విజయ్ దేవరకొండతో చార్మీ పూరీ కనెక్ట్స్..

August 13, 2019 | News Of 9

పూరీ కనెక్ట్స్ అధినేత్రి చార్మీ సోషల్ మీడియాలో తాజాగా ఓ ఆసక్తికర వార్తను వెల్లడించింది. తను పూరీజగన్నాద్ కలిసి యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారని.. అంతే కాదు తను పూరీ ఇంకా విజయ్ దేవరకొండతో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ భార్య లావణ్య సమర్పకురాలిగా వ్యవహరిస్తారనీ.. మిగిలిన విషయాలను త్వరలో ప్రకటిస్తామనీ వివరించింది. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ మూవీ పూరీ జగన్నాథ్ లోనే కాదు చార్మీలోనూ కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. దాంతో యమ సంతోషంగా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పూరీ సినిమా అంటే తక్కువ టైంలోనే పూర్తవుతుంది కాబట్టి ప్రాజెక్ట్ పట్టాలెక్కితే నాలుగైదు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది.

అనేక తెలుగు సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నటి చార్మీ. ఆమె దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో చిత్ర నిర్మాణాన్ని మొదలు పెట్టింది. వీరి పూరీ కనెక్ట్స్ బ్యానర్ జ్యోతిలక్ష్మి సినిమా నిర్మాణంతో ప్రారభమైంది. ఆ సినిమా అంత హిట్ కాకపోయినా ఇదే బ్యానర్ లో నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు తనకు ఓ మంచి మాస్ హిట్ ఇచ్చారని ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో వచ్చిన సినమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో ఇస్మార్ట్ అనుకున్నదాని ఎక్కువ వసూళ్లే రాబట్టింది. దీంతో వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకొచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మూడ్లోనే విజయ్ దేవరకొండతో సినిమా మొదలు కానుందని వెల్లడించి సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేసింది చార్మీ. అయితే విజయ్ గత చిత్రాలు.. నోటా, డియర్ కామ్రేడ్ కమర్షియల్ గా అంతగా రాణించలేకపోయాయి. దాంతో విజయ్ దేవరకొండ్ కూడా పూరీ మార్క్ మాస్ హీరోయిజం తన కెరీర్ కి ఉపయోగపడుతుందని భావించి ఉండొచ్చని అభిమానులు అనుకుంటున్నారు. యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించిన విజయ్ తో చార్మీ, పూరీలకు మరో హిట్ దక్కనుందో.. లేక వాళ్ళ వల్లే విజయ్ దేవరకొండకు కమర్షియల్ సక్సెస్ దక్కనుందో ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక పూరీ కనెక్ట్స్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అంవుతుందో వేచి చూడాలి.

Other Articles

5 Comments

  1. [url=https://isykitikoq.ga/]erythromycin order online[/url] [url=https://opukufecuk.gq/]where to buy viagra[/url] [url=https://odesigeh.ga/]buy lioresal[/url] [url=https://seqinubypaho.tk/]cost of furosemide[/url] [url=https://iqysokohuc.tk/]cialis without a rx[/url] [url=https://itobopasedyk.tk/]vasotec generic[/url] [url=https://nixyzakyxaxo.tk/]motilium[/url] [url=https://adebunavaz.tk/]myambutol[/url]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *