ప్రజాకూటమి తెలంగాణ ఉనికినే ప్రశ్నిస్తోంది: హరీష్

December 3, 2018 | News Of 9

Harish Rao | telugu.newsof9.com

హైదరాబాదు: ప్రజాకూటమి తెలంగాణ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందని, ఈ విషయాన్ని తాను రాజకీయ నేతగా కాకుండా, ఒక ఉద్యమ కార్యకర్తగా మాట్లాడుతున్నానని  మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరూ ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచించుకోవాలని అన్నారు. 1956 నాటి పరిస్థితుల్ని పురావృతం చేసేందుకు కాంగ్రెసు ఆలోచిస్తోందని, తెలంగాణలో వామపక్షాలు బలంగా ఉన్నాయని చెప్పి అప్పట్లో తెలంగాణను ఏపీలో కలిపేసిందని అన్నారు. ఇపుడు కూడా అదే కుట్రను బయటకు తెస్తున్నారని అన్నారు.

పేరుకు మహాకూటమి అయినా, అందులో ఉన్నది కాంగ్రెసు, తెదేపాలేనని ఆయన అన్నారు. కోదండరామ్ ను కోదండం ఎక్కించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుట్ర వల్లే ఆగిపోయిందని, లేదంటే తెలంగాణ 18 ఏళ్ల కిందటే వచ్చేదని అన్నారు. తెలంగాణ అన్న పదాన్నే చంద్రబాబు అసెంబ్లీలో నిషేధించారని, తెరాస పార్టీ కార్యాలయన్ని జలదృశ్యం నుంచి ఖాళీ చేయించింది కూడా చంద్రబాబేనని చెప్పారు. కేవలం నాలుగు సీట్ల కోసం రాష్ట్రాన్ని రాసిస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ… నా జైత్ర యాత్రో, శవ యాత్రో అంటూ కేసీఆర్ దీక్ష చేసినందునే తెలంగాణ ప్రకటన వచ్చిందని అన్నారు. చంద్రబాబు చేసిన అర్థరాత్రి డ్రామా వల్ల తెలంగాణ ఆగిపోయిందని తెలిపారు. మీడియాని మేనేజ్ చేసినంత మాత్రాన చంద్రబాబు చెప్పే అబద్ధాలు నిజాలు అయిపోవని హరీష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలంగాణ అంతటా పోటీ చేస్తూ… కేవలం కూకట్ పల్లి, శేరీలింగంపల్లి, ఖమ్మంలోనే ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.  ఉత్తమ్, పొన్నాల, జీవన్ రెడ్డి, బలరాం నాయక్, జానారెడ్డి, సుధీర్ రెడ్డి , జగ్గారెడ్డి, జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి  అందరూ సమైక్య వాదాన్ని వినిపించిన వాళ్ళేనని, వారే ఇపుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారని అన్నారు.  చంద్రబాబు గోబెల్ బాబుతో హరీష్ పోల్చారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *