కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి: పవన్ కళ్యాణ్

October 7, 2019 | News Of 9

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కేసుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పంధించారు. ‘‘నాడు వనజాక్షి, నేడు సరళ ఇద్దరూ ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగులలే… బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నవారే. అయినా వీరు ప్రజా ప్రతినిధుల దాష్టీకానికి గురికాక తప్పలేదు. విధి నిర్శహణలో ఉన్న మహిలా ఉద్యోగులపైనే ఇలా తెగబడి దాడులు చేస్తుంటే ఇక సగటు మహిళలకు భద్రత ఎక్కడుంటుంది? ఆనాడు కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై విధి నిర్వహణలో ఉండగా అనేక క్రిమినల్ కేసులున్న నాటి దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలసి చేసిన దాడి.. నేడు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎంపీడీఓ సరళపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేయడం ఒకే తీరులో ఉన్నాయి. ఈ దాడిని వైఎస్సార్ పార్టీ ఎందుకు ఖండించడం లేదు? శ్రీధర్ రెడ్డిపై తీవ్రమైన చర్యలకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఎంపీడీఓ సరళ పెట్టిన క్రిమినల్ కేసును నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్సార్ పార్టీ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని అందజేస్తోంది. మా శాసనసభ్యులు దాడి చేస్తారు. మీరు భరించండి అనా? ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే చట్టానికి విలువ ఎక్కడ నుంచి వస్తుంది? ప్రతిపక్ష పార్టీల వారు ప్రజాశ్రేయస్సు కోరి సమస్యలపై రోడ్డెక్కి నిరసన గళం విప్పితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు, ఒక్కోసారి 307 వంటి హత్యాయత్నం కేసులు కట్టి అరెస్టులు చేస్తుండగా, ఒక మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన శాసనసభ్యుడు కోటంరెడ్డిపై బెయిల్ సులువుగా ఇచ్చే 448, 427, 506, 290 వంటి నమోదు చేసి ఈ కేసును పోలీసుల ద్వారా ప్రభుత్వం నీరుగార్చేసింది. ఈ సెక్షన్ల కింద నమోదయ్యే కేసులలో స్వల్ప జరిమానా, లేదా నామమాత్రపు శిక్ష విధిస్తారంతే. నిజానికి ప్రభుత్వ అధికారి మీద దాడి చేసిన వారిపై 353, 354 సెక్షన్ల కింద బెయిల్ ఇవ్వడానికి వీలు లేని కేసు పెట్టాలి. ఆ పని పోలీసులు విస్మరించారు. దీనికి ప్రభుత్వ ఒత్తిడి కారణమని జనసేన భావిస్తోంది.
ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత జగన్ రెడ్డి ప్రభుత్వంపై వుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ కోరుతోంది.’’ అంటూ సోమవారం నాడు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *