గంగమ్మతల్లి ఆశీస్సులతో నేనే సీఎం: పవన్ కళ్యాణ్

April 9, 2019 | News Of 9

  • ప్రభుత్వం వస్తోందంటూ జన సైనికులకు భరోసా
  • చంద్రబాబు అందరితో ఓట్లు వేయించుకుంటారు
  • కానీ కొందరికోసమే పని చేస్తారు
  • జగన్ తిరుమలకు చెప్పులతో వెళతాడు
  • రాజకీయాల్లోకి కొత్తతరాన్ని తెస్తున్నా…
  • జనసేన గెలుపు అనివార్యం
  • నాకు అందరూ సమానమే
  • అన్ని కులాలకూ రాజకీయ గుర్తింపు
  • విజయవంతంగా నర్సాపురం సభ

(న్యూస్ ఆఫ్ 9)

అందరి చేతా ఓట్లు వేయించుకుని… చంద్రబాబు కేవలం టీడీపీ వాళ్లకే పని చేస్తారని, అలాగే జగన్ బుగ్గలు నిమురుతారనీ, తలపై చేతులు పెడతారని కానీ ఆయనకు ఎవరిపట్లా గౌరవం లేదని ఆఖరికి చట్టసభలకు వెళ్లకపోవడం ద్వారా అంబేద్కర్ పైన కూడా గౌరవంలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… జగన్ కు సంస్కృతిపైనా గౌరవంలేదని తిరుమలకు చెప్పులు వేసుకుని వెళ్లిపోతారని ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా కాగలరని అన్నారు. తనకు అన్ని కులాలూ సమానమేనని, అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యి తీరుతాడు అంటూ బలంగా చెప్పారు. కానీ చంద్రబాబు, జగన్ లు వాళ్ల ఇళ్లలోనే రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నారని, పాలకొల్లులోనో, నరసాపురంలోనో రాజకీయాలు ఉండటం వారికి ఇష్టంలేదని అన్నారు. అన్నికులాలకూ రాజకీయ పరమైన గుర్తింపు తెస్తానని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. రాజకీయాల్లోలకి కొత్త వారిని జనసేన తెస్తుందని, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషను ఇవ్వాలన్నా జనసేన గెలవాలని అన్నారు.

పల్లకీలు మోసీ మోసీ అలసిపోయామని అన్నారు. తోట త్రిమూర్తులు, కురలసా కన్నబాబు, సునీల్ వంటివారు పల్లకీలు మోయడానికే ఉన్నారని అన్నారు. జన సైనికులు బహుకరించిన నాగలి చూపిస్తూ.. ఇది బలరాముడి ఆయుధం అనీ, అధర్మం అనే నేలను దీనితో దున్నేసి ధర్మాన్ని స్థాపిస్తామని అన్నారు. 2009 తర్వాత ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఒకడు వచ్చాడు… ధర్మంగా నిలబడ్డాడు అని చెబుతూ… జనసేనను గెలిపించాలని, ఆలోచించి ఓటు వేయాలని విన్నవించారు.

జనసేన పథకాల గురించి ప్రజలకు వివరించారు. మా ఇంటి మహాలక్ష్మీ పథకం కింద పదో తరగతి పూర్తయి పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ. లక్ష, చీర సారె కింద మరో వెయ్యి నూట పదహార్లు, ఆటో డ్రవర్లకు రూ.50 వేల సాయం, ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా ఉన్నవారికి రూ.50 వేలు ఆర్ధికసాయం, లక్ష మంది యువ రైతులతో సాంకేతిక విధానంలో వ్యవసాయం, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో పని చేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, మత్స్యాకారులకు కోస్తా తీర గస్తీ కోసం 20 వేల మంది పోలీసు ఉద్యోగాలు, నర్సాపురం-సఖినేటి పల్లి వంతెన సత్వర నిర్మాణం, ముంపునకు గురవుతున్న లంక గ్రామాలకు రక్షణ విధానం, ఉభయ గోదావరి జిల్లాల్లో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ యార్డు నిర్మాణం వంటి సంక్షేమ, అభివృద్ధి చర్యలను తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నాగబాబును నర్సాపురం ఎంపీగా గెలిపించాలని కోరారు. అలాగే జనసేన అసెంబ్లీ అభ్యర్ధులను కూడా గెలిపించాలని విన్నవించారు.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *