కియాలో స్వీపర్ ఉద్యోగాలే: వైఎస్ జగన్

February 11, 2019 | News Of 9

Only sweeper posts in Kia Moters for locals | telugu.newsof9.com

అనంతపురం: వాచ్‌మెన్‌లు, స్వీపర్ల ఉద్యోగాలకే అనంతపురం నిరుద్యోగులను పరిమితం చేస్తున్నారనీ దీనికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలనీ జగన్ ఎద్దేవా చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా జరిగిన సభలో  ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వని పరిశ్రమల వల్ల ఏం ప్రయోజనమని నిరుద్యోగులే ప్రశ్నిస్తున్నారన్నారు.  వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

 చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందనీ, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు కూడా ఇవ్వడం లేదనీ దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య సదుపాయాలు పెంచుతామనీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని జగన్ చెప్పారు. ఉపాధి హామీ కూలీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత సిగ్గు చేటని ప్రతి పక్షనేత జగన్ ఆక్షేపించారు.  ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆస్పత్రులన్నీ వృథా అన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ అన్నారు. లోకేష్ కనుసన్నల్లో నడిచే మెడాల్ సంస్థకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపరీక్ష కాంట్రాక్టు పనులు అప్పగించి మరీ దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వైద్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నరు. సర్కార్‌ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని వాగ్ధానం చేశారు.

Other Articles

5 Comments

 1. This is really attention-grabbing, You’re an excessively professional blogger.
  I have joined your feed and look forward to in the
  hunt for more of your fantastic post. Also, I
  have shared your web site in my social networks

 2. After I originally commented I appear to have clicked on the -Notify me when new comments are
  added- checkbox and from now on every time a comment is
  added I receive 4 emails with the exact same comment.
  Perhaps there is a means you are able to remove me from that service?
  Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *