శాంతిభద్రతల్లో భాగంగానే రేవంత్ అరెస్టు: ఈసీ

December 4, 2018 | News Of 9

Rajat Kumar | telugu.newsof9.com

హైదరాబాదు:  రేవంత్ రెడ్డి అరెస్టునకు సంబంధించి…  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఒక వివరణ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

‘‘ఈనెల 2 వ తేదీన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన ఇచ్చారు. సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో 4 వ తేదీన బంద్ నిర్వహించాలని ఆయన పిలుపిచ్చారు. దీనిపై తెరాస నేతలు నాకు ఫిర్యాదు చేసారు. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక  పంపించాం. వాళ్ల ఆదేశాలకు అనుగుణంగా నేను ఎన్నికల అధికారికీ, జిల్లా ఎన్నికల అధికారికీ లేఖలు రాశాను. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని వాళ్ళను కోరాను. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున కొడంగల్ అభ్యర్థిని అరెస్టు చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నాం. ఈసీ అన్ని పార్టీలను ఒకేలా చూస్తుంది. ప్రస్తుతం కొడంగల్లో మాత్రమే కొంత శాంతి భద్రతల సమస్య ఉంది. రాష్ట్రంలో అంతటా ప్రశాంతంగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని విజ్ఞప్తులు పరిశీలిస్తాం. ఎవరికైనా ప్రచారం చేసుకొనే వీలు, స్వేచ్ఛ కల్పిస్తాం’’ అని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *