ఫోర్బ్స్‌ 2018లో పవన్‌, తారక్‌, మ‌హేష్‌..

December 5, 2018 | News Of 9
pawan kalyan jr ntr and mahesh
దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వంద మంది సెలబ్రిటీల లిస్టును ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ ‘దబాంగ్‌’ ‌ సల్మాన్‌ ఖాన్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. 2018లో సల్మాన్ ఏడాది ఆదాయం 253 కోట్ల రూపాయ‌లు. ఇక‌ టీమిండియా ప‌రుగుల సునామీ విరాట్ కోహ్లీ 228 కోట్ల‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఫోర్బ్స్‌ టాప్‌ 100 లిస్టులో మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నిలిచారు. 31 కోట్ల 33 ల‌క్ష‌ల‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 24వ స్థానంలో నిలువ‌గా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 28 కోట్లతో 28వ ప్లేస్‌లో నిలిచాడు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ 24 కోట్ల 33 ల‌క్ష‌ల‌తో 33వ స్థానంలో నిల‌వ‌గా, నాగార్జున 22 కోట్లతో 36వ స్థానం, కొర‌టాల శివ 20 కోట్లతో 39వ స్థానం , అల్లు అర్జున్ 15 కోట్ల 67 ల‌క్ష‌లతో 64వ స్థానంలో నిలిచారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్, విజ‌య‌దేవ‌ర‌కొండ ఇద్ద‌రూ ఒకే పొజిష‌న్‌లో నిలిచారు. వీరిద్ద‌రు 14 కోట్ల‌తో 72వ స్థానంలో నిలిచారు.
వంద మంది సెలబ్రిటీల లిస్టులో బాలీవుడ్ స్టార్‌లే టాప్ ప్లేస్‌లో నిలిచారు. నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచిన స‌ల్మాన్.. రేస్‌-3 క‌లెక్ష‌న్ల‌తో పాటు ప‌లు కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చేస్తూ, ‘దస్‌ కా దమ్‌’, ‘బిగ్‌బాస్‌’ షోలకు హోస్టుగా చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. స‌ల్మాన్ త‌ర్వాత వ‌రుస‌గా విరాట్ కోహ్లీ, అక్ష‌య్ కుమార్, దీపిక ప‌దుకొనే, ధోనీ, అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌వీర్ సింగ్, స‌చిన్ టెండుల్క‌ర్, అజ‌య్ దేవ‌గ‌ణ్ టాప్ టెన్ లో నిలిచారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *