ఏపీలో ఎవరికి ఓటేశారంటూ ఫోన్ సర్వే..

April 15, 2019 | News Of 9

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఫలితాల కోసం మరో 40 రోజుల వరకు వేచి చూడాల్సిందే. అయితే ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజలకు నేరుగా ఫోన్లు చేసి వారు ఎవరికి ఓటేశారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. 8667124557 నంబర్ నుంచి ఫోన్ ద్వారా చేస్తున్న ఈ సర్వేలో… టీడీపీకి ఓటు వేసి ఉంటే 1, వైసీపీకి ఓటేస్తే 2 , కాంగ్రెస్ కు వేస్తే 3, జనసేనకు ఓటేస్తే 4, ఇతరులకు ఓటేస్తే 5 నొక్కమని అడుగుతున్నారు.

ఇది ఎవరో అనధికారికంగా చేయిస్తున్న సర్వే అని అర్థమవుతోంది. అయతే దీనివెనుక టీడీపీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ కు ముందు కూడా చంద్రబాబు ఇలా నాలుగైదు సార్లు ఫోన్లలో సర్వేలు చేయించారు. ప్రభుత్వ పనితీరుపై పథకాల అమలుపై ప్రజలకు పథకాలు చేరుతున్నాయా లేదా అనే అంశం పై – ప్రభుత్వం సంతృప్తిగా పనిచేస్తుందా లేదా అనే అంశాలపైనే కాదు.. నియోజక వర్గ ఎమ్మెల్యే పనితీరు గురించి కూడా సర్వే చేశారు. కొన్ని సర్వేల్లో సీఎం చంద్రబాబు వాయిస్ తో కూడా ప్రశ్నలు అడిగించారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *