తానా సభలకు పవన్ కళ్యాణ్..

July 5, 2019 | News Of 9

వాషింగ్ టన్ డీసీలో జూలై 4,5,6 తేదీలలో అట్టహాసంగా జరగనున్న 22వ తానా మహాసభలకు హాజరు కావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పయనమయ్యారు. 6వ తేదీన సమకాలీన భారత రాజకీయ వ్యవస్థలో తీసుకురావలసిన మార్పులపై తానా వేదికగా ఆయన ప్రసంగిస్తారు. ఆయనే కాదు సినీ రాజకీయ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు అమెరికా చేరుకున్నారు. వాల్టర్ ఇ వాషింగ్ టన్ కన్వెన్షన్ సెంటర్ వేధికగా ఈ మాహాసభలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సభలకు హాజరవుతున్న తెలుగు ప్రముఖులతో వాషింగ్ డీసీ సందడిగా మారింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితర రాజకీయ ప్రముఖులు, ఆద్యాత్మిక గురువు స్వామీ పరిపూర్ణానంద సాహితీ రంగ ప్రముఖులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, జోన్నవిత్తుల, సూర్యదేవర రామ్మోహన్ రావ్, సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సినిమా రంగం నుండి.. దర్శకులు కె. రాఘవేంద్ర రావు, కొరటాల శివ, నిర్మాత అశ్వనీదత్, సంగీత దర్శకులు కీరవాణి, నటులు జగపతిబాబు, సుమన్, బ్రహ్మానందం, సునీల్, అల్లరి నరేష్ తదితరులు, నటి కమలినీ ముఖర్జీ, సింగర్స్ సునీత, కౌసల్య, సింహా, హేమచంద్ర తదితరులు యాంకర్స్ సుమ, అనసూయ లతో పాటు పలువురు జబర్దస్త్ నటులు హజరై సభలోని ప్రేక్షకులను అలరించనున్నారు.

అయితే పవన్ తానా సభలకు హాజరు కావడంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. తానా టీడీపీ అనుబంధ సంస్థ గనుక అక్కడికి వెళ్లడం వల్ల జనసేన టీడీపీతో ఇప్పటికీ కలిసే ఉందన్న ప్రత్యర్ధుల వాదనలకు బలం ఇచ్చనట్లవుతుందని కొందరు విమర్శించారు.. కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఈ సభలకు హాజరు కావడం ఆహ్వానించదగ్గ విషయమనీ, పైగా ఆయన వెళ్తోంది సమకాలీన రాజకీయాలపై మాట్లాడడానికే గనుక తప్పుపట్టడానికి లేదన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి పుట్టిన జనసేన విధానమిదేనంటూ విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆరో తేదీన పవన్ ప్రసంగాన్ని వినడానికి మాత్రం ఆయన అభిమానులు, జనసైనికులు ఆసక్తితో ఎదురు చూస్తారనేది మాత్రం పక్కా..

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *