బాబుకు చెబితే… ఆ ఓటు అవుట్

March 16, 2019 | News Of 9

PawanKalyan

(న్యూస్ ఆఫ్ 9)

అదే మరి విచిత్రం. పవన్ తన ఓటును తొలగించాలని ఈ మధ్యనే రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి విన్నవించారు. ఎన్నికల సంఘం ఈ వినతిని సంబంధిత కలెక్టర్ కు నివేదించింది. అయినా ఆయన తొలగించలేకపోయారు. అదేమిటి అని అడిగితే కంప్యూటర్ మొరాయిస్తోంది అని సమాధానమిచ్చారట. విషయం ఏమంటే.. పవన్ కళ్యాణ్ కు ఓటు రెండు చోట్ల నమోదై ఉంది. ముందు పవన్ కళ్యాణ్ తన ఓటును ఏలూరులో నమోదు చేసుకున్నారు. అనంతరం తన ఓటును విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌దిలీ చేసుకున్నారు. ఆయ‌న కోరిన మేర‌కు ఓటు బ‌దిలీ అయితే అయిందిగానీ… ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు మాత్రం అలాగే ఉండిపోయింది. రెండు చోట్ల ఆయ‌న పేరు ఓట‌ర్ల జాబితాలో క‌నిపిస్తోంది.

ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఓటును తొల‌గించవ‌ల‌సిందిగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ సి.ఇ.ఓ.ను కోరిన మీద‌ట ఆయ‌న పశ్చిమగోదావరి జిల్లా క‌లెక్ట‌ర్‌కు సిఫార్సు చేశారు. చివ‌రికి క‌లెక్ట‌ర్ తొల‌గించ‌డానికి ప్ర‌య‌త్నించారుకానీ.. పని మాత్రం జరగలేదు. కారణం..? ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కంప్యూట‌ర్ స‌ర్వ‌ర్ స‌హ‌క‌రించ‌డంలేదు. ఇదీ కలెక్టరుగారు ఇచ్చిన వివరణ.

వద్దంటే… కొన్ని చోట్ల ఓట్లను తీసేస్తున్నారు. అదేదో కృష్ణ మాయలా చాలా చోట్ల ఓట్లు పోతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఓటు రెండు చోట్ల ఉంటే ఒక చోట తీసేయ్యమంటే మాత్రం కంప్యూటర్ అంటున్నారు. ఎన్నికల సంఘం సమస్యో… లేక చంద్రబాబు వేలి ముద్ర వెయ్యనిదే.. ఎన్నికల సంఘం కంప్యూటర్లు పని చేయవా? ఏమో.. అంతా చిత్రంగా ఉంది!!

ఒక ఐడియా.. మనకు బుర్ర వెలగలేదుగానీ చంద్రబాబుకు చెబితే… క్షణాల్లో ఓటు లేపేస్తారుగా!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *