పేదల దేవుడిని అంటాడు… దెయ్యపు ఆలోచనలు చేస్తాడు

January 17, 2019 | News Of 9
  1. Babu: The God of the poor, and his evil designs | telugu.newsof9

• ఫోన్లో 1 నొక్కకపోతే హింసే
• అధికారుల నుంచీ పదే పదే ఫోన్లు
• మీ పరిపాలన బంగారం అనే వరకు ఆగని కాల్స్…
• అక్కడికీ దారికి రాకపోతే ఓట్లు మటాష్
• తనదైన శైలిలో ప్రజల మెడల్ని వంచుతున్న టీడీపీ
• పేరుకే ప్రజాస్వామ్యం…ఆచరణలో నియంతృత్వం
• మార్కెటింగ్ కంపెనీలా పని చేస్తున్న ప్రభుత్వం
• రూ.2 లక్షల కోట్ల బడ్జెట్టు, నిధులు వదులుకోలేకనే.
• ‘‘న్యూస్ ఆఫ్ 9’’ క్షేత్ర స్థాయి పరిశీలన

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

మొబైల్ స్క్రీనుపై ఏపీ సీఎం అని కనిపించగానే… ఆంధ్ర ప్రజలు హడిలిపోతున్నారు. సీఎం అని కనిపిస్తే సంతోషించాలిగానీ, భయపడటం దేనికి అని అనుకుంటున్నారా? ఈ ‘‘ఏపీ సీఎం’’ పథకాన్ని చూసి ప్రజలు భయపడుతున్నారుగానీ… చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చే మంత్రదండాల్లో ఇది కూడా ఒకటి. బయటకు పేదల పెన్నిధినని చెప్పుకుంటున్న చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఏమంటే.. ప్రజల మెడల్ని వంచి మరీ… వారిని తెలుగుదేశం సానుభూతిపరులుగా మార్చాలి. మారనని మొండికేస్తారా? అధికారులు మిమ్మల్ని వెంటాడతారు. టెక్నాలజీ వెంటాడుతుంది. రియల్ టైం గవర్నెన్స్ మిమ్మల్ని వెంటాడుతుంది. మీ పేరూ, ఊరూ, మీ ఆధార్ నెంబరూ అన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మీ జుత్తు ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రజలు భయపడుతున్నది ఇందుకే. మీడియా కంటపడకుండా (కనపడినా ఎవరూ రాయడం లేదు. జర్నలిస్టులకు అన్ని రకాల సాయాలూ అందినట్లు తెలిసింది. బాబుకు వ్యతిరేకంగా రాయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం). చాప కింద నీరులా సాగిపోతున్నది.

2019 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ భీతావహానికి తెర తీసింది. దీనికి రియల్ టైమ్ గవర్నెన్స్ అని పేరు పెట్టింది. మునుపెన్నడూలేని సాంకేతికతను ప్రభుత్వం అందిపుచ్చుకుంది. దీని సాయంతో… ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎవరి మెదడులో ఏం ఉంది? అన్నింటినీ బయటకు కక్కించి.. వారు తెలుగుదేశం కాకుండా… ఇతర పార్టీల సానుభూతిపరులని తేలితే… అక్కడ నుంచి రియల్ టైమ్ గవర్నెన్స్ పని చేయడం ప్రారంభిస్తుంది.

పండక్కి కృష్ణాజిల్లా వెళితే… చంద్రబాబు పాలన గురించి స్థానికులు చక్కగా వివరణగా చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే జనం భయపడుతున్నారని అర్థమైంది. కారణాలు ఎందుకో చెబుతా. ఇపుడు ప్రజలంతా ముక్తకంఠంతో ‘‘చంద్రబాబా… రాజాధిరాజా… రాజ మార్తాండా… మహాప్రభో’’ అని కీర్తించాలంట. నువ్వే సీఎం అని అనాలట. ఇందుకోసం ఎమ్మార్వోలు, ఇతర అధికారులు అహోరాత్రులూ పని చేస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం దీనిపైనే దృష్టి పెట్టింది. మార్కెటింగ్ కంపెనీలు సహజంగా ఇలాంటి పనులు చేస్తుంటాయి. దీనిని బట్టి మాకు అర్థం అయింది ఏమంటే… ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఒక ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ స్థాయికి దింపేశారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామికివేత్తలకు డబ్బు సంపాదించేందుకు తెలుగుదేశం పార్టీ 1983 నుంచీ ఒక ప్రైవేటు కంపెనీలా పని చేసింది. ఇప్పుడు కూడా అలానే పని చేస్తున్నది.

చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని ఒక ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీగా మార్చేసినట్లు అర్థమైంది. సరే, చంద్రబాబు పెద్ద వ్యాపారవేత్త. అనేక వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న వ్యక్తి. అందుకనే.. ప్రభుత్వాన్నీ, ప్రభుత్వ అధికారులను మార్కెటింగ్ అధికారులుగా మార్చేశారు.

అదెలాగో చూద్దాం…!!
ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగుతుంది.
9100911100 నుంచి ఫోన్. (నెంబర్లు మారుతూ ఉంటాయి).
చంద్రబాబు ప్రభుత్వం బాగుంటే 1 నొక్కండి. లేదంటే 2 నొక్కండి. అని ఒక గొంతు చెబుతుంది. బాగుంది అని 1 నొక్కితే… ఆ ఫోన్ ఆగిపోతుంది. 2 నొక్కితే మాత్రం.. మీకు పించను అందలేదా? లేక ప్రభుత్వ పథకాలు సరిగా అందలేదా? అని ప్రశ్నలు వినబడతాయి. వాటికి సరైన సమాధానాలు చెప్పినా చెప్పకపోయినా, ఆ తర్వాత ఫోను మోగుతూనే ఉంటుంది. తర్వాత ఆ ఫోన్ ఏ మండలంలో ఉందో ఆ మండలం ఎమ్మార్వో లేదా అధికారులు ఫోనులోకి వస్తారు. ప్రశ్నలు రిపీట్. ‘‘అయ్యా… మహా ప్రభో చంద్రబాబు ప్రభుత్వం బాగుంది’’ అని చెప్పే వరకూ ప్రజల ఫోన్లు రింగ్ అవుతూనే ఉంటాయి. ఫోను సంభాషణ అమరావతిలో రికార్డు అవుతూ ఉంటుంది. అధికారులు ఒక్క మాట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఉండదు. ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నేరుగా అధికారులనే నిందిస్తారు. ఉదాహరణకు తెలుగుదేశం ప్రభుత్వం ఒక గ్రామాన్ని స్వర్గం కింది మార్చేసిందని అనుకుందాం. ప్రభుత్వ పనితీరును కేవలం వీటి అంశాలవల్లనే కాకుండా, ఆ పార్టీ సామాజిక, ఆర్థిక అంశాల్లో వాటి దృక్పథం ఎలా ఉంది అన్నది చూస్తారు. అయితే, చంద్రబాబు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న అంశం కూడా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడానికి ఒక కారణంగా ఉండొచ్చు. దానిని ఎమ్మార్వో ఏం చేస్తాడు? అయితే చంద్రబాబుకు ఇవేమీ పట్టవు. మార్కెటింగ్ కంపెనీలు కూడా వాళ్ల అధికారులు చెప్పే వివరణలు పట్టించుకోవు. టార్గెట్ కంప్లీట్ అయిందా లేదా అంత వరకే చూస్తాయి. ఇది అధికారులకు కూడా నరకంగానే తయారై ఉంటుంది. ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ టీడీపీ కోపం మొత్తం ఎన్జీవోలపైనే ఉండేది. వాళ్ల వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అనుకోవడం తెలుగుదేశం ఫిలాసఫీ. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ వేరే పార్టీలకు ఓట్లు వేసేవారు.

ఏపీ సీఎం నుంచి వచ్చిన ఫోన్ కాల్ తీసుకున్న వ్యక్తి సంతృప్తి చెందితే అక్కడితే వదిలేస్తారు. సంతృప్తి చెందడం అంటే దాని అర్థం.. చంద్రబాబు ప్రభుత్వంలో ధర్మం 66 పాదాల నడుస్తోందని చెప్పాలి. అధికారులు ఫోన్లు చేసి… ‘‘చెప్పండి. చంద్రబాబు ప్రభుత్వం మీకు ఎందుకు నచ్చలేదు. చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పండి’’ అంటూ వేధిస్తున్నారు. అందుకే….. చంద్రబాబు ప్రభుత్వం బాగుందా అని ఐవీఆర్ఎస్ ఫోను రాగానే అందరూ ఫోన్లో ఉన్న 1 (ఒకటి నెంబరు) నొక్కేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంపై మీకు సంతృప్తి లభిస్తుందా అన్న ప్రశ్నకు మారు మాటాడకుండా.. ఒకటి నొక్కేస్తున్నామని విజయవాడ వాసులు కొందరు తెలిపారు. ఒకటి నొక్కేస్తే మనసుకు హాయిగా ఉందని వారు తెలిపారు.

రహస్యంగా ఈ ఫోన్ల కార్యక్రమం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత మంది అనుకూలంగా ఉన్నారు? ఎంత మంది జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నారు… ఎంత మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అన్న వివరాలను రహస్యంగా సేకరిస్తోంది. మా ఇంటి ముందు చెత్త ఉంది. అందుకే బాగాలేదు అనగానే… క్షణాల్లో ఒక మునిసిపాలిటీ బండి వచ్చి… చెత్తను వేసుకుపోతుంది. ఆశ్చర్యం… ప్రభుత్వం ఇంత వేగంగా పని చేస్తోందా అని అనిపిస్తుంది. ఎన్నికల సమయం కదా. మన ఇంటి ముందున్న చెత్త అంశం ఒక్కటే ప్రభుత్వం మొత్తం పనితీరును నిర్ణయించదు. ప్రజాధనం సద్వినియోగం అవుతుందా లేదా అన్నదీ ముఖ్యమే. ప్రజలు చెల్లించిన పన్నులు మళ్లీ ప్రజలకోసమే ఖర్చు చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. అందువల్ల బలవంతంగా ప్రజల మెడలు వంచడం దారుణం.
తెలుగుదేశం ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేయని వారి ఓట్లను తీసివేస్తున్నారని కొందరు ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వద్ద ఆరోపించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో స్వచ్ఛంద సంస్థల రూపంలో ఓట్లను రద్దు చేస్తుంటే స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. మచిలీపట్నంలో కూడా ఐవీఆర్ఎస్ ద్వారా పార్టీ అనుకూలం, వ్యతిరేక వర్గాలను కనిపెట్టి… ఓట్లను తొలగించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇలా ఎంత మంది ఓట్లను తొలగిస్తున్నారో తెలియదు. ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం ఈ దాష్టీకానికి తెరతీసింది. వేరే పార్టీ జండా పట్టుకునేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. ‘నీ మోటారు సైకిలుకు వైసీపీ జెండా కడదాం. ఏమవుతుంది?’’ అంటే, కడితే తెలుగుదేశం జండా కట్టాలి. లేదంటే ఏ జండా కట్టినా హింస తప్పదు. నీకు దండం పెడతా’’ అంత పని చేయకండి అని దీనంగా అడిగాడు ఒక పౌరుడు.

జనసేన పార్టీ సానుభూతిపరులపై వేట
రాష్ట్రంలో జనసేన పార్టీ సానుభూతిపరులపై తెలుగుదేశం ప్రభుత్వం పరోక్షంగా నిఘా పెట్టింది. జనసేన పార్టీ సానుభూతిపరులమనీ, లేదా వైసీపీ సానుభూతిపరులమనీ చెప్పుకునేందుకు గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. స్థానిక తెలుగుదేశం నేతలు డేగకళ్లతో ఇతర పార్టీల సానుభూతిపరులను గుర్తించే పనిలో ఉన్నారు. ఒక వైపు పార్టీ, మరోవైపు అధికారులు ప్రజల్ని పార్టీల వారీగా గుర్తించి… వారిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చడమో, లేక వారిని ప్రభుత్వ పథకాల నుంచి దూరంగా పెట్టడంమో చేస్తున్నారు. ‘‘నేను లోను దరఖాస్తు పెట్టుకున్నాను. నేను జనసేన అంటే ఇష్టం. కానీ జండా పట్టుకుని తిరిగితే నా లోను ఆగిపోతుంది. నా వ్యాపారానికి లోను అత్యవసరం’’ అని ఒక జనసేన సానుభూతిపరుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తోందని చెబుతావా అనే వీడియో రికార్డు చేస్తామని అనగా.. అంత పని చేసి నా పొట్ట కొట్టవద్దని ఒక యువకుడు ప్రాధేయపడ్డాడు.
ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పేరు చెబితే.. అమ్మో బయటపడితే ఇంకా ఏమైనా ఉందా అని చాలా మంది ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వద్ద వ్యాఖ్యానించారు.

మొన్న కలెక్టర్లకు కూడా మార్కెంటింగ్ అధికారుల స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు పెట్టినట్లున్నది. ప్రజల సంక్షేమం గురించి పని చేసే ఎవరికైనా… చెప్పుల కంపెనీల మాదిరిగా టార్గెట్లు పెడితే అది సత్ఫలితాలను ఇవ్వదు. చూడటానికి ఇది బాగుంటుంది. కానీ వాస్తవంలో ఫలితాలు రావు. ఏమైనా ఎన్నికల్లో గెలవాలన్న తెలుగుదేశం పార్టీ కుయుక్తల కారణంగా… ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అయినా దొడ్డి మార్గంలోనైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ చూస్తున్నది. సమయం ఎక్కువ లేదు. ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి. ఏమి కానున్నదో చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి భ్రమలూ లేవు. ఈ విషయం చంద్రబాబుకు తెలియనిదేమీ కాదు. అందుకే… అధికారమనే చెర్నాకోలాతో ప్రజల తోలు వలిచి అయినా అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలను పెద్ద ఎత్తున వాడుతున్నారు. పైకి పథకాల అమలు అని చెప్పినా… అసలు లక్ష్యాలు వేరు. దీంతో ప్రభుత్వం ఒక మార్కెటింగ్ కంపెనీ స్థాయికి దిగిపోయింది అనేది సుస్పష్టం. పేదల దేవుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు వికృత ఆలోచనలు ఇవి. నియంతృత్వం… నియంతలను చరిత్రలో కలిపేస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ఆంధ్ర ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *