‘సిగరెట్’ సీక్రెట్ చెప్పేసిన ర‌జ‌నీకాంత్

December 1, 2018 | News Of 9
Rajini revealed secrete of cigar | news of 9
సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అంటే మాస్ పీపుల్స్‌లో వైబ్రేష‌న్స్ హైరేంజ్‌లో ఉంటుంది. డైలాగ్‌ చెప్పినా.. నడిచినా.. పరుగెత్తినా.. చేయి ఊపినా.. గన్‌ తిప్పినా.. సిగరెట్‌ వెలిగించినా .. ఆ స్టయిలే ఓ డిఫరెంట్‌. ర‌జినీ సిగరెట్ కాల్చడంలో ఓ స్పెషల్ స్టైల్ ఉంటుంది. దానికి కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. సిగరెట్ స్టైల్ లో ఆయనను అనుకరించాలని అనేకమంది ప్రయత్నిస్తుంటారు. అయితే సూపర్ స్టార్ కి ఈ స్టైల్ ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. 2.O సూప‌ర్ హిట్‌తో దూసుకుపోవ‌డంతో ఫుల్ హ్యాపీగా ఉన్న ర‌జ‌నీ మీడియా ముందుకు వ‌చ్చి త‌న సినిమాల్లో సిగ‌రెట్ తాగ‌డం వెనుకున్న క‌థ గురించి చెప్పాడు.
బాలీవుడ్ లో శత్రుఘ్నసిన్హా సిగ‌రెట్‌ను ఢిప‌రెంట్ స్టైల్‌లో తాగుతూ ఓ సినిమాలో చూపించాడ‌ట‌. దీంతో ఆ స్టైల్ త‌న‌కు న‌చ్చ‌డంతో తాను కూడా ప్ర‌య‌త్నిస్తూ.. ఇంకాస్త బెట‌ర్‌గా చేయ‌డం కోసం ప్ర‌య‌త్నించాన‌ని చెప్పాడు. అద్దం ముందు నిల‌బ‌డి కొన్ని గంట‌ల పాటు ప్రాక్టీస్ చేస్తే.. చివ‌రికి త‌న‌కంటూ ఒక స్టైల్ వ‌చ్చింద‌ని, సిగ‌రెట్‌ను కేవ‌లం విస‌ర‌డం, ప‌ట్టుకోవ‌డం మాత్ర‌మే కాద‌ని, స‌రైన టైమింగ్‌తో చేస్తేనే స్టైలిష్‌గా ఉంటుంద‌ని ర‌జినీ అన్నారు. దీంతో ర‌జినీ సిగ‌రెట్ క‌హానీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏదేమైనా 2.O రిజ‌ల్ట్‌తో ర‌జ‌నీ ఫీవ‌ర్ మ‌ళ్లీ హైరేంజ్‌కు చేరింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *