ఎంపీ సీట్లపై తొలి జాబితా రెడీ.. నేడు పవన్ చేతికి

January 18, 2019 | News Of 9

Pawan to get the first list for MP seats

అమరావతి: 25 లోక్ సభ సీట్లకు సంబంధించిన ప్రాథమిక తొలి జాబితాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు శుక్రవారం అందించనున్నారు. పార్టీ నేతలు ఈ వారం రోజులూ పూర్తి స్థాయిలో చర్చించి ఈ జాబితాను రూపొందించారు. ఈ తొలి జాబితాపై చర్చించి… పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారు. 2019 ఎన్నికలకు జనసేన పూర్తిస్థాయిలో సిద్ధం అయింది. అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించక ముందే ఎంపీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించాలని భావించారు. అయితే… తుది నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం పడుతుంది. ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలు జనసేన వైపు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలను పూర్తి చేశారు. అలాగే, సీపీఐ, సీపీఎంలతో సీట్ల సర్దుబాటు గురించి చర్చల్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంలో పవన్ ఉన్నారు. లోగా అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే అభ్యర్థులను నిర్ణయించాలని కూడా ఆయన తలపోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచిందంటే దానికి కారణం తామేనని, వైసీపీ కంటే తెలుగుదేశానికి 5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయన్నది జనసేన ఉద్దేశంగా ఉంది. అయితే తెలుగుదేశంతో పొత్తు తెగదెంపులు చేసుకున్నాక… పవన్ కళ్యాణ్ మరింతగా జనంలోకి దూసుకుపోయారు.

ఈ సారి గెలుపు ముఖ్యమని పవన్ కళ్యాణ్ ఇది వరకే ప్రకటించారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామనీ, అందులో యువతకూ, మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. జనసేన ఒక సైలెంట్ వేవ్ కానున్నదని పార్టీ అంతర్గత సమాచారం. రకరరకాల కారణాల దృష్ట్యా ఎవరూ దీనిపై నోరు మెదపడం లేదు.

Other Articles

9 Comments

 1. I’ve been surfing online more than 3 hours lately, yet I never discovered any interesting article
  like yours. It’s pretty worth enough for me. Personally, if
  all web owners and bloggers made just right content as you probably did,
  the net will likely be much more helpful than ever before.

 2. My developer is trying to convince me to move to .net from
  PHP. I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using WordPress on numerous websites
  for about a year and am worried about switching to another
  platform. I have heard great things about blogengine.net.
  Is there a way I can import all my wordpress posts into it?
  Any kind of help would be really appreciated!

 3. I’m amazed, I must say. Rarely do I come across a blog that’s equally educative and entertaining, and let me tell you,
  you have hit the nail on the head. The issue is something not enough men and
  women are speaking intelligently about. I’m very happy I stumbled across
  this in my search for something regarding this.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *