలు, రైల్వేలు, టెలికాం, డిఫెన్స్ వంటి ముఖ్యమైన రంగాలకు అమరరాజా బ్యాటరీలను సరఫరా చేసింది. అమరాన్ పేరుతో ఆటోమోటివ్ బ్యాలరీలను కూడా తర్వాత చేపట్టింది. ఎక్సైడ్ తర్వాత అమరాన్ రెండో స్థానంలో ఉన్నది.

On one Side dire poverty, On the other Neo Rich, WHY?
సువిశాల ప్రాంగణంలో అమర రాజా బాటరీస్ కర్మాగారం.

మొదటి నుంచీ అమరరాజా కంపెనీ యజమానులకు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు ఈనాటి చంద్రబాబు నాయుడుకు గురువు. ఆయన కుమార్తె గల్లా అరుణకుమారిని గల్లా రామచంద్రనాయుడు పెళ్లి చేసుకున్నారు. వారి కొడుకే గల్లా జయదేవ్. గల్లా అరుణకుమారి వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన విషయం తెలిసిందే.

On one Side dire poverty, On the other Neo Rich, WHY?
చంద్రబాబుతో గల్లా వంశంలో మూడో తరం. కుడివైపు గల్లా జయ్ దేవ్

నూజివీడు సీడ్స్, హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలు. నూజివీడు సీడ్స్ ను గుంటూరుకు చెందిన ఎం.వెంకట రామయ్య ప్రారంభించారు. బన్నీ పత్తి విత్తనం దీని నుంచే వస్తోంది. హెరిటేజ్ చంద్రబాబుదన్న సంగతి తెలిసిందే. విశాఖకు చెందిన దేవీ సీ ఫుడ్స్, శ్రీరామ్ అట్లూరికి చెందిన నెక్కింటి సీ ఫుడ్స్ కూడా విశాఖకు చెందిన కమ్మవారివే. ఎక్కువ మంది చదువుల్ని అందిపుచ్చుకున్న తర్వాత కమ్మ సామాజిక వర్గంలో రెండో తరం పారిశ్రామికవేత్తలుగా అవతరించారు. దీనితో వ్యాపారం అంటే కమ్మవారు మాత్రమే చేయాలన్న అభిప్రాయం కూడా జనాల్లో పాతుకుపోయింది.

మెడికల్, ఇంజినీరింగ్ ఎంట్రన్సులకు శిక్షణ ఇస్తున్న వాటిలో శ్రీ చైతన్య, నలంద, విజ్ఞాన్‌ కాలేజీలు ముందుంటాయి. విశాఖపట్నంలో 200 మంది విద్యార్ధులతో, 10 మంది సిబ్బందితో వికాస్ ప్రారంభమైంది. దీనిని ప్రారంభించింది యార్లగడ్డ రాజశేఖర్ బాబు, తుమ్మల నాగ ప్రసాద్. ఒకరు ఇంజినీరింగ్ చదివారు. రెండో వ్యక్తి లెక్కలు సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేట్. వీళ్లిద్దరిదీ నూజివీడు పట్టణం. కానీ విశాఖలో వ్యాపారం పెట్టారు. శ్రీ చైతన్య కళాశాల ఎంసెట్ పేపర్ల లీకేజీ కేసులను ఎదుర్కొంది. ఈ ప్రైవేటు విద్యా వ్యాపారం గురించి తెలుగు వారికి బాగానే తెలుసు.

నలంద టాలెంట్ స్కూలు (విశాఖ), హైదరాబాదులోని ఓక్ రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలు కూడా వికాస్ వారివే. నలందాకు చెందిన విజయబాబు కూడా దాదాపు 50 సెంటర్లను నిర్వహిస్తున్నారు. గూంటూరులో కోచింగ్ సెంటర్ తో ప్రారంభమైన లావు రత్తయ్య విద్యా వ్యాపారం బాగానే విస్తరించింది. ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఇంటర్మీడియెట్ విద్యను నాశనం చేశాయి అనడంలో సందేహం లేదు. ఇలా అన్ని రంగాల్లో వారి గుత్తాధిపత్యం ఏర్పడింది. మోనోపోలీ ట్రేడ్ రీస్ట్రిక్టీవ్ ఆక్ట్ అని ఒకటి ఉంది. కానీ ఈ చట్టం కింద చర్యలు తీసుకున్న దాఖలా లేదు. ఈ చట్టం ప్రకారం గుత్తాధిపత్య వ్యాపారం చేయరాదు.

(తర్వాత… రెడ్డి వ్యాపార సామ్రాజ్యాల గురించి)

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *