మహిళలే రారాణులుగా జనసేన కమిటీలు

February 1, 2019 | News Of 9
previous arrow
next arrow
Slider

 

 • తొలి జాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్

భారతదేశ రాజకీయాలలో జవాబుదారీతనం తీసుకురావాలి…ఈ దేశ రాజకీయాలు  అభివృద్ధి కాముకులైన మేధావులతో నిండి ఉండాలి… లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడయాడాలి.. యువత  దేశ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించాలి… బడుగు వర్గాలకు సముచిత రాజకీయ ఫలాలు దక్కాలి… మహిళాశక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న తలంపుతో రెండు దశాబ్దాలుగా తన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇస్తూ తీర్చిదిద్దిన జనసేన పార్టీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఆవిష్కరించారు. సమకాలీన రాజకీయ పార్టీల కమిటీ నిర్మాణాలకు భిన్నంగా, భవిష్యత్తు భారతావని అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కమిటీలకు పవన్ కళ్యాణ్ రూపకల్పన చేశారు. పార్టీ అధ్యక్షుని నేతృత్వంలో పార్టీ కేంద్ర కమిటీ పని చేస్తుంది. ఈ కేంద్ర కమిటీతో పాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ ను  ఏర్పాటు చేశారు. ఇందులో అనేక ప్రజాపయోగ కౌన్సిల్స్, కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించారు. తొలుత ఆడపడుచులతో కమిటీలు ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావించిన పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ప్రస్తుతం ప్రకటిస్తున్న కమిటీలకు స్వయంగా రూపకల్పన చేస్తూ వస్తున్నారు. ఈ కమిటీలలో స్థానం దక్కించున్న ప్రతి ఒక్కరు ఆయనకు సుపరిచితులే. వారి శక్తి సామర్ధ్యాలపై ఆయనకు పూర్తి అవగాహన వుంది. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీకి వీరంతా సేవలందిస్తున్నారు. అధ్యక్షుడు పాల్గొన్న సమావేశాలు, కార్యక్రమాలలో వీరు పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరి సమాచారం పవన్ కళ్యాణ్ కంప్యూటర్లో నిక్షిప్తమై వుంది. ప్రస్తుతం పదవులు పొందినవారంతా నవ వయస్కులు, విద్యాధికులు..డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐ.టి.నిపుణులతోపాటు గృహిణిలు కూడా వీరిలో వున్నారు. కెరీర్ ను వదులుకుని ప్రజా సేవ కోసం వచ్చిన ఆడపడుచులు ఎందరో వీరిలో వున్నారు. ఇది తొలి జాబితా మాత్రమే.

మరి కొందరు మహిళ సీనియర్ నాయకులకు వారి అనుభవం, సామర్థ్యాన్ని బట్టి ఏ కమిటీలో ఎటువంటి పదవి ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వారికి కూడా మలి జాబితాలో సముచిత స్థానాలు లభిస్తాయి. మహిళలతో ఉన్న కమిటీల తొలి జాబితాకు రూపకల్పన చేయడం తనకు ఆనందాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కమిటీలలో వున్నవారు ఎంతో ప్రభావశీలురని కొన్ని ఉదాహరణలను చెప్పారు. విమెన్ వింగ్ (వీరమహిళ ) కు ఛైర్మెన్ గా నియమించిన కర్నూలుకు చెందిన జవ్వాజి  రేఖ (25 – గౌడ) ఆడిటర్ గా పని చేస్తూ పార్టీకి విలువయిన సేవలందిస్తున్నారు. కార్యాకర్తల కోసం ఆర్ధరాత్రి సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి కూడా వెనుకాడరు. వైస్ చైర్మన్లుగా భీమవరానికి చెందిన  సింధూరి కవిత (25 -క్షత్రియ ), షేక్ జరీనా (28 – ముస్లిం-నరసరావుపేట) , నూతాటి ప్రియా సౌజన్య ( 30 -కాపు- రాజమండ్రి) , జి.శ్రీవాణి ( 47 -ఓసీ-హైదరాబాద్ ) నియమితులయ్యారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకు రావడానికి వీరు  నిత్యం శ్రమిస్తూనే వుంటారు.

వీర మహిళ విభాగంతో పాటు వివిధ కమిటిల్లో మహిళలకు స్ధానం కల్సించారు ఆ వివరాలు ఇవి…

వీర మహిళ చైర్మన్ గా ఆడిటర్ (సి.ఎ. ఫైనల్ విద్యార్ధిని)

జనసేన పార్టీ మహిళా విభాగం ‘వీర మహిళ’కు చైర్మన్, వైస్ చైర్మన్ లను నియమించారు. విద్యావంతులు, యువతులు, సామాజిక దృక్పథం, వర్తమాన విషయాలు, సమస్యలపై అవగాహనతోపాటు వాటికి పరిష్కారాలు చూపగలిగే అనుభవం ఉన్న వారిని ఈ విభాగంలోకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు.

రేఖ జవ్వాజి గారు (వీర మహిళ చైర్మన్)

వీర మహిళ చైర్మన్ గా రేఖ జవ్వాజిని నియమించారు. కర్నూలుకు చెందిన రేఖ ఆడిటర్ (సి.ఎ. ఫైనల్ విధ్యార్ధిని). గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. 25 సంవత్సరాల ఆమె జనసేన సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్తూ, విజన్ మ్యానిఫెస్టో అంశాలను ప్రజలకు తెలియచేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన రేఖ స్త్రీల సమస్యలపైనా, వర్తమాన రాజకీయ అంశాలపైనా స్పందిస్తారు. నవతరం ప్రతినిధి అయినా ఆమెకు వీర మహిళ విభాగం బాధ్యతలు అప్పగించారు.

* నలుగురు వైస్ చైర్మన్లు

భీమవరం పట్టణానికి చెందిన కనుమూరి కవిత సింధూరి, నరసరావుపేటకు చెందిన షేక్ జరీనా, రాజమండ్రికి చెందిన ప్రియా సౌజన్య నూతాటి, హైదరాబాద్ కు చెందిన జి.శ్రీవాణి నియమితులయ్యారు.

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కవిత సింధూరి భీమవరం ప్రాంతంలో పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రజలను చైతన్యపరచేలా మాట్లాడే నైపుణ్యం ఉంది. షేక్ జరీనా రాజకీయ అంశాలపై బలంగా స్పందిస్తారు. జనసేన తరంగం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రియా సౌజన్య తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, సామాజిక మాద్యమాల ద్వారా పార్టీ సిద్దాంతాలు, అధ్యక్షుల వారి ఆలోచనల్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. జి.శ్రీవాణి మానవ హక్కుల కార్యకర్తగా ఉన్నారు. గతంలో తల్లి తెలంగాణకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

* పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా వీరమహిళ విభాగం కన్వీనర్లను, కో కన్వీనర్లను, కో ఆర్డినేటర్లను నియమించారు. తిరుపతి పార్లమెంటరీ వీరమహిళ విభాగం కన్వీనర్ గా ఆకేపాటి వెంకట సుభాషిణిని, ఏలూరు పార్లమెంటరీ కన్వీనర్ గా కోట మేరీ సుజాతని, రాజమండ్రి పార్లమెంటరీ వీరమహిళ కో-కన్వీనర్లుగా సాయి రమణి కళ్యాణి పాలేపుని, యండం ఇందిర, సుంకర మాధవి, పాటంశెట్టి కాశీరాణి, నెల్లూరు పార్లమెంటరీ కన్వీనర్ గా ఇందిర పోలిరెడ్డి, కో కన్వీనర్ గా  నాగరత్నం గుండ్లూరు, రోజా రాణి, బాపట్ల పార్లమెంటరీ కో కన్వీనర్లు గా లక్ష్మి కళ గోపాలం, కొండవీటి హర్షిత, సికింద్రాబాద్ పార్లమెంటరీ కో కన్వీనర్ గా మండపాక కావ్య, ఏలూరు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా రమాదేవి అర్జా, మచిలీపట్టణం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా మక్కి విజయకుమారి, ఒంగోలు పార్లమెంటరీ కో కన్వీనర్ గా కోసూరి శిరీష, నరసాపురం కో కన్వీనర్ గా శిరిగినీడి సాయి రవళి, రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్డినేటర్లుగా కందికట్ల అరుణకుమారి, తాకాసి దుర్గ, రాజంపేట పార్లమెంటరీ కో కన్వీనర్ గా నాగలక్ష్మి మొలక, కో ఆర్డినేటర్ గా షేక్ హలీమాబీ, నరసాపురం పార్లమెంటరీ కో కన్వీనర్ గా పుష్ప నళిని పోలిశెట్టి, గుంటూరు పార్లమెంటరీ కన్వీనర్ గా రావి రమ, కో కన్వీనర్ గా భారతి చందు, విశాఖపట్నం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా సింగంశెట్టి దేవి, కడప పార్లమెంటరీ కన్వీనర్ గా జయప్రద రెడ్డి, కో కన్వీనర్ గా కలిశెట్టి విజయ గారిని,  అనంతపురం పార్లమెంటరీ కో కన్వీనర్లుగా టి.ఎస్.లలిత, రాజు లహరి, కాకినాడ పార్లమెంటరీ కో కన్వీనర్ గా వెంకట లక్షి పెంకే, చిత్తూరు పార్లమెంటరీ కో కన్వీనర్ గా కె.పుష్పావతి, కో ఆర్డినేటర్ గా జి.పద్మావతి, హిందూపూర్ పార్లమెంటరీ కన్వీనర్ గా కానంపల్లి అనురాధ, విజయవాడ కో ఆర్డినేటర్లు గా దోసపాటి శశికళ, షేక్ షహీన, దాసరి భవాని లను నియమించారు.

పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుజాత పాండా

జనసేన రాజకీయ వ్యవహార కమిటీలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సుజాత పాండా స్థానం కల్పించారు. జనసేన పార్టీలో చురుగ్గా ఉన్న వీరు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ జిల్లా జాయింట్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. సుజాత పాండా ని పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకున్నారు.

పాలసీ వింగ్ చైర్మన్ గా డాక్టర్ యామిని జ్యోత్స్నాకంబాల

జనసేన పార్టీ రూపొందించే పబ్లిక్ పాలసీలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సమాజానికి ఉపయుక్తమయ్యే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యకలాపాల రూపకల్పన, వాటిని అమలు చేయాల్సిన ప్రక్రియల గురించి ఈ విభాగం చూస్తుంది. జనసేన పార్టీ పాలసీ వింగ్ చైర్మన్ గా డాక్టర్ యామిని జ్యోత్స్నా కంబాల ని నియమించారు. ఎస్సీ – మాల కులానికి చెందిన వీరు ఉన్నత విద్యావంతురాలు. పొలిటికల్ సైన్స్ లో పీహెచ్.డి. చేసిన యామిని జ్యోత్స్నా ప్రస్తుతం రాజమండ్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. డ్వాక్రా మహిళల స్థితిగతులు, సంఘాల నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, రైతుల పరిస్థితి లాంటి వర్తమాన సమస్యలపై సాధికారత ఉంది. జనసేన పోరాట యాత్ర సమయంలో ఈ అంశాలపై యామిని జ్యోత్స్నా ఇచ్చిన ప్రెజెంటేషన్ ను జనసేనాని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్టీ పాలసీ వింగ్ బాధ్యతలు అప్పగించారు.

పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లోనూ మహిళలకు స్థానం

పార్లమెంటరీ నియాజకవర్గాల వారీగా నియమిస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో మహిళలకు స్థానం కల్పిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో సభ్యులుగా నియమితులైన వారి వివరాలు…

నరసాపురం పార్లమెంట్ : లక్ష్మి గవర, రాజమండ్రి పార్లమెంట్ : మన్యం సెంథిల్ కుమారి, నంద్యాల లక్ష్మి, ఇందిర యండం, నామాల శ్రీవెంకట పద్మావతి, ఒంగోలు పార్లమెంట్: కావ్యశ్రీ బైరపునేని, ఎర్రంశెట్టి రాజ్యలక్ష్మి, ఓగిరాల వెంకట గిరిజనీలిమ, విజయనగరం పార్లమెంట్: ముదిలి సర్వమంగళ, అమలాపురం పార్లమెంట్: చోడిశెట్టి పద్మలీల, అనకాపల్లి పార్లమెంట్: నారపురెడ్డి పద్మావతి, వంగలి లక్ష్మి, అరకు పార్లమెంట్: బొనెల్ గోవిందమ్మ, గోడలి పావని, నెల్లూరు పార్లమెంట్: హేమలత

పార్లమెంటరీ వర్కింగ్ కమిటీలు వనితలు

షాహిన్ సయ్యద్ (విజయవాడ), షేక్ రజియా (విజయవాడ), మంజుల సునీత (విజయవాడ), సావిత్రి (నెల్లూరు), వాశిలి తుషార బిందు (కడప)

క్యాంపైనింగ్  అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ గా ఉషశ్రీ పెద్దిశెట్టి (బ్యాడ్మెంటన్ క్రీడాకారిణి)

జనసేన పార్టీ క్యాంపెయినింగ్ అండ్ పబ్లిసిటీ విభాగం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తరుణంలో పార్టీ ప్రచార విభాగంలో వీరు కీలక భూమిక పోషిస్తారు. ఈ విభాగానికి బ్యాడ్మెంటన్ క్రీడాకారిణి, విద్యావంతురాలు ఉషశ్రీ పెద్దిశెట్టి ని నియమించారు. విశాఖపట్నానికి చెందిన ఉషశ్రీ బ్యాడ్మెంటన్ క్రీడలో ఎన్నో విజయాలు సాధించారు. ఎం.బి.ఏ. చదివిన వీరికి పార్టీ ప్రచార బాధ్యతలు  అప్పగించారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా విశాఖకు చెందిన సుధా మంథా, దుర్గ అమరారపు, గుంటూరుకు చెందిన పద్మావతి కొల్లా, కో ఆర్డినేటర్ గా లక్ష్మీరత్న మోహన మంచాల (నరసాపురం)లను నియమించారు. ఈ విభాగం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా షేక్ హసీనా (విశాఖపట్నం), భాగ్యలక్ష్మి (మల్కాజ్ గిరి)లను, కో ఆర్డినేటర్ గా పద్మావతి కొల్లా (గుంటూరు) ఎంపిక చేశారు. ఈ విభాగం పార్లమెంట్ నియాజకవర్గాల వారీగా కో కన్వీనర్లుగా అనితా దారం (రాజంపేట), ఈ.హేమలత (చిత్తూరు),  పార్వతి బోణి (గుంటూరు)లను నియమించారు. కో ఆర్డినేటర్లుగా రాణి కందికట్ల (కాకినాడ), కృష్ణ ప్రియ పేపకాయల (కాకినాడ), చిక్కం సుధా (అమలాపురం), పల్లవి రమ్య ర్యాలీ (అమలాపురం), మార్తా మెండు (ఖమ్మం), అనంతస్వాతి సంగన (బాపట్ల), సాయి దుర్గ రమ్య సోమిశెట్టి (ఒంగోలు)లను నియమించారు. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియాజకవర్గం కో కన్వీనర్ గా విజయలక్ష్మి మున్నంగిని నియమించారు.

పార్టీ ఐడియాలజీ వింగ్

జనసేన పార్టీ ఏడు బలమైన సిద్దాంతాలతో ముందుకు వెళ్తోంది. సిద్దాంత బలం ఉన్న ఏకైక పార్టీ జనసేన. ఈ సిద్దాంతాల ప్రాధాన్యం, వాటి విలువ, సమాజానికి వాటి అవసరం  తెలియచెప్పడంతోపాటు.. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కీలక విధులు ఈ విభాగంపై ఉన్నాయి. గడప గడపకి పార్టీ ఐడియాలజీని చేర్చడంలో మహిళలు కీలకంగా ఉంటారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావించారు. ఈ విభాగంలో సభ్యులుగా నియమితులైన వీర మహిళల వివరాలు.. సుధేష్ణ వల్లూరి (కాకినాడ), రమ్య కవిత పోతరాజు (మచిలీపట్నం), జవ్వాది విష్ణు ప్రియాంక (శ్రీకాకుళం), వెంకట సృజనప్రియ ఎర్రపోతు (చేవెళ్ల), కె.లక్ష్మీప్రియ (తిరుపతి), భార్గవి పూసల (మచిలీపట్నం), తేజస్వి జవ్వాది (రాజమండ్రి), మావిళ్ల జ్యోతి (రైల్వే కోడూరు)

సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా రజిత

జనసేన పార్టీ సిద్దాంతాలు, మ్యానిఫెస్టో, విధి విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో సోషల్ మీడియా విభాగం ఏర్పాటైంది. ఈ వింగ్ కి కో ఆర్డినేటర్ గా నరసాపురం మండలం సరిపల్లెకు చెందిన రజిత ని నియమించారు. ఎం.సి.ఎ. చదివి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న 29 సంవత్సరాల రజితకి ఈ బాధ్యతలు అప్పగించారు.

ఎలక్షనీరింగ్ బాధ్యతల్లో భాగస్వామ్యం

ఎన్నికల సమయంలో అనుసరించే వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పనలో మహిళలకి భాగస్వామ్యం కల్పించారు. ఎలక్షనీరింగ్ విభాగానికి వైస్ చైర్మన్ గా విజయనగరం పట్టణానికి చెందిన లోకం వర్షిణి ని నియమించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన 25 సంవత్సరాల వర్షిణి బి.టెక్ పూర్తి చేసి పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో చురుగ్గా ఉన్నారు. జనసేన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎలక్షనీరింగ్ వైస్ చైర్మన్ బాద్యతలతో పాటు పార్టీ స్పోక్స్ పర్సన్ గాను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా తుమ్మి లక్ష్మీరాజ్ (యాదవ సామాజిక వర్గం, బిఎ, ఎల్.ఎల్.బి., విజయనగరం), హారిక కొల్లివలస (కొప్పుల వెలమ, రాజముండ్రి), మాకినేని నీరజ (బికాం, విజయవాడ), లావణ్య కొఠారి (బి.టెక్., మచిలీపట్నం)లను నియమించారు. కో కన్వీనర్ గా సామ్రాజ్యం పుట్టి (కమ్మ, గుంటూరు)ని ఎంపిక చేశారు.

పబ్లిక్ హెల్త్ బాడీ

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోరాటయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం ఆసుపత్రులు సరిగా లేకపోవడం… పల్లెలకు కనీస వైద్యం అందించలేని స్థితిలో పాలకులు ఉండటం గమనించారు. ఏ గ్రామానికి వెళ్లినా మా ఊరికి డాక్టర్లనీ, మందులనీ ఇప్పించండి అని ప్రజలు కోరారు. వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా వారికి అవసరమైన కనీస వసతులు, సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదు. ఈ పరిస్థితుల నేపధ్యంలో జనసేన పార్టీలో పబ్లిక్ హెల్త్ బాడీని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ బాడీలో అమలాపురం పట్టణానికి చెందిన కొప్పుల నాగ మానసకు స్థానం కల్పించారు. ఈమె ఉన్నత విద్యావంతురాలు, బిపిటి పూర్తి చేసిన తరవాత ఎంబీఏ (హాస్పిటల్ మేనేజ్మెంట్), ఎమ్మెస్సీ పూర్తి చేశారు. పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా లక్ష్మి కుమారి

అన్నం పెట్టే రైతన్నకు భరోసాగా నిలిచేందుకు జనసేన పార్టీ జై కిసాన్ వింగ్ ఏర్పాటు చేసింది. ఈ విభాగం ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాధ్యతలను చింతల లక్ష్మి కుమారి కి అప్పగిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. వీరు కృష్ణాజిల్లా మైలవరానికి చెందినవారు.

పార్టీ క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ గా పద్మావతి

జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి వైస్ చైర్మన్ గా పద్మావతి పసుపులేటిని నియమించారు. అనంతపురం నగరానికి చెందిన వీరు పలు సామాజిక కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమాల్లో భాగంగా ఎన్నో ఇబ్బందులుపడ్డా ముందుకే వెళ్లారు. ప్రస్తుతం పార్టీ జిల్లా స్పోక్స్ పర్సన్ ఉన్నారు.

ప్రొటొకాల్స్ కమిటీ

జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అనుసరించే పద్దతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రొటొకాల్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కో ఆర్డినేటర్లుగా నియమితులైన మహిళల వివరాలు…

లిఖిత తాడికొండ (బి.టెక్, మల్కాజ్ గిరి), శివరాణి గన్నవరపు (బిసి-డి, గుంటూరు), శివపార్వతి.కె. (ఎమ్మెస్సీ, బి.ఈడీ; గుంటూరు), శ్రీదేవి మొఖమాతం (ఎం.సి.ఎ., గుంటూరు)

* ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం స్పోక్స్ పర్సన్ గా వాణిశ్రీ కావూరి ని నియమించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాణిశ్రీ ఎం.ఎ. పూర్తి చేసి ఏలూరులో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.

పార్టీ నిర్వహణ బాధ్యతల్లో యువతులు

జనసేన పార్టీకి సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల్లో విద్యావంతులైన యువతులకు స్థానం కల్పించారు. హైదరాబాద్ కు చెందిన లక్ష్మీసాయి శిరీష పొన్నూరు, పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురికి చెందిన జయ కళ్యాణి కూరెళ్ల పార్టీ అడ్మినిస్ట్రేషన్ కి ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నియమితులయ్యారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 24 సంవత్సరాల లక్ష్మి సాయి శిరీష బిబిఎ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్.ఎల్.బి. చదువుతున్నారు. వీరికి పార్టీ స్పోక్స్ పర్సన్ బాధ్యతలు కూడా అప్పగించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన 29 ఏళ్ళ జయ కళ్యాణి బి.టెక్ పూర్తి చేశారు.

సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీ (మహిళ విభాగం)

మహిళల సమస్యలు పార్టీ దృష్టికి తీసుకువచ్చేందుకు, క్షేత్ర స్థాయి నుంచి ఎవరైనా పార్టీ అలాంటి సమస్యలు తెలపాలన్నా ఒక వేదిక అవసరం. అందుకే మహిళా విభాగంలో సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ విభాగం సభ్యులు గా శ్యామల దేవి పోతుల (విశాఖపట్నం), రత్నమాల వడ్డి (విశాఖపట్నం), విజయలక్ష్మి (నెల్లూరు), పద్మ బాడిత శైలజ (విజయవాడ), ధనలక్ష్మి బొమ్మవరం (నెల్లూరు) నియమితులయ్యారు.

కమ్యూనిటీ అండ్ సోషల్ జస్టిస్

సామాజిక న్యాయం అందించడం, కమ్యూనిటీపరంగా ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేయడం జనసేన ముఖ్య బాధ్యతల్లో ఒకటి. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ దృష్టికి తెచ్చి, వాటిని ఏ విధంగా శాశ్వతంగా పరిష్కరించాలో ఈ విభాగం చూస్తుంది. ఇందుకోసం పార్టీపరంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కాకినాడకు చెందిన జానీ బేగం (ఇరంఖాన్)ను ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమించారు. వీరు కాకినాడలో కార్పొరేట్ రిలేషన్ మేనేజర్ గా పని చేస్తున్నారు.

లాజిస్టిక్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ

జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను ఈ కమిటీ చూస్తుంది. ఈ కమిటీకి వైస్ చైర్మన్ గా స్వరూప దేవి గంటా ని నియమించారు. రాజమండ్రికి చెందిన వీరు ఎం.ఏ. చదివారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా కె.సాయి తేజస్వి (బిసి-డి, ఏలూరు), సౌజన్య రావి (కమ్మ, విజయవాడ), కె.పద్మ (ఎస్టీ, అరకు)

కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్ రైట్స్ విభాగం వైస్ చైర్మన్ గా కవిత

ప్రతి పౌరుడికీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడటంతోపాటు రాజ్యాంగబద్దంగా మన సమాజానికి దక్కాల్సినవాటి గురించి ఎప్పటికప్పుడు పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలను ఈ విభాగం చూస్తుంది. ఈ విభాగానికి వైస్ చైర్మన్ గా  చిత్తూరుకు చెందిన కవిత నియమితులయ్యారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన వీరు ఎం.ఏ., ఎల్.ఎల్.బి. చదివారు. చిత్తూరులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ లా, పౌర హక్కులపై సాధికారత కలిగినవారు. గతంలో టిడిపి జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. పవన్ కళ్యాణ్ లోని సామాజిక స్పృహ, జనసేన సిద్దాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్.రత్న కుమారి (డిగ్రీ, చీరాల), గౌడ సామాజిక వర్గానికి చెందిన గూడూరి సౌజన్య (ఎం.టెక్, దెందులూరు), కో ఆర్డినేటర్లు గా  ఎ.సరణి దేవి (విశాఖపట్నం), బి.లక్ష్మి సమంత (కాపు, ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి, మల్కాజ్ గిరి) నియమితులయ్యారు.

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల పర్యవేక్షణ కమిటీ

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పరమావధి కావాలి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో నిరంతరం పర్యవేక్షించేందుకు జనసేన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి వైస్ చైర్మన్ గా ఎస్టీ యువతి దువ్వెలా సృజన ని నియమించారు. జంగారెడ్డి గూడెంలో ఉంటున్న సృజన కి క్షేత్ర స్థాయిలో ప్రజలు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలవారు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ పోలవరం నిర్వాసితులతో సమావేశమైన సందర్భంలో సృజన గారు అక్కడి సమస్యలను తెలియచెప్పడంతోపాటు, ప్రభుత్వ పథకాల అమలు ఎంత లోపభూయిష్టంగా ఉందో వెల్లడించారు. ఈ కమిటీకి ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎస్సీ మహిళ త్రివేణి కాంతపల్లి నియమితులయ్యారు. వీరు విశాఖపట్నం సీతమ్మధారకు చెందినవారు. కో ఆర్డినేటర్లుగా శ్రీదేవి మొఖమాతం (ఓసీ, గుంటూరు), శివపార్వతి కె. (కాపు, ఎమ్మెసీ, బి.ఈడీ, గుంటూరు).

పబ్లిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా నందిగం రాణి

విద్యా విధానంలో ఉన్న లోపాల మూలంగా విద్యార్థులు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. డ్రాపవుట్స్ శాతం గణనీయంగా తగ్గించలేని పరిస్థితి నెలకొంది. ప్రయివేట్ పాఠశాలల నిర్వహణలోనూ ఎన్నో సమస్యలు. ఇన్ని సమస్యల నడుమ చదువుల సరస్వతి భావి తరాలను ఏ విధంగా దీవిస్తుంది. సరస్వతి నిలయాలను ఎంత సమర్థంగా నిర్వహించాలి, విద్యా సంస్కరణలు ఎలా అమలు చేయాలో వీటికి సంబంధించి జనసేన పార్టీలో  పబ్లిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనే విభాగం ఏర్పాటైంది.

ఈ కౌన్సిల్ చైర్మన్ గా నందిగం రాణి ని నియమించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాణి ఎం.కామ్, బి.ఈడీ చదివారు. ఏలూరుకు చెందిన వీరికి విద్యా విధానంపై అవగాహన ఉంది. ఏలూరులో విద్యా విధానంపై జనసేన నిర్వహించిన సదస్సులో రాణి పలు సూచనలు చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా ముమ్మిడి భాగ్యలక్ష్మి (హిందీ పండిట్, రాజమండ్రి), కో ఆర్డినేటర్ గా తులసి కుమారి గుంటపల్లి నియమితులయ్యారు. తులసి కుమారి మండల విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు.

సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ లో చెరుకుపల్లి శ్రావణి

జనసేన పార్టీలోని సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ లో సభ్యురాలిగా శ్రావణి చెరుకుపల్లి (వైశ్య సామాజిక వర్గం) ని నియమించారు. ఎం.టెక్ చదివిన వీరు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. పార్టీ స్పోక్స్ పర్సన్ బాధ్యతలు వీరికి అప్పగించారు.

Other Articles

12 Comments

 1. Even if you’re having poor credit score scores resembling CCJs,
  IVA, default or arrears, it is feasible so that you can avail such mortgage with none trouble.

  money loans is totally free from credit verification process.
  Furthermore, you may avail such mortgage with out pledging
  of collateral too.

 2. For the Mediterranean particularly the European Aquaculture Innovation and Expertise
  platform (EATiP) has forecast that doubling present production would add in financial phrases an ex-farm value of two.7 billion euros and a complete value
  of 8 billion euros in the market.

 3. The only factor that people complain about it a bit of is their protection area which is not as wide as FTD or 1-800-Flowers’s protection areas (additionally they do not have a world delivery), their
  web site can be exhausting to navigate especially for brand spanking new users, except that
  everything is perfect!!!.

 4. As a result of for the amount of pain she has put her brother and
  her mother by means of, she will take no matter guilt or regret she might feel (if she feels something at all – that’s debatable) and do her personal
  funeral.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *