‘‘సత్యం’’ గొంతులో దిగబడిన కార్పొరేట్ కైజారు..!!

February 17, 2019 | News Of 9

బజాజ్ ఫైనాన్స్ కంపెనీ.
భారత కార్పొరేట్ రంగంలో పెద్ద పేరు.

ఈ కంపెనీపైన మీరు కేసు పెట్టగలరా? వారిపై పోరాటం కలలో ఊహించలేం. కానీ విజయవాడకు చెందిన ఓ సామన్య మానవుడు బజాజ్ కంపెనీ యజమానులపై యుద్ధానికి దిగాడు. విజయవాడకు వచ్చి తనకు జరిగిన అన్యాయంపై గత కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటమే చేస్తున్నాడు.

బాధితుడు: నాగోతు సత్యనారాయణ.
చూడటానికి బక్క పలచగా ఉంటాడు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయే పిట్ట శరీరం. కానీ సత్యం గుండె విజయవాడ ఇంద్రకీలాద్రి కొండంత. ఈ దుష్ట సమాజంపై.. బెజవాడ దుర్గమ్మకున్నంత ఆగ్రహం.

చేయని నేరానికి శిక్ష…చుట్టూ దొంగలా అనుమానపు చూపులు..
ఈ సమాజంలోని వ్యవస్థలన్నీ నిస్సిగ్గుగా ఒక మట్టి మనిషి గుండెల్లోకి విషం పూసిన కత్తులను దింపిన వేళ…
ఇక ఈ శరీరంలో తాను ఉండి.. ఎందుకు అనుకున్నాడు. కానీ చనిపోలేదు. చనిపోతే తప్పు చేశామని ప్రపంచం నమ్ముతుంది అన్న భార్య మాట అతనిలో ధైర్యాన్ని నింపింది. ఆ దుర్గమ్మే తనకు అలా చెప్పించిందని అనుకున్నాడు.

బజాజ్ గ్రూపు కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. రుణాలు ఇచ్చే వ్యాపారం. ఈ కంపెనీ విజయవాడ బ్రాంచిలో డబ్బుల దుర్వినియోగం జరిగిందంట. దీనికి ఎవరు బాధ్యులో మనకు తెలియదు. కానీ కంపెనీ ఆడిటింగ్ సమయంలో బలి ఇవ్వడానికి ఒక బకరా దొరకాలి. ఆ బకరాగా సత్యమేనని కంపెనీని మోసగించిన స్థానిక అధికారులు గుర్తించారు. సత్యం అప్పటికి.. ఫ్లెక్సీ వ్యాపారంలో ఎదుగుతున్న దశ. ఫ్లెక్సీ రంగంలోని పోటీ కంపెనీలు వారే సత్యంను ఇందులో ఇరికించారు. తాను మాత్రం బజాజ్ ఫిన్ కంపెనీ దగ్గర ఎలాంటి రుణాలూ తీసుకోలేదు. ఒక రోజు పోలీసులు వచ్చి సత్యంను స్టేషనుకు తీసుకుపోయారు. లాకప్ లో పెట్టారు. మరి కేసు పెట్టింది ఎవరు? సాక్షాత్తూ బజాజ్ ఫిన్ కంపెనీ వారే కాబట్టి.. పోలీసులు యమ సీరియస్ అయిపోతారు. చట్టం ఎప్పుడూ లేనంత వేగంగా పని చేసింది. కార్పొరేట్ కేసులంటే అందరికీ అత్యంత ఇష్టం. కానిస్టేబుళ్ల దగ్గర నుంచి పై స్థాయులకు వరకూ మేత దొరుకుతుంది.

సత్యంను కిడ్నాప్ చేశారు. ఇంట్లో టీవీలూ, ఇతర సామాన్లను ఎత్తుకుపోయారు. కేసులు కట్టేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. ఇలా రుణాలు తీసుకుని ఎగ్గొడితే, కార్పొరేట్ కంపెనీలు ఎలా బతుకుతాయి అన్నట్లు సమాజంలోని వ్యవస్థలన్నీ రూల్సు మాట్లాడాయి. ఓ పెద్ద మోసగాడిని పట్టుకొచ్చారంటూ పోలీసులను అభినందించినట్లుగా… సత్యాన్ని న్యాయస్థానం బొక్కలో తోసి 17 రోజులు రిమాండుకు పింపింది. చిప్పకూడు తినిపించింది. ఎలాగో జైలు నుంచి బయటకు వచ్చాడు. వ్యవస్థలన్నీ కలిసి దారుణంగా హింసించాయి. తాను నిర్దోషినన్నా వినిపించుకునే నాధుడే లేడు. అయిదేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగాడు.. న్యాయవాదుల చుట్టూ తిరిగాడు. పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగాడు. బజాజ్ ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్నట్లు ఎలాంటి రాతపూర్వక రుజువులనూ బజాజ్ ఫైనాన్స్ కోర్టుకు చూపించలేకపోవడంతో సత్యం మొత్తానికీ విడుదలయ్యాడు. సంబంధిత ఫైళ్లు మిస్సయినట్లుగా కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు ‘‘ది హిందూ’’ పత్రిక 2016లో సత్యంపై రాసిన కథనంలో పేర్కొంది.

కథ ఇక్కడితో అయిపోలేదు.

ఖైదీ… సినిమాలో సూర్యంలా పోలీసులూ, న్యాయవ్యవస్థ, ఆఖరికి న్యాయవాదులు అందరిదీ ఒకటే మాట అన్నట్లు ఒక మంచి మనిషిని వంచించారు. ఆధారాలు లేకపోయినా కార్పొరేట్ సంస్థకే వ్యవస్థలన్నీ కొమ్ముకాశాయి. ఖైదీ సినిమాలో సూర్యం తిరగబడి అడవిలోకి వెళ్లిపోయి దుర్మార్గులపై కక్ష తీర్చుకుంటాడు. జీవితం సినిమా కాదు. చాలా మంది పోలీసుల దాష్టీకాలు భరించలేక, వ్యవస్థ దుర్మార్గాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. సత్యం అలా చేయలేదు.

బజాజ్ నుంచి రుణం తీసుకోలేదని కోర్టు తీర్పు ఇచ్చింది కనుక… తాను పడిన కష్టాలన్నింటికీ కారణమైన బజాజ్ కంపెనీని కోర్టుకు ఈడ్చాడు. తాను ఊరుకుంటే తనలా ఎంతో మంది బలి అయిపోతారనీ, ఎవరో ఒకరు పోరాటం చేయకపోతే తప్పదని అనుకున్నాడు. తనవైపు వాదించిన న్యాయవాదులు కూడా కార్పొరేట్లకు లొంగిపోవడంతో చివరికి తానే న్యాయవాది అయిపోయాడు. కోర్టుల్లో ఎవరి కేసులు వారు వాదించుకునే అవకాశం ఉంది. లా పుస్తకాలు చదువుకున్నాడు. పోలీసులనూ, అడ్డంగా కేసులు వాదించిన లాయర్లనూ, వెనుకా ముందూ ఆలోచించకుండా తీర్పులిచ్చిన న్యాయాధికారులనూ ప్రతివాదులుగా చేసి ఇప్పటికి 30 కేసులు కోర్టుల్లో పడేశాడు. అన్నీ తానే వాదించుకుంటున్నాడు. సత్యం కోసం పోరాటం చేస్తున్న ఈ సత్యాన్ని చూసి ఎక్కడ తమపైన కేసులు పెడతాడోనని భయపడ్డారు కూడా. తిట్టుకున్నవారు ఉన్నారు. కానీ ఒక బక్క వాడు వ్యవస్థల్లోని కుళ్లును ప్రశ్నించే తీరును హైకోర్టు న్యాయమూర్తులు కొందరు మెచ్చుకున్నారు. నువ్వు ఉండాల్సిన వాడివేనన్నారు.

‘‘జడ్జీలను ప్రశ్నిస్తావేంటి? డిమాండు చేస్తావేంటి? న్యాయాన్ని అడుక్కోవాలి..’’ ఇవీ కోర్టులో సత్యానికి సీనియర్ న్యాయవాదులు చెప్పిన మాటలు. ‘నష్టం పోయింది నేను. నేను డిమాండు చేస్తాను’’ అంటూ సత్యం హెచ్చు స్వరంతోనే తన వాదన వినిపించాడు.

‘‘నక్సలైట్ రూట్లో వెళితే… ఏమీ కాదు. నీవి కమ్యూనిస్టు భావాల్లా ఉన్నాయి. ఇలా అయితే కష్టం’’ అని సలహా ఇచ్చారు కొందరు న్యాయ నిపుణులు. అయినా లొంగలేదు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు గట్టిగా నిలబడితే ఏమవుతుందనేది అందరి కళ్లకూ చూపించాడు సత్యం. ‘‘ పెద్ద కోర్టుల స్థాయిలో కూడా కొందరు కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. సామాన్యులను మాత్రం వ్యవస్థలన్నీ కలిసి ఉక్కు పాదంతో తొక్కివేస్తున్నాయి’’ అని అంటాడు సత్యం.

చట్టం అందరికీ సమానం అని రాజ్యాంగం చెబుతున్నది. ‘‘బలమైన వారికి బలహీనంగానూ, బలహీనుల విషయంలో బలంగానూ చట్టం పని చేస్తున్నది’’ అంటాడు సత్యం.

9 నెలల కాలంలో 14 లోన్లు తీసుకున్నాడని బజాజ్ కేసు పెట్టింది. సామాన్యులకు ఇంత ఉదారంగా లోన్లు ఇచ్చేవారు భారతదేశంలోనే ఎవరూ లేరు. బజాజ్ కేసు వీగిపోయిన తర్వాత… తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని సత్యం పోరాటం చేస్తున్నాడు. చాలా మంది సరే, కేసు పోయింది కదా అని వదిలేస్తారు. కానీ సత్యం పోరాటాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఈ సారి కొటక్ మహీంద్రాలో 3 లోన్లు తీసుకున్నట్లు సిబిల్ లో నమోదైంది. మళ్లీ పోరాటం. ఈ సారి కొటక్ బ్యాంకు ఛైర్మన్, సిబిల్ ఛైర్మన్, బజాజ్ ఛైర్మన్ లపై కేసులు నడుస్తున్నాయి. కొటక్ మధ్యలో ఇలా చేయడంపై బజాజ్ కంపెనీ హస్తం ఉండొచ్చునని సత్యం ‘‘న్యూస్ ఆఫ్ 9’’తో వ్యాఖ్యానించాడు.

విజయవాడ పోలీసులు (పటమట స్టేషన్) తనను అనవసరంగా హింసించినపుడు నష్టపరిహారం చెల్లించాల్సింది ఏపీ ప్రభుత్వం అవుతుంది. చేయని నేరానికి ఒక పౌరుడు ఒక కార్పొరేట్ పై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కూడా కార్పొరేట్ వైపునే నిలబడిందని వాపోయాడు. పన్నులు కట్టే పౌరునివైపు కాకుండా ప్రభుత్వ న్యాయవాదులు కార్పొరేట్ కంపెనీకి అనుకూలంగా వాదించడం సత్యాన్ని బాధించింది. చట్టాలను చదువుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా బజాజ్ తరఫున ఎలాంటి ఆధారాలూ లేకపోయినా, కేసుల్ని వాదించేందుకు స్వీకరించడాన్ని కూడా సత్యం తప్పు పట్టాడు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేని కేసుల్ని అడ్వొకేట్లు వాదించరాదని అడ్వొకేట్ చట్టం చెబుతున్నది అని సత్యం మాతో చెప్పాడు. సత్యం తనవైపు ఉన్నపుడు సత్యం భయపడాల్సిందేముంది?

కార్పొరేట్లు మా నోరు కూడా నొక్కేస్తాయని భయపడ్డాడు సత్యం. మేం కూడా ఈ ‘‘సత్యం వధ- ధర్మం చెర’’లో భాగమైపోతామని కూడా సత్యం అనుమానించాడు. అవును. ఇంతకు ముందు అతనికి ఇలాంటి అనుభవాలెన్నో…!!

చేవ చచ్చిన వ్యవస్థలపై పోరాటం చేసే వాడు అరుదుగా లభిస్తాడు. చరిత్ర ఒకవేళ సత్యంను ఎంచుకుని ఉండొచ్చు. సత్యం కథ కొందమంది న్యాయ నిపుణులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఇలాంటి వాడే న్యాయాన్ని బతికిస్తాడు అని మనసులోనే సత్యానికి ఎందరో అభినందనలు చెప్పుకుని ఉండొచ్చు. సత్యం పోరాటానికి నైతిక మద్దతును అందిద్దాం. ఎవరిదైనా జీవితమే. బజాజ్ కంపెనీ కూడా ఈ కేసును సాగదీయకుండా… సత్యంకు జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించి కోర్టు అనుమతితో, ఫిర్యాదీదారు అనుమతితో ఇంతటితో కథను ముగిస్తే మంచిదని విశ్వసిస్తున్నాం.

న్యాయం ఆలస్యం కావడం అంటే… న్యాయాన్ని తిరస్కరించడమే అని జ్యూరిస్ ప్రుడెన్స్ లో ఒక మాట ఉంటుంది. సహజ సూత్రాలకూ, ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా చట్టాలూ, న్యాయాలూ ఎక్కడా ఉండవు. కొందరిలో ఉండే స్వార్థం మరికొందరి జీవితాలను చిదిమేస్తుంది. అంతే… సత్యమేవ జయతే!!

Other Articles

7 Comments

  1. He is not only a blogger, he is a revolutionary person who fight against caste system and also a senior most journalist , man with a infinity knowledge. When I personally met him I understand his concern towards the society..

  2. వీడు చెప్పే సొల్లు వినడానికి ఎవడు లేక ఇక్కడ చెప్పుకుంటున్నాడు. పని పాట లేని పేపర్ వాళ్ళు ఇంకో సొల్లు చెప్పుకోవడం… అసలు వాడు దొంగ. బజాజ్ వాళ్ళు అప్పీల్ వేసినప్పుడు వీడు పోయి స్టే తెచ్చుకున్నాడు. అన్తెహ్ గాని అధరాలు లేవు కదా అని ధైర్యం గా అప్పీల్ ని ఎదుర్కోలేదు.. వీడు దొంగ కాబట్టే అప్పీల్ ని స్టే తెచ్చాడు.. వీడు చేసేది సొల్లు వ్యాపారమ , పరిహారం కావాలంటే కేసు వెయ్యడమే అంద్తే గాని ఈ పేపర్ సోదేంటి.. హిందూ పేపర్ వేసింది ఈ స్టొరీ కాదు .. వీడి మీద ఆధారాలు పక్కఫ్గా వున్నాయి. పోలీస్ లకి డబ్బులిచ్చి అవి కోర్ట్ కి రాకుండా చేసదంద్తే .. ఇప[పుదు వచ్చే పాటికి స్టే తెచ్చుకున్నాడు. నోటీసు ఇచ్చిన పారిపోతాడు సన్నససోడు. వీడు వేసిన ఈ కేసు కూదాస్ ఇప్పడికి గెలవలేదు కనీసం రెస్పాన్దేన్త్స్ కోర్ట్స్ కి కూడా రాలేదు… సొల్లు మాత్రం కోతలు దాటే కబుర్లు చెబుతాడు . వీడు జైలు కి పోవడం మాత్రం ఖాయం… ఇంకా ఈ సొల్లు ఆపుకొని వేరే సోది చెప్పుకోండి..

  3. Hari Priya Narravula పేరుతో ఉన్న వాడు విజయవాడలో ఉంటున్న బజాజ్ ఫైనాన్స్ కంపెనీ బ్రోకర్ బాసిన సూర్య నారాయణ. వీడు ఫేక్ ఐడీ లతో ఈ విధంగా , అసభ్యమైన మాటలుతో, నాకు మద్ధతు ఇస్తున్న మిత్రులు ఫేస్ బుక్ అకౌంట్లలో మరియు న్యూస్ వెబ్ సైట్లులో అక్రమంగా చొరబడి, ఇలాంటి పనికిమాలిన మాటలుతో ప్రజలు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. వీడు ధైర్యంగా ఒరిజినల్ అకౌంట్ తో కామెంట్ చెయ్యలేడు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వారు మీద నేను దాఖలు చేసిన కేసుల్లో 13వ ముద్దాయిగా ఉన్నాడు ఈ ఫేక్ ఐడీతో ఉన్న బాసిన సూర్య నారాయణ అనే వ్యక్తి . అదేవిధంగా ఈ వ్యక్తి మీద విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్లో , ఒక లేడీ డాక్టర్ ని బలాత్కారం చేయబోయాడని, వీడు పెద్ద ఛీటర్ అని కేసులు నమోదు చేసినారు. అటువంటి బజాజ్ ఫైనాన్స్ కంపెనీ బ్రోకర్ బాసిన సూర్య నారాయణ అనే వ్యక్తి ఈ విధంగా కామెంట్ పెట్టారు..ఈ ఫేక్ ఐడీక్రియేట్ చేసి, నా మీద తప్పుడు కామెంట్ పెట్టిన ఈ బ్రోకర్ బాసిన సూర్య నారాయణ మీద విజయవాడలో “సైబర్ క్రైం ” క్రింద కేసు పెడతాను అని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను………బజాజ్ ఫైనాన్స్ కంపెనీ బాధితుడు N.సత్యనారాయణ

  4. evado sodhi neekendhuku … Thamaru stay thechukunnara ledhaaa. adhi cheppu. nuvvu cheppe kadhaki high court web site documents ki asalu link ledhu. thamaru show cheyyatam kosam ee story veskuntunnaru… Straight forward question nuvvu stay thechukunnava ledhaaa … thats all … asalu nuvvesina cases lo evadina court ki vachada …. neeku sakyam cheppina Vallabhaneni meedha 4 CID cases vunnayi. 2007 nunchi court ki attend avuthunnadu . so nee case laki bayapadda vaadu evadina vunnada…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *