20 కోట్ల మందిని ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వి

February 11, 2019 | News Of 9

Rowdy Baby cracked her own record!! | telugu.newsof9.com

నాచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. త‌న పింపుల్స్‌తో, డాన్స్‌తో, మాట‌ల‌తో అంద‌రిని త‌న‌వైపే తిప్పుకుంటున్న ఈ భామ‌పై యూత్ మ‌న‌సుపారేసుకుంటున్నారు. సాయిప‌ల్ల‌వి స్టెప్పులు చూస్తూ మైమ‌రిచిపోతున్నారు. తెలుగులో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్.. 183 మిలియన్ వ్యూస్‌ సంపాదించి సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డ్ క్రియేట్ చేయగా.. ధనుష్ గ‌త వైర‌ల్ సాంగ్ ‘కొలవరి’ సాంగ్ 175 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది.

అయితే సాయిపల్లవి తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి 2’ సాంగ్ రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్‌లో తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ‘వచ్చిందే’ సాంగ్‌పై ఉన్న 183 మిలియన్ల వ్యూస్ రికార్డును బ్రేక్ చేసింది. 193 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో.. సౌత్ ఇండియాలోనే యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్‌ రాబట్టిన సాంగ్‌గా నిలిచింది.

వ‌చ్చిండే.. పాట‌తో ధ‌నుష్ చేసిన కొల‌వ‌రి సాంగ్‌ను ఫ‌స్ట్ ప్లేస్ నుంచి రెండో ప్లేస్‌కు చేర్చిన‌ సాయిప‌ల్ల‌వి.. తాజాగా కొల‌వ‌రి సాంగ్‌ను మూడో ప్లేస్‌కు చేర్చింది. ఇప్పుడు అదే ధ‌నుష్ తో క‌లిసి రౌడీ బేబీ సాంగ్‌తో సౌతిండియా నంబ‌ర్ వ‌న్ సాంగ్‌గా నిల‌బెట్టింది. సాయిప‌ల్ల‌వి సాధించిన మరో అద్భుత రికార్డ్ ఏమిటంటే.. వచ్చిండే పాట, రౌడీ బేబీ సాంగ్‌తో 20కోట్ల మందిని మెస్మరస్ చేసిన ఘనత సాధించింది. మొత్తానికి యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డుల‌తో దుమ్మురేపుతోంది ఈ పింపుల్ బ్యూటీ.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *