`పైసా ప‌ర‌మాత్మ` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి

December 5, 2018 | News Of 9
కొత్త‌ద‌నం, వైవిధ్యం ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. స్టార్లు లేక‌పోయినా, సినిమాలో క‌థ‌, కంటెంట్ విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్నాయి. ఆ విష‌యాన్ని ఇటీవ‌లే రిలీజైన కొన్ని ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు నిరూపించాయి. గూఢ‌చారి, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100, పెళ్లి చూపులు చిత్రాలు ఈ త‌ర‌హానే. ప‌క్కా కంటెంట్‌, ఆర్టిస్టుల ప్ర‌తిభ‌, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల గ‌ట్స్ ఈ చిత్రాల విజ‌యాల‌కు కార‌ణం. ఇప్పుడు అదే బాట‌లో అదే కాన్ఫిడెన్స్‌తో వ‌స్తున్న మ‌రో క్రేజీ సినిమా `పైసా ప‌ర‌మాత్మ‌`. సంకేత్‌, సుధీర్, క్రిష్ణ తేజ‌, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. విజ‌య్ కిర‌ణ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  కనిష్క్  సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే  నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.
నిర్మాత కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ -“క‌థ‌, కంటెంట్‌పై న‌మ్మ‌కంతో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా చిత్రీక‌రించాం. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న హైలైట్‌. ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ప్ర‌తిభావంతంగా తెర‌కెక్కించారు. ఇదివ‌ర‌కూ బోనాలు పండగ సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశాం. రాజ్ కందుకూరి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. వీటికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం. చ‌క్క‌ని యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందిస్తున్నాం. ప్రేక్ష‌కుల ఆశీస్సులు మాకు ఉంటాయ‌ని ఆశిస్తున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు విజ‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ -“అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చే చ‌క్క‌ని చిత్ర‌మిది. ఈ సినిమాకి పాట‌లు, సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. మునుముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మ‌రింత‌గా ఉధృతం చేస్తున్నాం. యూత్‌, ఫ్యామిలీస్ మెచ్చే ఆస‌క్తిక‌ర క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. క‌థ‌నం  హైలైట్‌గా ఉంటుంది“ అన్నారు.

Other Articles

11 Comments

 1. Hey just wanted to give you a quick heads up. The
  text in your content seem to be running off the screen in Ie.
  I’m not sure if this is a format issue or something to
  do with internet browser compatibility but I figured I’d post to let you know.

  The design look great though! Hope you get the issue solved soon.
  Thanks

 2. Thanks for your marvelous posting! I quite enjoyed reading it, you might be a
  great author.I will make certain to bookmark your blog and definitely will come back sometime soon. I want
  to encourage that you continue your great posts, have a nice holiday weekend!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *