రైల్వే బ్రిడ్జి VS రాజధాని నిర్మాణం

August 14, 2018 | News Of 9

ఇదేంటీ రైల్వే బ్రిడ్జికి రాజధాని నిర్మాణానికి లింకేంటీ అనుకుంటున్నారు కదా.. ‘ఇంట్లో ఉన్న గుంతని పూడ్చలేని వాడు ఇంటి బయట బావిని తవ్వుతా’ అంటే ఎంత వరకు నమ్మశక్యమో ఇది కూడా అంతే. రైల్వే బ్రిడ్జి ఎక్కడ ఉంది అసలు ఎందుకు నిర్మించాలో తెలుసుకుందాం..

పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే గేటు నెంబర్ 381 అనగానే ఆయా ప్రాంత ప్రజల గుండెళ్లో నిజంగానే రైళ్లు పరుగెడతాయి. నిత్యం విజయవాడ-విశాఖపట్నం మధ్య పదుల సంఖ్యలో అటూఇటు ప్రయాణిస్తుంటాయి. దీంతో  ఎంత పెద్ద ఆసామి అయినా సరే నిడదవోలు నుంచి తాడేపల్లి గూడెం వెళ్లాలి అంటే ఇక్కడ కనీసం 30 నిమిషాలు ఆగాల్సిందే. ఒక వేళ గేటు తెరిస్తే వాహనాలు గేట్ క్రాస్ అవ్వడానికి 15 నిమిషాల సమయం పడుతోంది. ఇది ఎప్పటినుంచో నిడదవోలు ప్రజలను పీడిస్తున్న ప్రధాన సమస్య. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ పైవంతెన (ఫ్లై ఒవర్ బ్రిడ్జి) నిర్మిస్తామంటూ ప్రజలకు హామిలిస్తుంటాయి. ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం తీరలేదు.. తెదేపా ఎన్నికల హామీల్లో భాగంగా స్థానిక నాయకులు బ్రిడ్జి నిర్మించితీరుతాం అంటూ గట్టిగా చెప్పినా అవి ఒట్టిమాటలుగానే మిగిలిపోయాయి.

ఐదు ఫర్లాంగుల బ్రిడ్జిని నిర్మించలేని వారు అమరావతిని ఎలా నిర్మిస్తారు?.. ఇదే ప్రశ్న నిడదవోలు వాస్తవ్యుల మదిలో నిత్యం మెదులుతోంది. కేంద్రాన్ని శాసిస్తా అంటూ చెప్పుకునే నాయకులు, జిల్లాలో పసుపు కండువాలు వేసుకుని మైకుల ముందు మైండ్ లేని మాటలు మాట్లాడే చిల్లర నేతలు ఎందరో ఉన్నారు… ఇక వారి రాజకీయ భవిష్యత్ త్వరలోనే ముగియనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభంజనంతో ఇప్పటికే చల్లటి చెమటలు పడుతున్న నాయకుల ముఖంలో ఓటమి భయం కనబడుతోంది.

వైసీపీ, తెదేపా దొందూ దొందూ అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విలువల్లేని రాజకీయాలను నడుపుతున్నారు. ఒకరికి కేసుల భయం మరొకరికి పదవీవ్యామోహం ఇలా వారి స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న నేతల పనిపట్టడానికి వచ్చిన జనసేనాని చూసి ప్రతీ రోజు వారి మేధావులతో చర్చలు కొనసాగించడం చూస్తుంటే ఏపీలో తప్పని సరిగా రాజకీయ మార్పు అనివార్యం అనేది అర్థం అవుతోంది.

ప్రతీ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరిస్తే తెదేపా రాజధానిని నిర్మించినట్లే అంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నోట సాగుతున్న చర్చ. ఎన్నికల సమయం దగ్గరకు వస్తోన్న నేపథ్యంలో అనేక రకాల డ్రామాలతో అధికార ప్రతిపక్ష పార్టీలు మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యాయి అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

 

Other Articles

9 Comments

 1. Hey! This is my first visit to your blog! We are a group of volunteers and starting a new project
  in a community in the same niche. Your blog provided us beneficial information to work on. You have done a extraordinary job!

 2. Hi! This post could not be written any better!

  Reading this post reminds me of my old room mate!

  He always kept talking about this. I will forward this post to him.
  Pretty sure he will have a good read. Many thanks for sharing!

 3. Undeniably believe that which you stated. Your favorite justification appeared to be on the web
  the easiest thing to be aware of. I say to you, I certainly get irked while people consider worries
  that they just do not know about. You managed to hit the nail
  upon the top and also defined out the whole thing
  without having side effect , people could take a signal. Will likely be back to get more.
  Thanks

 4. Hiya! I know this is kinda off topic however I’d figured I’d ask.

  Would you be interested in exchanging links or maybe guest authoring a blog article or vice-versa?
  My website goes over a lot of the same subjects as yours and I believe we could greatly
  benefit from each other. If you happen to be interested feel free to send me an e-mail.

  I look forward to hearing from you! Terrific blog by the way!

 5. Pingback: prices of viagra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *