మహాకూటమిని గెలిపిద్దామన్న రాహుల్, బాబు

December 5, 2018 | News Of 9

Rahul and babu appeals to vote for Praja Kutami | news of 9

హైదరాబాదు: 5 సంవత్సరాల కిందట తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని, కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందనీ, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అందరినీ కలుపుకొని వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పూర్తి కాలేదనీ, తెరాస తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కానీ అది సాధ్యమయ్యే పని కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందరం కలిసి ఉండాలనీ, కలిసి ఉన్నపుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.

 

ఏం ఆశించి ఉద్యమం చేశామో, అది నెరవేరలేదని, ఒక కుటుంబం తన సంక్షేమ ఒక్కటే చూసుకుంటే, రాష్ట్రం ఎలా బాగుపడుతుందని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. తెరాసని గద్దె దించే సమయం వచ్చిందని, తన కోసం పని చేసుకునే ప్రభుత్వం మనకు వద్దు అని ఆయన అన్నారు. నరేంద్ర మోడీకి ఏజెంట్ గా పని చేస్తున్న కేసీఆర్ ని గద్దె దించడానికే కూటమి ఏర్పాటు చేసినట్లు సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజా ఫ్రంటును గెలిపించాలని గద్దర్ ఒక కవిత రాశారు. డిసెంబర్ 7 న నియంత పాలనకు విముక్తి కలిగించాలని మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని, అనేక మంది విద్యార్థుల త్యాగాలతో, పోరాటాలతో వచ్చిందని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *