‘ఫుల్లీ రీలోడెడ్‌’తో ర‌జ‌నీ మ‌రో సినిమా!

December 4, 2018 | News Of 9

2.O’ సినిమాతో సంచనాల రికార్డులు క్రియేట్ చేస్తున్న సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ కెరీర్‌ప‌రంగానూ ఫుల్లీ రీలోడెడ్‌గా క‌నిపిస్తున్నాడు. వరుస‌ సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ 166వ మూవీ తెరకెక్కనుంది.

 

విజయ్‌ హీరోగా సర్కార్‌ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్‌ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా ప‌వ‌ర్‌ఫుల్ పొలిటిక‌ల్ స‌బ్జెక్టుగా తెలుస్తోంది. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్‌ తోడైతే రజనీ పొలిటికల్‌ ఎంట్రీకి కూడా ప్లస్‌ అవుతుందంటున్నారు సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌. ఈ సినిమాలో ర‌జ‌నీ ఒరిజిన‌ల్ స్టైల్‌కు త‌గ్గ‌ట్టు యాక్టింగ్, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌లు ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

 

మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ ఫిల్మ్ అప్‌డేట్స్ కోసం…

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *