ఒకటే మాట… ఒకటే బాణం :పవన్ కళ్యాణ్

November 16, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.comtelugu.newsof9.com

(రాజానగరం నుంచి)

గుండె లోతుల్లో నుంచి జనం గుండెల్లోకి….
తిన్నగా దూసుకుపోయే మాటల్ని చూశారా?
ఆవేశంతో కలగలిసిపోయి జనం ఆకాంక్షలకు
ప్రతిరూపమైన నాయకుడిని చూశారా?
కంటికి కనిపించని కరెంటులా జివ్వుమనే
ప్రసంగాలు చేసే నేతను చూశారా?
అది జనసేన అధ్యక్షుడు –పవన్ కళ్యాణ్.

జాతి భవిష్యత్తును కోరుకుంటూ, తోటి జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముంత్రముగ్దుల్ని చేస్తూ పవన్ కళ్యాణ్ ఆశువుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రజలను చుట్టుముట్టేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరంలో జరిగిన పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకూడదని, వస్తే రైతుల భూములు లాక్కుపోతారని హెచ్చరించారు. ‘‘చాలు.. భరించాం… దశాబ్దాలు భరించాం. ఈ ప్రభుత్వాలు చాలు. జనసేన ప్రభుత్వాన్ని తెద్దాం’’ అని పవన్ అన్నారు. పవన్ వచ్చిన వెంటనే ఆకాశంలో తారాజువ్వలు లేచాయి. టపాసులు కాల్చుతూ రాజానగరం ఆయనకు స్వాగతం పలికింది. ఆకాశంలోకి చూస్తూ… ప్రజల్లోని సంతోషాన్ని తన ప్రసంగంలోకి తీసుకుంటూ… ‘‘ప్రజా జీవితాల్లో వెలుగులు తెద్దాం…జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం’’ అంటూ పవన్ చెప్పిన తీరు అనన్యం. జాతీయ జండాను మోసే.. కనీస నైతికత కూడా చంద్రబాబుకీ, జగన్ కీ లేవని ఆయన అన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు కాల్చుకోండి అంటూ బ్రిటీష్ వారికి గుండెలు చూపిస్తే, చంద్రబాబు మాత్రం తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని అన్నారు. జనసేన జండా నీతిని నిలబట్టే జండాగా అభివర్ణించారు పవన్. ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ లు ఎప్పుడూ జైహింద్ అనగా చూడలేదన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూనే చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టారని అన్నారు. అందుకే తెలుగుదేశాన్ని తన్ని తగలెయ్యాలని పిలుపునిచ్చారు. యువతను పట్టించుకోని ప్రభుత్వం మనకెందుకు అని అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా జగన్ నడిచీ,.. నడిచీ… నడిచీ అంటూ ఎద్దేవా చేశారు. మనకు జగన్ వద్దు… చంద్రబాబు వద్దు… లోకేష్ వద్దే వద్దు అంటూ యువతను ఉత్సాహపరిచారు. ‘‘నాది ఒకటే మాట… ఒకటే బాణం. గురి చూసి కొడితే లక్ష్యాన్ని చేరుకోవాలంతే’’ అని అన్నారు.

రాజకీయ నాయకులు ఏం చేసి సంపాదిస్తున్నారని పవన్ ప్రశ్నించారు. అందరూ ఉద్యోగాలు చేస్తారు… లేదా పని చేస్తారు. వీళ్లకు డబ్బులు ఎలా వస్తున్నాయని అన్నారు. దొంగదారిలో డబ్బు సంపాదించుకుంటూ వారు మనల్ని పైకెక్కి తొక్కుతున్నారని అన్నారు. వరదలాగా… తుపానులా… తెలుగుదేశం పార్టీని సమూలంగా తుడిచిపెట్టేద్దామని అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తీరుస్తానని, భూముల సేకరణ, పరిహారాల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామన్నారు.

సినిమాల్లోనే జాగ్రత్తలు తీసుకున్నా…

‘‘అశ్లీలత, అసభ్యత అన్నది నా సినిమాల్లోనే కనిపించవు. యువత చెడిపోకుండా ఉండాలని అంత జాగ్రత్త తీసుకున్నా. సినిమాల్లోనే ఇంత జాగ్రత్తగా ఉంటే… నిజ జీవితంలో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత చేస్తానో మీరే ఊహించుకోండి’’ అని అన్నారు. ‘‘ఇంకా ఓట్లు వేయని ఈ దశలోనే ఎంతో చేస్తున్నానని, ఇక ఓట్లు వేసి గెలిపిస్తే ఎంత చేస్తానన్నది మీరు ఊహించండి’’ అన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని, అయితే, చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేసి మద్యాన్ని మాత్రం ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు.
హోర్డింగ్ ను చూస్తూ.. తన ఇంటిపేరు కొణిదెల కాదని, తాను ఒక ఇంటికి చెందిన వాడిని కూడా కాదని పవన్ అన్నారు. సమాజ సేవ కోసం తనను వదిలివేయమని అమ్మను బతిమాలుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

తెలుగుదేశం ఛిద్రమయ్యేలా, జగన్ పారిపోయేలా, ఒక్కసారి జైహింద్ అంటూ చెబుదాం అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Other Articles

136 Comments

 1. Pingback: canadian viagra
 2. I believe this is one of the most significant information for me.
  And i am happy reading your article. But wanna commentary on some basic issues, The
  web site taste is perfect, the articles is truly nice :
  D. Just right process, cheers

 3. Thanks a bunch for sharing this with all of us you really recognize what you’re talking about!
  Bookmarked. Kindly additionally visit my web site =). We may have a link alternate arrangement between us

 4. Heya i am for the first time here. I came across this board and I to find It
  really useful & it helped me out much. I am
  hoping to provide one thing back and help others such as you aided me.
  cheap flights y2yxvvfw

 5. Hi, i think that i saw you visited my blog thus i came to “return the favor”.I’m trying to find things to
  enhance my web site!I suppose its ok to use some of your ideas!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *