తెరాసకి రైట్ రైట్… పవన్ పరోక్ష సందేశం

December 5, 2018 | News Of 9

Pawan suggests indirectly vote for TRS | Newsof9

తెలంగాణలో ఒకవైపు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రజా కూటమిగా ఏర్పడి తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తుంటే, మరోవైపు తెరాస ఒంటరిగా బరిలోకి దిగింది. 7వ తేదీనే ఎన్నికలు. ఈ సమరంలో తెలంగాణలో ఉన్న జనసేన అభిమానులు, జన సైనికులు ఎటువైపు ఉండాలి అన్న సందిగ్దం… ఏం చేయమంటావో చెప్పమంటూ అనేక మంది పవన్ కళ్యాణ్ ను కోరగా, 5వ తేదీన స్పష్టత ఇస్తానని చెప్పడంతో.. ఏం చెబుతారోనంటూ అందరూ వేచి ఉన్నారు… ఈ రోజు 3 గంటల సమయంలో ఒక వీడియో సందేశాన్ని ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా పంపించారు. అందులో ఏముందంటే…

‘‘ధనం దాచగలరు గాని
తేజస్సును దాచగలరా?
తెరలు దించగలరు గాని
శిరస్సులను వంచగలరా?
తమ మంత్రం పారదింక
ఉచ్చు త్రెంచు కొనెను జింక
ఇక స్వేచ్ఛా ప్రయాణము
ఇదే తెలంగాణము’’

ముందు దాశరథి రాసిన ఈ కవితా పంక్తులను ఉటంకించారు. కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్న దాశరధిగారు చెప్పిన మాటలు తన మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయని, దీనిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని తెలిపారు. ముందస్తు ఎన్నికలు, తక్కువ సమయం వంటి కారణాల వల్ల జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడంలేదని చెప్పారు. ‘‘ఈ ఎన్నికల వేళ, తెలంగాణను ఇచ్చామనే వాళ్లు… తెలంగాణను తెచ్చామనే వాళ్లు, తెలంగాణను పెంచామనే వాళ్లు ఉన్నారు. మనకు అత్యంత ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో పాలనను అందించగలరో.. జాగ్రత్తగా ఆలోచించి అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ధ్యాంక్యూ అన్నా…!!

పవన్ మాటల అర్థం ఏమిటో ప్రజలకు బాగానే అర్థం అవుతున్నది. కాపు సామాజిక వర్గం తెలుగుదేశం ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంది. సోషల్ మీడియాలో ఈ ట్రెండు కూడా బాగానే కనిపిస్తోంది. తెరాసకే మద్దతు ఇద్దామనే చాలా మంది పవన్ కళ్యాణ్ ను అడిగారు. పవన్ కూడా అదే చెప్పారంటూ… తెలంగాణలో ఉన్న పవన్ అభిమానులు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *