పందెంకోడి మూవీ రివ్యూ…3/5

October 18, 2018 | News Of 9

Pandem Kodi 2 Movie

చిత్రం : పందెంకోడి

రేటింగ్ : 3/5

నటీనటులు : విశాల్, కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రాజ్ కిరణ్, అర్జై , తదితరులు

సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా

ఛాయాగ్రహణం : ఎన్ లింగుస్వామి

ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్

నిర్మాత : ఠాగూర్ మధు

రచన, దర్శకత్వం : ఎన్ లింగుస్వామి

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2018

 

సరిగ్గా పదమూడు సంవత్సరాల క్రితం విశాల్ హీరోగా వచ్చిన పందెంకోడి సూపర్ డూపర్ హిట్ అయ్యి విశాల్ కెరియర్ నే మార్చేసింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది ఈ సినిమా. మరి దీనికి సీక్వెల్ చేయడానికి చాలా టైమ్ తీస్కున్న డైరెక్టర్ ఈ పందెంకోడి 2 ని ఎలా తీసాడు. విశాల్ మళ్లీ హిట్ కొట్టాడా లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:

పందెంకోడి సినిమాలో విశాల్ తండ్రి ఎలాగైతే ఊరికి పెద్దగా ఉంటాడో ఈ సినిమాలో కూడా ఆయనే పెద్ద. విదేశాల్లో ఉన్న విశాల్ సొంత ఊరికి వస్తాడు. ఊర్లో జరిగే గొడవల కారణంగానే విశాల్ ఊరికి వచ్చాడని తెలుస్తుంది. ఊర్లో వీరభద్రస్వామి జాతర్లో జరిగిన గొడవ వల్ల రెండు కుటుంబా మద్యన పగ చోటుచేస్కుంటుంది. భర్తని పోగొట్టుకున్న భవానీ అంటే వరలక్ష్మీ శరత్ కుమార్ మళ్లీ జాతర ఎప్పుడొస్తుందా..? అనే అదను కోసం వెయిట్ చేస్తుంది. మరి భవానీ పెంచుకున్న పగేంటి..? దీనికి పందెంకోడి విశాల్ కి సంబంధం ఏంటి..? జాతర్లో అసలు ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే.

సినిమాలో ప్లస్ పాయింట్స్.

యాజ్ యూజ్ వల్ గా విశాల్ యాక్టింగ్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్, ఇక హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ తో పోటీపడి మరీ నటించింది. కీర్తిసురేష్ అల్లరిపిల్లగా బాగా చేసింది ఇది సినిమాకి మరో ప్లస్ పాయింట్. సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాయి. యాక్షన్ ఎపిసోడ్స్, విశాల్ చెప్పిన డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా క్ల్లైమాక్స్ సీన్ డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో ఫోటోగ్రఫీ అందించిన శక్తివేల్ కి వందకి వంద మార్కులు వేయచ్చు.. అంత గొప్పగా జాతర అందాలని చూపించాడు. పందెంకోడి అనే టైటిల్ కి కరెక్ట్ సీక్వైల్ తీసాడు డైరెక్టర్.. ఎక్కడా కూడా ఫ్లేవర్ మిస్ కాకుండా చేసాడు. ఇదే సినిమాకి ప్లస్ పాయింట్.

సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే..,

బలమైన ప్రతినాయకుడి పాత్ర లేదు. కథలో కొద్దిగా ట్విస్ట్ ఉంటే బాగుండేది. ప్లైయిన్ న్యారేషన్ వల్ల సినిమా గతంలో చూసిన సినిమాల్లాగానే అనిపిస్తుంది. డబ్బింగ్ క్వాలిటీ మరింత మెరుగుపడాల్సి ఉంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే పందెంకోడి ఫస్ట్ పార్ట్ కంటే కొద్దిగా మసాలా తగ్గిందనే చెప్పాలి. ఈ కోడి దసరాకి బాక్సాఫీస్ కొల్లగొట్టడం గ్యారెంటీగానే కనిపిస్తోంది. ఇక విశాల్ ఫ్యాన్స్, యాక్షన్ సినిమాలు ఇష్టంగా చూసే వాళ్లకి సినిమా బాగా నచ్చుతుందనే చెప్పొచ్చు. ఒక్కమాటలో దసరాకి వచ్చిన ఈ పందెంకోడి పార్ట్ 2 పర్వాలేదనిపించింది.

Other Articles

24 Comments

  1. The identify of the author is Jere and he absolutely digs that identify. Interviewing is the place my principal profits comes from but the advertising never at any time arrives. Years back we moved to Louisiana. Doing magic is what she loves carrying out.

  2. They contact the creator Shonda although she doesn’t actually like becoming known as like that. The favored passion for my children and me is kayaking and now I’m attempting to gain income with it. She is at present a credit authoriser but soon her partner and her will commence their personal small small business. Indiana is her birth area but her partner would like them to move.

  3. FSMB – Why not ? The simple answer is that by the time the 2nd monthly check is received, the cost of a single loaf of bread would already be $25 Trillion.Call it Fraud, call it Market Economics – in fact call it whatever you please – the fact remains that infaltion is a beast that is both determined and capable of always remaining ahead of the curve – inflation is one of this worlds’ most deadly weapons and is jointly wielded by both Freemarketeers, Banks and Governments.Can you imagine how long the “Banks” would “need” to “clear” these funds in your account ? Life is still too short 😉

  4. Attractive section of content. I just stumbled upon your website and in accession capital to assert that I get actually enjoyed account your blog posts.Anyway I’ll be subscribing to your augment and even I achievement you access consistently fast.

  5. Good day! I could have sworn I’ve been to this site before but after
    browsing through some of the post I realized it’s new to me.
    Nonetheless, I’m definitely glad I found it and I’ll be book-marking and checking back frequently!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *