సినిమా పరిశ్రమ ఓటు ఎవరికి పడింది?

December 10, 2018 | News Of 9

Tollywood | telugu.newsof9.com

హైదరాబాద్అవును… తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాయి కానీ.. ఇంతకీ ఫిల్మ్ నగర్ లో ఉన్న సినిమా ప్రముఖులంతా ఎవరికి ఓటు వేసి ఉంటారోనని మీకు అనుమానం వచ్చిందా? ఉమ్మడి ఏపీలో అధికారంలో ఎవరున్నా… పరిశ్రమకు చెందిన దాదాపు 95 శాతం పెద్దోళ్లంతా తెలుగుదేశం పార్టీకే ఓటు వేసేవారు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, ధర్మవరపు సుబ్రమణ్యం లాంటి కొందరు కాంగ్రెసుకు మద్దతుగా ఉన్నా, మిగతా సినిమా పరిశ్రమలో పెద్దోళ్లంతా తెలుగుదేశం వైపే ఉండేవారు.

తెలంగాణ ఉద్యమంలో కొంత చేదు అనుభవాలు తిన్న తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ఎవరి వైపు నిలిచింది అనే  చర్చ నడుస్తోంది. తెలంగాణ విభజన జరిగినప్పుడు 2014 ఎన్నికల్లో హైదరాబాదులో ఉన్న సెటిలర్లందరూ తెలుగుదేశం వైపునే ఉన్నారని తేలిపోయింది. సినిమా పరిశ్రమకు చెందిన అధిక శాతం ఓటర్లు ఖైరతాబాద్ నియోజక వర్గం పరిధిలోకి వస్తారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పొత్తు ఉండేది. దీంతో ఖైరతాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడిన చింతల రామచంద్ర రెడ్డికి సినిమా ఓట్లు పడినట్లు రుజువైంది. ఖైరతాబాదులో ఇపుడు తెలుగుదేశం లేదు కాబట్టి బీజేపీకి ఓట్లు వేసినా… సినిమా పరిశ్రమకు తెరాస ప్రభుత్వం అండగా నిలబడింది. సినిమా పెద్దలకు అతి దగ్గరగా ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించారు. దీంతో గడచిన నాలుగున్నరేళ్లలో సినిమా పరిశ్రమ వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తలసాని కూడా బాగా చూసుకున్నారు.

తాజా ఎన్నికల్లో పరిశ్రమ ఎటువైపు?

తాజాగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. సినిమా సెలబ్రిటీలంతా క్యూ లో నిలబడి మరీ ఓట్లు వేశారు. వీరంతా ఎవరికీ ఓట్లు వేశారన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఖైరతాబాద్ నియోజకవర్గం లో ప్రస్తుతం తెరాస, బీజేపీ, కాంగ్రెస్ (మహాకూటమి అభ్యర్థి) రంగంలో ఉన్నారు. మహాకూటమిలోనే తెలుగుదేశం భాగంగా ఉంది. మరి ఈ సారి సినిమా పెద్దల ఓట్లు ఖైరతాబాద్ లో కాంగ్రెసుకు పడ్డాయా లేదా అనేదే ఆసక్తికరంగా తెరపైకి వచ్చింది. గ్రేటర్ లో సినిమా వాళ్లంతా తెరాసకు మద్దతు తెలిపినట్టు ఇప్పుడు కూడా తెరాసాకే ఓటు వేశారా లేక తెలుగుదేశం భాగస్వామిగా ఉన్నందున మహాకూటమికి ఓటు వేశారా అనేది తేలాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి ఉండాల్సిందే.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *