ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరం : పవన్ కళ్యాణ్

October 7, 2019 | News Of 9

తెలంగాణలో జరుగుతున్నా ఆర్టీసీ సమ్మెపై జనసేన పార్టీ అధినేత ప్రెస్ నోట్ ద్వారా తన స్పందన తెలియజేశారు. ‘‘తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని జనసేన పార్టీ అభిప్రాయపడుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్ టీ సీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉంది. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్నప్తి చేస్తున్నాను. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశాం. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్ టీ సీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుని కోరుతున్నాను’’

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *