ఏపిలో ఐదు చోట్ల రీపోలింగ్..

April 17, 2019 | News Of 9

విజయవాడ: ఎపిలో ఐదు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఈసీ సిఫార్సు చేసింది. ప్రకాశం జిల్లా లో రెండు పోలింగ్ కేంద్రాలు, నెల్లూరు జిల్లా లో రెండు పోలింగ్ కేంద్రాలు, గుంటూరు జిల్లా లో ఒక పోలింగ్ కేంద్రంతో మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సూచించింది.

నెల్లూరు జిల్లా అత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు బయటపడిన ఘటనలో పోలింగ్ బూత్ ఆర్ ఓ, ఎ ఆర్ ఓ లపై చర్యలు తీసుకోవాలని కూడా ఈసీ సిఫార్సు చేసింది. మచిలీపట్నం స్టాంగ్ రూమ్ లో ఈవిఎంలు మార్చిన ఘటనపై కూడా అధికారులపై చర్యలకు ఈసీ అదేశించింది. పది మంది అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *