అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్

December 3, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

  • రూ.2 లక్షల చొప్పున పరిహారం

అనంతపురం: అనంతపురం కవాతుకు హాజరై తిరిగి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పార్టీ కార్యకర్తలకు సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికీ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను పార్టీ భరిస్తుందని తెలిపారు. తాను ఎప్పుడూ ఇలాంటివి జరుగుతాయని భయపడే.. జాగ్రత్తలు చెబుతుంటానని అన్నారు. ‘‘నేను వచ్చిందే మీ భవిష్యత్తు కోసం.. నిండు నూరేళ్లూ జీవించాల్సిన వాళ్లు ఇలా అయిపోవడం బాధిస్తోంది. ఇకనైనా అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని పవన్ హితవు పలికారు. అనంతపురం కవాతును విజయవంతం చేసిన అందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. 

బలితీసుకున్న బస్సు

కవాతు నుంచి తిరిగొస్తున్న నలుగురు జనసేన కార్యకర్తలు కారులో ఇళ్లకు బయల్దేరారు. డోన్ సమీపంలో వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు వచ్చి వీళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. నలుగురూ అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కార్యకర్తలది కర్నూజిల్లాలోని గోవర్ధనగిరి గ్రామం కాగా, ఒకరిది అదే జిల్లాకు చెందిన ధర్మవరం గ్రామం. నలుగరు కార్యకర్తలు చనిపోవడంపై జనసేన కార్యకర్తల్లో విషాదం అలముకున్నది. చనిపోయిన కార్యకర్తల ఆత్మకు  శాంతి కలగాలని కోరుకుంటూ అనేక మంది సోషల్ మీడియాలో సంతాప సందేశాలు ఉంచారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *