ఇన్స్టాగ్రామ్ లో “సాహో” కొత్త పోస్టర్

May 20, 2019 | News Of 9

sahoo | telugu.newsof9.com

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ రేపటి నుంచి సాహో సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నాడు. ఇందులో భాగంగా సాహో సర్ప్రైజ్ పేరుతో ఓ పోస్టర్ ను ఇంస్టాగ్రామ్ ద్వారా విడుదల చేయనున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేయనున్నాడు.

యువీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, హీరోయిన్ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో 2 లతో ఈ సినిమా మేకింగ్ హైలైట్స్ చూపించారు. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ర‌న్‌ రాజా రన్ మూవీతో దర్శకుడైన సుజీత్  దర్శకత్వం వహిస్తున్నాడు.  సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడుతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు.  బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించనున్నాడని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

Other Articles

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *